నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మలాకీ 4:2వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు'' అని చెప్పబడిన ప్రకారము యేసు మనకు నీతి సూర్యుడుగా ఉన్నాడు. అవును, నీతి వచ్చినప్పుడు స్వస్థత మనకు లభిస్తుంది. కనుకనే, దేవుడు మీ జీవితంలోనికి నీతిని మరియు స్వస్థతను తీసుకురావాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. కాబట్టి, ఈ రోజు మీ జీవితమును యేసుప్రభువు చేతులకు సమర్పించుకుంటారా? ఆలాగైతే, ప్రభువుతో, చెప్పండి, "దేవా నన్ను శుద్ధీకరించుము. దేవా, నా జీవితములో చేసిన తప్పిదములను దయతో క్షమించుము. దేవా, మేము నీతిమార్గములో నడుచుటకు మాకు సహాయము చేయుము' అని చెప్పినప్పుడే, ' నా యొక్క జీవితంలో స్వస్థతను పొందుకొని ఆరోగ్యముగా నడవగలను. నా జీవితములో నేను కోల్పోయినవన్నీ సమస్తమును నాకు తిరిగి వచ్చును. దురాత్మలు మరియు దుర్మార్గులు నన్ను ఎన్నటికిని తాకకుండా చేయము అని చెప్పి,' మనం నీతి మార్గం వైపు తిరుగుదాం.

రెండవదిగా, బైబిల్ నుండి యెషయా 58:7-8వ వచనములలో ఇలాగున తెలియజేయుచున్నది, " నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును'' ప్రకారము మనం ఆకలితో ఉన్నవారిని, పేదవారిని, ఇళ్లు లేనివారిని, బట్టలు లేకుండా దిగంబరంగా ఉన్నవారిని మన సొంతవారిగా చూసుకుని, వారికి సహాయం చేసినప్పుడు, మన యొక్క నీతి మనకు ముందుగా నడుస్తుంది. దేవుడు మనలను పరిశుద్ధంగా జీవింపజేస్తాడు. యేసు యొక్క నీతి గల ఆత్మ మనలోనికి వచ్చును. అందుకే మనకు సీషా మరియు యేసు పిలుచుచున్నాడు సేవలు కలవు. రోజుకు ఇరవై నాలుగు గంటలూ, మేము తమ జీవితాలలో అవసరతలలో ఉన్న ప్రజలతో కలిసి ప్రార్థించుచున్నాము. అందుకే, యేసు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ' భూమి మీద ఇద్దరు ఏకీభవించినట్లయితే, పరలోకంలో ఉన్న నా తండ్రి ద్వారా అది నెరవేర్చబడుతుంది.' అందుకే, అవసరతలలో ఉన్న ప్రజలతో కలిసి ప్రార్థించడానికి మేము 24 గంటలూ వారితో కలిసి ప్రార్థించుటకు ఇక్కడ ఉన్నాము. ఆలాగుననే, మేము నిరుపేదలను, ఆహారము లేనివారిని, బట్టలు, ఇళ్లు, విద్యలేని అట్టి వారిని కూడా సీషా ద్వారా ఆదుకుంటున్నాము. కనుకనే, దేవుడు ఈ పరిచర్యను మరియు మా పేర్లను కూడా కాపాడుచున్నాడు. మీరు సీషా మరియు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో భాగస్థులుగా ఉన్నట్లయితే, ఈ పరిచర్యలో ఉన్న అవసరతలను తీర్చడానికి సేవ చేయుచూ, ప్రార్థించుచూ, కానుకలు సమర్పించినప్పుడు, దేవుని నీతి మీ మీదికి దిగివస్తుంది. ఆయన మీ పేరును కాపాడుతాడు, తన చిత్త ప్రకారం మీరు నడిపించబడతారు, ప్రజల దృష్టిలోను మరియు దేవుని దృష్టిలోను మీకు దయ కలుగుతుంది మరియు దుష్టుల దాడి నుండి, సాతాను దాడి నుండి మిమ్మల్ని కాపాడుతాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, మనం దేవుని ప్రజలకు సేవ చేసినప్పుడు, నీతిమార్గంలో నడవడానికి దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 13:1-5వ వచనములలో మనము చూచినట్లయితే, " తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగినవాడై, లోకములోనున్న తన వారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను'' అని సెలవిచ్చిన ప్రకారము యేసు తన శిష్యులను అంతము వరకు ప్రేమించాడని చెప్పబడియున్నది. ఆయన ఒక తువ్వాలు తీసుకుని, తన నడుముకు కట్టుకుని, ఒక సేవకునిలా వారి పాదాలను కడిగాడు. వారు, 'ప్రభువా, మేము నీ పాదాలు కడగాలి ' అని చెప్పినప్పుడు కూడా, అందుకు యేసు 'నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందురనియు, నేను చూపిన మాదిరిలో మీరు అనుసరించవలెనని' చెప్పెను. ఇంకను ఆయనను అప్పగించిన వాని పాదాలను కూడా కడిగెను. ఆయన అతనికి ప్రేమను చూపించాడు మరియు ఆ ప్రేమ అతడు తాళలేనంత అత్యధికముగా ఉండెను. అవును, యేసు తన శిష్యుల పట్ల శ్రద్ధ చూపించి, వారికి ఆహారం పంచిపెట్టెను. అందుకే బైబిల్ నుండి యోహాను 21:5-9వ వచనములలో చూచినట్లయితే, 'యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను.' అవును, ఆయన వారి కోసం వంట చేశాడని చెప్పుచున్నవి. నా ప్రియ దేవుని బిడ్డలా, మీరు దేవుని సేవకులా? అయితే, ఆయన మీకు మరియు మీ కుటుంబానికి ఆహారాన్ని అందిస్తాడు. ఆయన పరిచర్య యొక్క అన్ని అవసరతలను తీరుస్తాడు. మరియు మీరు, దేవుని సేవకులుగా, దేవుని యొక్క ఇతర సేవకులను కూడా జాగ్రత్తగా చూసుకోండి. వారి పాదాలు కడగండి, వారి అవసరాలను తీర్చండి, అప్పుడు ప్రభువు మీ నీతిని లోకమంతటా ప్రకాశవంతమైన వెలుగులా ఉదయించునట్లుగా చేస్తాడు. ఈ కృపను దేవుడు నేడు మీకు అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవే మా నీతి సూర్యుడవు. కనుకనే, దేవా, నీ అమూల్యమైన రక్తంతో మా జీవితాన్ని కడిగి శుద్ధీకరించి, మా దోషములన్నింటిని క్షమించుము. ప్రభువా, మేము నీ యొక్క నీతి మార్గంలో నడవడానికి మరియు నీ స్వస్థతను మేము పొందుకొనడానికి దయచేసి మాకు సహాయం చేయుము. దేవా, నీ సేవకులను మరియు ఇతరులను మా సొంతవారినిగా చూసుకోవడానికి మాకు నేర్పించుము. యేసయ్య, నీ యొక్క నీతిగల ఆత్మతో మమ్మును నింపుము మరియు మా పేరును, మా జీవితాన్ని కాపాడుము. ప్రభువా, మా ద్వారా నీ వెలుగు ప్రకాశించునట్లుగా చేయుము. దేవా, మా ఆహారమును ఆకలిగొనినవారికి పెట్టుటయు, మా రక్త సంబంధులకు ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను మా యింట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు మాకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు మాకు నేర్పించుము. ప్రభువా, మేము ఆలాగున చేయునట్లుగాను, నీ వెలుగు వేకువ చుక్కవలె మా మీద ఉదయించునట్లుగాను, మాకు స్వస్థత శీఘ్రముగా లభించునట్లుగాను, నీ నీతి మా ముందర నడచునట్లుగాను, నీ యొక్క మహిమ మా సైన్యపు వెనుకటి భాగమును కావలికాయునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.