నా ప్రియ స్నేహితులారా, నేటి దినమున మనము వర్థిల్లతను పొందుకొను మార్గములో దేవుడు మనలను నడిపించుటకు నేడు ఆయన మీతో కూడా ఉన్నాడు. కనుకనే, మీరు దేనినిమిత్తము విచారించకండి. ధైర్యంగా ఉండండి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:14 వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు'' అని చెప్పబడిన ఈ వాగ్దానము ప్రకారం నేడు మీ యొద్దకు వచ్చుచున్నది. ఆయన మిమ్మును ఈ లోకములో ఘనత వహించువారినిగా చేస్తాడు. కనుకనే, ప్రభువునందు మీరు ఆనందించండి.
బైబిల్లో యెషయా 50:6-7వ వచనములను మనము ధ్యానించినట్లయితే, "కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికి వేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మి వేయువారికిని, అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు. ఎందుచేతనను, ప్రభువగు యెహోవా మాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకి రాతివలె చేసికొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నా యొద్దకు రానిమ్ము''అని చెప్పినట్లుగానే, 'ఆయన మనకు న్యాయము జరిగిస్తాడు. మన జీవితము నిస్పృహలో అంతము కావడం ఆయన అనుమతించడు, అది మనము కలిగియున్న నిరీక్షణ. అది మన యొద్దకు కూడా వస్తుంది. ఎందుకనగా, మన జీవితము ఎప్పుడు కూడా నిస్పృహలో అంతమగునట్లుగా అనుమతించడు. నా ప్రియులారా, నేడు మీరు ఒకవేళ, నిస్పృహ ద్వారా వెళ్లుచున్నారేమో?ప్రజలు మిమ్మును ఎగతాళి చేస్తున్నారేమో? మీరు దీనికి తగినవారు కాదని ప్రజలు అంటున్నారేమో? ప్రజలు మీకు అవమానమును తీసుకొని వస్తున్నారేమో? లేక సమస్యలను బట్టి ప్రజలు ఈలాగున అంటున్నారేమో? మీరు అనుభూతి చెందుచున్న శ్రమలను బట్టి మిమ్మును కించపరచుచున్నారేమో? మీ దేవుడు ఎక్కడ? మీరు ఆయనను గురించి మాట్లాడుచున్నారు కదా! ఆయన మీకు ఈ మార్గమును ఎందుకు అనుమతించాడు? అని అంటుండవచ్చును.
నా ప్రియులారా,తద్వారా, ఒకవేళ మీరు సిగ్గుతో తలదించుకున్నారేమో? ఈ మార్గము గుండా మనము వెళ్లడానికి ఎందుకు అనుమతించాడు? ప్రజల యొక్క దుర్మార్గతను మీకు చూపించు నిమిత్తమే. వారిలో ఎవరి యందు నిరీక్షణ ఉంచకూడదని మీకు తెలియజేయడానికి మాత్రమే. వారు మనకు రక్షకులుగా ఉంటారన్నట్లుగాను, ఇంకను మనలను అవమానము నుండి లేవనెత్తు దేవుని మనము గుర్తెరుగునట్లుగాను, ఆయన ఎంత శకిమంతుడుగా ఉన్నాడని తెలుసుకొనునట్లుగాను, ఆయన మీకు ఎంతగా ఔనత్యమును ఇవ్వాలని కోరుచున్నాడో, అంత ఎక్కువగా ఆయన మిమ్మును మరియు మీ ఆలోచనల నుండి ఔన్నత్యముగా లేవనెత్తువాడై యున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు మీ కొరకు చేయడానికి ప్రభువు మీతో ఉన్నాడని గుర్తిస్తారు. మీరు ఆయనను హత్తుకొని ఉంటారు. ఆలాగుననే, నా జీవితములో నేను కూడా ఈ మార్గముగుండా వెళ్లాను. గొప్ప అవమానము అది నాకు నేర్పించినది. దేవుడు నన్ను పైకి లేవనెత్తు సమయము ఆసన్నమైనదన్న సహనమును నాకు నేర్పించినది. తద్వారా ఆయన నా జీవితమును అంతము చేయలేదు. ఆలాగే, నా హృదయములోనికి మనుష్యుల యొక్క పొగడ్తలను ఎన్నటికిని తీసుకొనను. అట్టి పొగడ్తలను కూడా దేవునికి వందన సమర్పణ పంపిస్తుంటాను. 'ప్రభువా, ఈ లోకములో నేను పొగడ్తలను పొందుకొనునట్లుగా నన్ను చేసియున్నావు, నేను ఆ పొగడ్తలను కూడా నీకు సమర్పించుచున్నాను, నీకే మహిమ కలుగును గాక అని చెబుతాను. తద్వారా, ఆయనతో కూడా నడిచేవానిగా మరియు ఆయనలో ఆనందించేవానిగాను, నన్ను ఆయన మార్చాడు. ఇట్టి అద్భుతమైన వాగ్దానము బట్టి, ఆయనకు వందనాలు చెల్లిదామా? నా ప్రియులారా, నేడు మీరు కూడా తోకగా ఉన్నారని చింతించుచున్నారా? దిగులుపడకండి, మీ జీవితాలను దేవునికి సమర్పించండి, ఆయన మిమ్మును నేటి వాగ్దానము ద్వారా తలగా ఉంచుతాడు కానీ, తోక కాకుండా, మిమ్మును పైకి లేవనెత్తి మిమ్మును దీవిస్తాడు.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ విఫలం కాని వాగ్దానాలను నమ్ముతూ, కృతజ్ఞతగల హృదయంతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, అవమానాన్ని అధిగమించి, నీ ఆశీర్వాదం యొక్క సంపూర్ణతలో నడవడానికి, తోకగా కాకుండా తలగా ఉండటానికి మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, నీవు తలగా చేస్తావని వాగ్దానము చేసియున్నావు. ప్రభువా, మా అవమానము నుండి పైకి లేవనెత్తతాను అని వాగ్దానము చేసినందుకు నీకు వందనాలు. యేసయ్యా, నీ బిడ్డలైన మమ్మును ఎన్నడు కూడా అంతము కాకుండా, క్రిందికి పడిపోకుండా ఉండునట్లుగాను, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురునట్లుగా మమ్మును జ్ఞాపకము చేసుకున్నందుకై నీకు వందనాలు. దేవా, నీ బిడ్డలమైన మేము దేశము యొక్క ఉన్నత స్థలములలో మమ్మును నివసింపజేసి, మా కొరకైన నీ చిత్తమును మా పట్ల బయలుపరచుము. దేవా, మేము నీ మార్గములో నడవడానికి మమ్మును నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. యేసయ్యా, ఈ వాగ్దానము మా జీవితములో నెరవేర్చుము, మేము చేయుచున్న ప్రతి కార్యములలో ఔనత్యములోనికి మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, మమ్మును తలగా చేయుము కానీ, తోక వలె కాదు. దీనిని చూచిన ప్రజలు నీవు మా ద్వారా చేయు అద్భుత కార్యములను చూచి, మా ద్వారా నిన్ను ఘనపరచునట్లు చేయుము. ప్రభువా, మేము నీ పరిపూర్ణ చిత్తానికి లోబడునట్లుగాను మరియు నీ సమయానికి సహనముతో వేచియుండునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుమని యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


