నా ప్రియ స్నేహితులారా, నేటి దినమున దేవుని వాక్యమును మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మనము కలిసి దేవుని యొక్క వాక్యములో పాలుపంచుకొనుచున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 40:1వ వచనము మన కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి యొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను'' ప్రకారం నేడు ప్రభువు మన మొఱ్ఱను ఆలకిస్తాడు. ఈ వాగ్దానము కొరకై వందనములు. నేటి పరిస్థితిలలో ఈ వచనమును నెరవేర్చడము అనునది చాలా కష్టతరముగా ఉంటుంది. సహనముతో వేచి యుండుట అనునది చాలా కష్టమైనదిగా ఉంటుంది. మనమందరము కూడా మన పట్ల కార్యాలు ఇప్పుడే జరగాలని అనుకుంటాము. వెనువెంటనే, ప్రత్యేకంగా సమస్యలు వచ్చినప్పుడు, సమస్య యొక్క కష్టము భరించడానికి కష్టముగా ఉండుట వలన, అది భరింపజాలనిదిగా ఉంటుంది. ఆ కార్యము వెనువెంటనే జరగాలని అనుకుంటాము. ఇంకను వెనువెంటనే మనకు విడుదల కావాలని అనుకుంటాము. మన బాధలకు, మన కుటుంబ పోరాటాలకు, మన ఆర్థిక అవసరాలకు త్వరగా పరిష్కారాలను మనం కోరుకుంటున్నాము. ఇంకను దేవుడు తక్షణమే మనకు సహాయము చేయాలని అనుకుంటాము. లేక ఎవరైన మనకు సహాయము చేయాలని అనుకుంటూ, మనము భయపడి ఉండిపోతాము. ఆలాగుననే, 'నేను ఏలాగున సమస్యలలో నుండి బయటకు రాగలను, ఇంకను ఈ భారములు ఎంతో భరింపజాలనివిగా ఉంటున్నవి అని ని అనుకుంటాము.' కానీ, నాకు తెలుసు స్నేహితులారా, వీటన్నిటి మధ్యలోనే, సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకొనియుండునట్లుగా, దేవుడు మనకు విశ్వాసము అను వరమును అనుగ్రహించును. ఏలా విశ్వాసము ఈలాగున మనము చెప్పునట్లుగా చేస్తుంది. 'ఓ! నాకు తెలుసు, దేవుడు తన చిత్తానుసారముగా నాకు బయటపడే మార్గము అనుగ్రహిస్తాడని నాకు తెలుసు. నేను ఆయన చిత్తము జరిగించడానికి నేను వేచియుంటాను, ఆయన నిశ్చయముగా నాకు సహాయము చేస్తాడు. ఆయన నిశ్చయముగా నా పట్ల అద్భుత కార్యమును జరిగిస్తాడు. దేవుడు తన జ్ఞానంతో, తరచుగా మనకు హాని కలిగించడానికి కాదు, మన విశ్వాసాన్ని బలపరచడానికి, సహనముతో కనిపెట్టుకొని ఉండటానికి అనుమతిస్తాడు. ఆయన నిశ్చయముగా మంచి కార్యమును అనుగ్రహిస్తాడు' అని విశ్వాసము మనము సహనముతో కనిపెట్టుకొని ఉండునట్లుగా చేయుచున్నది.
ఏలీయాను అనుసరించిన ఎలీషాను గురించిన ఉదాహరణను బైబిల్ మనకు తెలియజేయుచున్నది. ఆఖరి దినములలో ఏలీయాను వెంబడించుచున్న ఎలీషాను మీరు గమనించి చూచినట్లయితే, ఏలీయా వెళ్లిన ప్రతి స్థలమునకు ఎలీషా అతనిని వెంబడించాడు. ఏలీయా, ' నేను ప్రభువుతో వెళ్లబోవుచున్నాను, దేవుడు ఈ భూమి నుండి నన్ను కొనిపోవుచున్నాడు అని చెప్పిన సమయములో కూడా, నీవు ఎందుకు నన్ను వెంబడించుచున్నావు? అని చెప్పినప్పుడు కూడా, ' ఎలీషా ఏ మాత్రము వినిపించుకోలేదు. అతని వెంటబడుచూ ఉండెను. ఏలీయా వెళ్లిన స్థలము వెంబడి స్థలమునకు ఎలీషా అతనిని విడువకుండా వెంబడించుచుండెను. చివరిగా, దేవుని అభిషేకము అను బహుమానమును అతడు పొందియున్నాడు. అతడు ఎంత దప్పిక గలవాడై తృష్ణతో వెంటాడుచున్నాడో చూడండి. సహనముతో దేవుని అభిషేకము కొరకు వేచియున్నాడు. ప్రభువు ఆయనకు బహుమానము అనుగ్రహించియున్నాడు. అదేవిధముగా, స్నేహితులారా, నేడు మీరు కూడా కనిపెట్టుకొని వేచియున్నారు. ఎంతో నమ్మికతోను మరియు దేవుని యందు నిరీక్షణతో ఉండియున్నాడు. ఈ వచనములో, "నాకు చెవి యొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను'' అని చెబుతుంది. 'సహనం' అనేది విశ్వాసం లోతుగా వేళ్ళూనుకునే నేల వంటిది. మనం దేవుని కోసం వేచి ఉండాలని ఎంచుకున్నప్పుడు, మనం మన జీవిత కాలగతులను ఆయన పరిపూర్ణ చిత్తానికి అప్పగించుకుంటున్నామని అర్థం. మరియు ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన ఖచ్చితంగా మన మొరను విని మన పక్షమున చర్య తీసుకుంటాడు. ప్రియులారా, మీ ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయని మీరు అనుకోవచ్చును, కానీ ఆలస్యం తిరస్కరణ కాదని గుర్తుంచుకోండి. దేవుడు ఉత్తమ జవాబును సిద్ధం చేస్తున్నాడు. సహనం బలహీనత కాదు; అది విశ్వాసంతో కప్పబడిన బలం. మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టును ప్రభువు చూస్తాడు మరియు ప్రతి మొఱ్ఱను ఆయన వింటాడు. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని నీ నేల నుండి పైకి లేపి, మీ పాదాలను బండపై ఉంచి, మీ నోటిలో ఒక కొత్త పాటను ఉంచుతాడు.
నా ప్రియమైనవారలారా, మీరు ఈరోజు స్వస్థత కొరకు, మీ ఉద్యోగంలో అభివృద్ధి, మీ పిల్లల జీవితాలు మార్పు లేదా మీ కుటుంబంలో సమాధానము కొరకు ఎదురు చూస్తుండవచ్చును. నేడు ఈ వాగ్దానం మిమ్మల్ని ఓదార్చనివ్వండి: ఇప్పుడు కూడా ఆయన మీ వైపునకు మరలకుంటాడు. నేడు దేవుని యొద్ద నుండి జవాబును స్వీకరిద్దామా? ఇప్పుడు కూడా, ప్రభువు కనికరముతో మీ వైపు తిరుగుతున్నాడు. ఆయన శూన్యం నుండి ఏదో ఒకటి సృష్టిస్తాడు. ఆయన మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మీ ఆర్థిక స్థితిని వృద్ధిపరుస్తాడు, సంబంధాలను పునరుద్ధరిస్తాడు మరియు పాపంపై మీకు విజయం అనుగ్రహిస్తాడు. నిరుత్సాహపడకండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మీ సహనానికి ప్రతిఫలం లభిస్తుంది. కనుకనే, 'ప్రభువు నా ఆశ్రయం, నా కోట, నా దేవుడు; నేను ఆయనను నమ్ముతాను' అని ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో నివసించడం కొనసాగించండి. త్వరలో, మీ దుఃఖం నాట్యంగా మారుతుంది మరియు మీ నిరీక్షణ ఆయన శక్తికి సాక్ష్యంగా మారుతుంది. నా స్నేహితులారా, మీ సహనమునకు బహుమానము అనుగ్రహించబడుచున్నది. కనుకనే, భయపడకండి, దేవుని యందు విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండండి, ఆయన నేటి వాగ్దానము ద్వారా మీ మొఱ్ఱను ఆలకించి, మీకు తగిన సమయములో జవాబునిచ్చి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఈరోజు నీ వాక్యమను వరమునకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మేము నీ కొరకు సహనముతో వేచి ఉండుటకు మా నేర్పించుము. దేవా, మా మొరను విని నీ కృపతో మాకు జవాబును దయచేయుము. ప్రభువా, మా కన్నీళ్లను తుడిచి, మా హృదయాన్ని సమాధానముతో నింపుము. తండ్రీ, మా ఆర్థిక స్థితిని ఆశీర్వదించుము మరియు మాకు ఉన్న కొంచెము సమృద్ధిగా విస్తరింపజేయుము. దేవా, మా పిల్లలను తాకి, వారి హృదయాలను నీ వైపునకు మరల్చుటకు సహాయము చేయుము. ప్రభువా, మా కార్యాలయంలో మాకు పదోన్నతులు మరియు నూతన అవకాశాలను అనుగ్రహించుము. దేవా, పాపపు బానిసత్వం నుండి మమ్మును విడిపించి మాకు విజయాన్ని అనుగ్రహించుము. ప్రభువా, మా కుటుంబంపై నీ ఆత్మను కుమ్మరించి, ప్రేమలో మమ్మల్ని ఐక్యపరచుము. దేవా, మేము నీ కొరకు సహనముతో కనిపెట్టుకొని, నీవు మాకు చెవి యొగ్గి మా మొఱ్ఱ ఆలకించి, మా దుఃఖమును నాట్యంగా మార్చుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.