నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 10:41వ వచనమును మన కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, " ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును'' ప్రకారము దేవుడు మీకు ప్రవక్త ఫలమును అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. ప్రవక్త యొక్క ఫలము అనగా ఏమిటి? ప్రవక్త దేవుని యొద్ద నుండి వచ్చు వాక్కును మాట్లాడువారుగా ఉన్నాడు. కనుకనే, ఎవరైనను, అట్టి దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ప్రవక్తను అంగీకరించినట్లయితే, వారు ప్రవక్త యొద్ద నుండి వాక్కును స్వీకరించినవారుగా ఉంటారు. ఒక వ్యక్తి ప్రవక్త అతనిని గానీ, లేక ఆమెను గానీ, స్వీకరించినవారిగా ఉన్నట్లయితే, ఆ ప్రవక్త యొక్క పరిచర్య, ఆ ప్రవక్త యొక్క పని, పరిచర్య వ్యక్తిగత అవసరతలను సంధించే రీతిలో ఆ యొక్క ప్రవక్తకు సహకరించినట్లయితే, దేవుడు ప్రవక్తను అంగీకరించిన అట్టి వారిని ఘనపరచుచున్నాడు. ఎంతో బీదరాలైన ఒక విధవరాలికి ఏలీయా దేవుని వాక్కును అందించియున్నాడు. 'నీవు నా కొరకు ఒక రొట్టెను, లేక చపాతీ సిద్ధము చేసుకొని తీసుకొని వచ్చి నాకు ఇచ్చి, తదుపరి మీ కొరకు సంసిద్ధము చేసుకోండి' అని చెప్పాడు. అయితే, ఆ విధవరాలు ఏలీయాతో ఈ విధంగా చెప్పెను, ' అయ్యా, నా యొద్ద కొంచెము పిండియు, కొంత నూనె మాత్రమే ఉన్నది. ఇది నాకును, నా కుమారునికి ఒక్క రొట్టె, ఒక్క రోటీకి మాత్రమే సరిపోతుంది అని చెప్పినది.' ఆ తర్వాత మాకు భుజించుటకు ఏమియు కూడా లేదు. దానిని తిని మేము చనిపోబోవుచున్నాము అని చెప్పెను. అందుకు ప్రక్తయైన ఏలీయా ఈలాగున తెలియజేసెను, దేవుని యొక్క వాక్కు సెలవిచ్చుచున్నది, 'నేను దేవుని పనిని జరిగించులాగున, మొదటిగా నాకు ఆహారము సంసిద్ధము చేయుము. ఆ తర్వాత, పిండియు, నూనెయు, మీరు రాబోవుచున్న భవిష్యత్తుకాలమంతయు మీకు సరిపోతుందని చెప్పెను.' అక్షరాల ఆ విధంగానే, జరిగియున్నది. విధవరాలు ఆమె కుమారుడు కూడా జీవించనంతకాలము వారికి పిండియు, నూనెయు కొరత కలుగలేదు.

రెండవ సంఘటనను మనము చూచినట్లయితే, 2 దినవృత్తాంతములు 20:20వ వచనములో చూడగలము. " అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను'' ప్రకారం తనను మరియు తన రాజ్యమును నాశనము చేయుటకు వచ్చుచున్న శత్రువు సైన్యమును గురించి, యెహోషాపాతు, ఈలాగు సెలవిచ్చుచూ, తన ప్రజలందరికి తెలియజేశాడు, ' దేవుని ప్రవక్తలు సెలవిచ్చిన దానిని జరిగించండి. ప్రవక్తల యందు మీరు నమ్మికయుంచండి. మీరు కృతార్థులగుదురు, అప్పుడు విజయము మిమ్మును వెంబడిస్తుంది' అని పలికెను. ఇంకను ప్రకటన 19:10వ వచనములో చూచినట్లయితే, "అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు-వద్దు సుమీ: నేను నీతోను, నీ సహోదరులతోను ప్రవచించిన యేసుక్రీస్తునకు సాక్షులైన వారితోను సహ సేవకుడను; దేవున్ని నమస్కరించుము; ఏలయనగా యేసుక్రీస్తునందలి ప్రవచనము అనుగ్రహించుట ఆత్మ యొద్దనే యున్నదని చెప్పబడింది'' ఆలాగుననే, యేసును గూర్చి సాక్ష్యము ప్రవచనానుసారమైనదని బైబిల్ చెబుతుంది. ప్రవక్త అను వ్యక్తి ద్వారా ప్రభువు మాట్లాడిన ప్రతి ఫర్యాయము కూడా యేసు ప్రత్యక్షపరచబడి, యేసు కోసమై మార్గము తెరువజేయబడుతుంది. రెండవదిగా, ప్రకటన 12:10-11లో చూచినట్లయితే, ప్రవక్త ద్వారా ప్రవచనము బయలు వెడలి వచ్చినప్పుడు, అపవాది యొక్క ఆటంకము మెరుపువలె పతనమై పోతుంది. మార్గము ప్రత్యక్షపరచబడుతుంది. ఆలాగుననే, లూకా 10:18లో కూడా ఇదే సంగతి చెప్పబడియున్నది. మూడవదిగా మార్కు 11:23లో చూడండి, దేవుని యొక్క ప్రవక్త ద్వారా ప్రవచన వాక్యము పలుకబడియున్నప్పుడు, అది ఆర్థికమైనను, బాంధవ్యమైనను, బిడ్డలైనను సరే, అక్కడ లేనివన్నియు కూడా నెరవేర్పులోనికి లేక ఉనికిలోనికి రావడము జరుగుతుంది. అది కొంతకాలము వరకు వేచియుండవచ్చునుగానీ, ప్రవచనము నెరవేర్చబడుటకు కొంత సమయము తీసుకుంటుంది. కానీ, నిశ్చయముగా అది నెరవేర్చబడుతుంది. ప్రవచనములను నమ్మండి మరియు ప్రవక్తలను నమ్మండి. అందుకే, హబక్కూకు 2:2,3వ వచనములలో చూచినట్లయితే, " ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును '' ప్రకారము తప్పకుండా దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగుతుంది.

అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుని ప్రవక్తగా ఉండడానికి ఇట్టి కృప మీకును కూడా అనుగ్రహించబడుతుంది. బైబిల్ నుండి 1 కొరింథీయులకు 14:22వ వచనములో చూచినట్లయితే, " కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై యున్నది'' ప్రకారము దేవుడు మిమ్మును క్రొత్త భాషలతో మాటాలాడింపజేస్తాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కులు పరిశుద్ధాత్ముని యొక్క భాషలుగా ఉన్నవి. మీ ఆత్మలో ఉన్న దేవుని యొక్క ప్రత్యక్షతలను మీరు ప్రవచనాత్మకంగా ఆ విధంగా అనువాదము చేసి, తెలియ చెప్పగలుగుతారు. దేవుడు ఈ కృపను మీకనుగ్రహించును గాక. ప్రవచనము ద్వారా మిమ్మును నడిపించి, మీ జీవితములో అనేక కార్యములు జరిగించబడుడానికి ప్రవచనము అనుగ్రహించును గాక. దేవుడు ఈ రోజున ఇట్టి ఆశీర్వాదము చేత మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ప్రవచనాత్మకమైన అభిషేకము ద్వారా మమ్మును అభిషేకించుము. మాకు ఇట్టి కృపను అనుగ్రహించుము. దేవా, నీ యొక్క ఆశీర్వాదములోనికి, వర్థిల్లతలోనికి, భత్రలోనికి, శాంతిలోనికి మమ్మును నడిపించుము. ప్రభువా, నీ సేవకులను ఘనపరచడానికి మరియు విశ్వాసంతో నీ వాక్కును స్వీకరించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితములో సదుపాయం, కాపుదల మరియు సమృద్ధిని విడుదల చేయుము. ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క ప్రవచనాత్మక కృపతో మమ్మును అభిషేకించుము. దేవా, పరిశుద్ధాత్ముని యొక్క భాషలు మాకు దయచేయుము, మా ఆత్మలో ఉన్న దేవుని యొక్క ప్రత్యక్షతలను నీవు ప్రవచనాత్మకంగా ఆ విధంగా అనువాదము చేసి, తెలియ చెప్పగలుగు కృపను మాకు నేడు అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.