నా ప్రియ స్నేహితులారా, మనము నూతన సంవత్సరములోనికి అడుగుపెట్టియున్నాము. ఈ రోజు ప్రభువు మిమ్మును మరి విశేషముగా దీవించబోవుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 10:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడు అని లేఖనము చెప్పుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు ఎటువంటి పరిస్థితులనైనను, తలక్రిందులుగా మార్చగల సమర్థుడైయున్నాడు. ప్రభువు మీ యొక్క అవమానమంతటిని కూడా ఘనతగా మరియు హెచ్చింపుగా మార్చివేయగలడు. ప్రజలు మీకు కీడును మరియు నష్టమును కలుగజేయాలనియు ప్రణాళికను చేయవచ్చును. అయితే, ప్రభువు అంతటిని మేలు కొరకు మార్చివేస్తాడు. మీరు ఎన్నడును సిగ్గునొందరు అని బైబిల్ గ్రంధములో దేవుని వాక్యము తెలియజేయుచున్నది. అంతము ఎంతో మహిమకరముగా మీకు ఉండబోవుచున్నది. దేవుని ఆశ్రయించు వారందరు కూడా ఎన్నటికిని సిగ్గునొందనే నొందరు. స్నేహితులారా, మీకు అద్భుతమైన భవిష్యత్తు కలుగబోవుచున్నది. అందుకే బైబిల్ నుండి సామెతలు 23:18వ వచనములో చూచినట్లయితే, "నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు'' అని దేవుని వాక్యములో చెప్పబడిన ప్రకారము మీ యొక్క కష్టమైన పరిస్థితులలో కూడా మీకు మంచి భవిష్యత్తు ఉండబోవుచున్నదన్న నిరీక్షణ మీకు కలుగబోవుచున్నది. కాబట్టి, మీరు ఎన్నడు కూడా నిరాశ చెందనే చెందరు. మీరు ధైర్యముగా ఉండండి.

అందుకే బైబిల్ నుండి హబక్కూకు 2:4వ వచనములో చూచినట్లయితే, "వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును'' అని చెప్పబడిన ప్రకారము నీతిమంతులు తమ పూర్తి నమ్మకమును మరియు విశ్వాసమును యేసయ్య మీదనే ఉంచుతారు. ప్రభువు మిమ్మును ఎన్నడును నిరాశ చెందనివ్వడు. నీతిమంతులు తమ విశ్వాసము మూలముగా జీవించుదురు. మనము కేవలము ఆయనను విశ్వసించాలి. ఇంకను ఆయన వాక్యమునందు విశ్వాసముంచాలి. ఆయన వాగ్దానములను విశ్వసించాలి. నూతన నిబంధనలో, రోమా శతాధిపతి అదే కార్యమును చేసియున్నాడు. కనుకనే, బైబిల్ నుండి మత్తయి 8:5-10వ వచనములలో గనుక మనము చదివి చూచినట్లయితే, "ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను'' ఆ ప్రకారముగానే అతడు ఒక రోమీయుడు, ఒక రోమీయుడు యూదులను విశ్వసించడము ఎంతో కష్టతరము. అయితే, యూదుడైనటువంటి యేసయ్యను ఆ రోమీయుడు విశ్వసించాడు. ఆ శతాధిపతియైన రోమీయుడైన సేవకుడు పక్షవాతముతో బాధపడుచుండెను. తన సేవకుని స్వస్థపరచమని అతడు ఎంతగానో బ్రతిమిలాడుకొనెను.

అప్పుడు, యేసుప్రభువు, "నేను మీ గృహమునకు వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా'' ఆ శతాధిపతి, 'ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద ఎంతో మంది సైనికులున్నారు;'' అని చెప్పి, అయినప్పటికిని, ' నేను నీ వాక్కునందు విశ్వాసముంచుచున్నాను ప్రభువా,' ఇంకను నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, అయినప్పటికిని, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను' ఆ ప్రకారము ఆ శతాధిపతి యొక్క విశ్వాసము చొప్పున అదే సమయములో తన దాసుడు స్వస్థతను పొందియున్నాడు. శతాధిపతి యొక్క విశ్వాసమును యేసయ్య ఎంతగానో మెచ్చుకొనియున్నాడు. అందుకు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్న వారిని చూచి, " ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను'' అని సెలవిచ్చాడు. నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా, యేసయ్యను గట్టిగా పట్టుకొని, ఆయన యందు విశ్వాసముంచుచూ, ఆయనను హత్తుకొనియున్నారేమో! అయితే, మీరు అన్ని వైపుల నుండి ఒత్తిడి కలుగుచూ, అణగద్రొక్కబడుచున్నారా? అందువలన, మీరు చింతించుచున్నారా? అయినప్పటికిని, మీరు యేసయ్యను గట్టిగా పట్టుకొనియున్నారా? మీరు ఎన్నటికిని నిరాశ చెందరు నా ప్రియ స్నేహితులారా. దేవుని యొక్క వాగ్దానములను మీరు గట్టిగా పట్టుకొనియున్నప్పుడు, మీరు ఎన్నటికిని అవమానము చెందడానికి ప్రభువు అనుమతించడు. కేవలము, స్నేహితులారా, ఆయన యందు విశ్వాసముంచండి, యేసయ్యను విశ్వసించండి. ఆయనను ఎప్పుడు విడిచిపెట్టకండి. నా ప్రియులారా, మీ జీవితములో దేవుని మాటలు నెరవేరుతాయి. ఈ రోజు మీ అవమానమునంతటిని ఆయన ఘనతగా మార్చబోవుచున్నాడు. కనుకనే, మీరు భయపడకండి, నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నీ యందు ఉంచుచున్న విశ్వాసమును బట్టి, మా జీవితములోనికి నీ యొక్క ఆశీర్వాదములను వచ్చు నట్లుగా చేయుము. దేవా, మేము నీ మీద విశ్వాసం ఉంచుచున్నాము, నీ ఆశీర్వాదాలు మా జీవితంలోనికి వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, ప్రజలు మమ్మును నిరాశపరుస్తూ, నిరుత్సాహపరచినను, మా జీవితములో ఉన్న ఆశలన్నిటిని కోల్పోయి ఉన్నాను. కానీ ప్రభువా, నీకు ఏదీ అసాధ్యం కాదని మాకు తెలుసు. దేవా, నీవు సమస్త కీడులను మేలుగా మార్చుము మరియు మా జీవితంలో ఏమి జరిగినా, నీవు దానిని తలక్రిందులుగా మార్చివేయుము. ప్రభువా, అవమానానికి బదులుగా, మేము రెట్టింపు ఘనతను పొందునట్లుగా చేయుము. దేవా, మేము ఎక్కడ అవమానాన్ని అనుభవించామో, అదే స్థలంలో మమ్మును ఉన్నత శిఖరాలకు లేవనెత్తి ఘనపరచుము. ప్రభువా, ఎన్నోసార్లు విఫలమైనప్పటికిని, ప్రతి ఓటమిని విజయంగా మార్చుము. ప్రభువా, ఎన్నో కార్యములు జరగాలని మేము ఎదురు చూచున్నాము; ఈరోజే ఆ కార్యములన్నియు మాకు జరుగునట్లుగా కృప చూపుము. దేవా, దయచేసి దేవా, నీ వాగ్దానములన్నిటిని ఈ రోజు మా జీవితములో నెరవేర్చునట్లుగా చేయుము మరియు నీ వాగ్దానాలను పట్టుకొని ఉన్నందున ఈరోజే మా అద్భుతాన్ని మేము పొందునట్లుగా చేయుము. ప్రభువా, మా అవమానములన్నిటికి బదులుగా నిన్ను స్తుతించి ఘనపరచునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.