నా ప్రియమైన స్నేహితులారా, ఈ నూతన మాసములో అడుగిడిన మీకందరికి నా శుభములు. బైబిల్ నుండి యెహెజ్కేలు 34:26వ వచనమును మీకు వాగ్దానముగా ఇచ్చుచున్నాడు. ఆ వచనము, "...ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును'' అని చెప్పబడిన ప్రకారము, ప్రభువు, ' నేను మీ మీద దీవెనకరమగు వర్షమును కురిపిస్తాను' అని ఈ నెలలో ప్రభువు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఆ వర్షం పరిశుద్ధాత్మయే. కనుకనే, అది మీ జీవితంలోని ప్రతి ఎండిన భూభాగాన్ని పునరుద్ధరించే దైవీక వర్షం. వర్షము ఎండిన భూమి మీద పడి, దానిని తడిపి, ఫలములను ఇచ్చినట్లుగానే, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చి మిమ్మల్ని ఫలింపజేయును. అందుకే బైబిల్ నుండి లూకా 1:35 వ వచనములో చూచినట్లయితే, దేవదూత మరియకు ప్రత్యక్షమైనప్పుడు, ఆ దూత ఈలాగున సెలవిచ్చెను. " దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును'' అని చెప్పెను. చూడండి, మరియ ఒక సాధారణమైన స్త్రీ, కానీ పరిశుద్ధాత్మ ఆమె మీదికి వచ్చినప్పుడు, క్రీస్తు ఆమెలో రూపాంతరం చెందాడు, కనుకనే, అసాధ్యమైనది సాధ్యముగా మార్చబడినది. అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు అదే ఆత్మ ఈరోజు మిమ్మల్ని కూడా నింపాలని మీ పట్ల కోరుకుంటుంది. మీరు బలహీనంగా లేదా మరచిపోయినట్లుగా అనిపించవచ్చును. కానీ, ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మ మీ మీదికి దిగివచ్చినప్పుడు, మీలో దైవీకంగాబలం వృద్ధిపొందుతుంది. అంతమాత్రమే కాదు, దేవుని శక్తి మిమ్మల్ని ఫలించునట్లుగా చేయుచున్నది. పరిశుద్ధాత్మ శక్తి , మీ జీవితంలో యేసును ప్రత్యక్షపరుస్తుంది మరియు మీ ఆశీర్వాదాలను వెయ్యిరెట్లు వృద్ధిపొందింపజేస్తుంది. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.
నా ప్రియ స్నేహితులారా, నేడు పరిశుద్ధాత్మ మిమ్మును నింపినప్పుడు, మీ యొక్క ప్రతి బంధకాల సంకెళ్లు తెగిపోతాయి. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 3:17వ వచనములో చూచినట్లయితే, "ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాత్రంత్యము నుండును'' అని సెలవిచ్చినట్లుగానే, ప్రభువే ఆత్మ. కనుకనే, ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాత్రంత్యము ఉంటుంది. ఆ స్వాతంత్య్రము ద్వారా ఆయన మిమ్మల్ని యేసు స్వరూపంలోనికి రూపాంతరపరుస్తాడు. ఇంకను బైబిల్ నుండి 2 కొరింథీయులకు 3:18వ వచనములో చూచినట్లయితే, "మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము'' అని చెప్పిబడినట్లుగానే, ప్రభువగు ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, మనము ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడతాము. అంతమాత్రమే కాదు, మనము ఇతరులను, ' క్షమించడానికి, స్వస్థపరచడానికి మరియు సమాధానముతో నడవడానికి ఆత్మ మీకు శక్తిని ఇస్తుంది. నా ప్రియమైన స్నేహితులారా, అదే శక్తి ఇప్పుడు మీ మీదికి దిగి వస్తుంది. అంతమాత్రమే కాదు, మీరు క్షమించినప్పుడు, మీ హృదయం విశ్రాంతి పొందుతుంది, మీలో నుండి అనారోగ్యం పారిపోతుంది మరియు నష్టాలు లాభాలుగా మారుతాయి మరియు మీ దుఃఖము సంతోషముగా మారుతుంది. ప్రియులారా, మీ కుటుంబంలో యేసు ఇచ్చు సమాధానము పొంగిపొర్లుతుంది. ఇది దైవీక వర్షం - మీ హృదయంలోని ప్రతి మూలకు నూతన జీవితాన్ని, నూతన ప్రేమను మరియు నూతన ఆనందాన్ని తీసుకొని వచ్చే దీవెనకరమగు వర్షపు జల్లులుగా ప్రవహిస్తుంది.
చివరగా, నా ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ సమాధానము అనుగ్రహించడమే కాకుండా మిమ్మల్ని యాజకులుగా మరియు ప్రవక్తగా కూడా చేయుచున్నది. బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 10:38వ వచనములో చెప్పబడినట్లుగానే, " అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను'' ప్రకారము ఆయన పాపాలను క్షమించే యాజకునిగాను మరియు హృదయాలను పరిశీలించే ప్రవక్తగాను మారాడు. అదే ఆత్మ దేవుని సందేశాన్ని ఇతరులకు తీసుకురావడానికి మిమ్మల్ని బలవంతులనుగా చేయుచున్నది. నా ప్రియులారా, మీరు ఆదరణ, స్వస్థత మరియు ప్రత్యక్షత గల మాటలు మాట్లాడతారు. సమరయ స్త్రీ వలె, మీరు యేసు నుండి జీవజలాన్ని పొందుకొని అనేకులను ఆశీర్వదిస్తారు. అంతమాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటారు. కాబట్టి, నా ప్రియులారా, ఈరోజు దేవునికి మొఱ్ఱపెట్టండి, ' ప్రభువా, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపుము. నన్ను ఆశీర్వాదకరంగా మార్చుము' అని చెప్పినప్పుడు, ప్రభువు మిమ్మల్ని క్షమించే యాజకునిగాను మరియు ప్రవచనమును బయలుపరచే ప్రవక్తగా మరియు జయించేవారినిగా అభిషేకిస్తాడు. నా ప్రియులారా, ఈ నవంబర్ నెల మీ మీద మరియు మీ కుటుంబము మీద ఆశీర్వాద జల్లులతో నింపబడుతుంది! కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఈ నూతన మాసమంతయు మిమ్మును దేవుని ఆత్మతో నింపి, దీవెనకరమగు వర్షమును మీ మీద మరియు మీ కుటుంబ మీద కుమ్మరించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా మీదికి నీ యొక్క పరిశుద్ధాత్మను పంపినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మా జీవితం మీద నీ ఆశీర్వాదపు జల్లులను కురిపించుము. దేవా, మమ్మును నీ దైవిక శక్తితో నింపుము మరియు బలహీనతలన్నిటిని మా నుండి తొలగించుము. యేసయ్యా, ఇప్పటి నుండి మమ్మును నీ యొక్క స్వరూపంలోనికి మార్చుము. దేవా, మమ్మును బాధపెట్టిన ప్రతి ఒక్కరినీ నీ ఆత్మ శక్తి ద్వారా క్షమించే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా హృదయంలో మరియు మా ఇంట్లో నీ శాంతి సమాధానమును ఏలునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా యొక్క ప్రతి బంధకాలన్నిటిని విడగొట్టి, నీ ఆత్మ ద్వారా మాకు స్వాతంత్య్రమును మరియు విడుదలను మా మీదికి దిగివచ్చునట్లుగా నీ కృపను దయచేయుము. ప్రభువా, నీ మహిమను బయలుపరచడానికి మమ్మును నీ యొక్క యాజకులనుగాను మరియు ప్రవక్తలనుగాను మార్చుము. దేవా, ఇతరులకు క్రీస్తు నిరీక్షణతో మా జీవితాన్ని ప్రకాశింపజేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


