నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 5:9వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు'' ప్రకారం మీరు దేవుని పిల్లలుగా ఎంచబడుచున్నారు. ఇది మీ కొరకు దేవుని వాగ్దానమై యున్నది. బైబిల్‌లో హెబ్రీయులకు 12:14వ వచనములో దేవుని యొక్క వాక్యవము ఏమని చెబుతుందనగా, ' అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు'' అని వ్రాయబడియున్నది. నా స్నేహితులారా, అందరితో సమాధానముగా ఉండటము అనగా, అది పరిశుద్ధత అని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా, 1 యోహాను 3:15వ వచనము ఏమని చెబుతుందనగా, " తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకుని యందును నిత్యజీవముండదని మీరెరుగుదురు'' అని చెప్పబడిన ప్రకారం దానికి విభిన్నమైన రీతిలో ఏ వ్యక్తి అయితే, అందరితో సమాధానముగా ఉంటాడో, సహోదరీ, సహోదరులతో సమాధానముగా ఉంటాడో అతడు పరిశుద్ధమైన వ్యక్తిగా ఉంటాడు. అట్టి వారు దేవుని పిల్లలు అనబడుదురు. వారు దేవుని చూచెదరు. యేసు ఇక్కడ ఈ రీతిగానే, సెలవిచ్చుచున్నాడు, "సమాధానపరచువారు ధన్యులు'' అని చెబుతున్నాడు. మొట్టమొదటగా, మీరు మీ హృదయములో దేవునితో సమాధానపరచబడాలి. అప్పుడు మీరు సమస్త మనుష్యులతో సమాధానపరచబడే శక్తిని కలిగి ఉంటారు. అప్పుడు మీరు మనుష్యులందరి మధ్య సమాధానమును తీసుకొనిరాగలుగుతారు. అటువంటి వారు దేవుని కుమారులనబడతారు. వారు దేవుని యొక్క పిల్లలై ఉంటారు.
అవును నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును అటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చేయాలని మీ పట్ల కోరుచున్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క పరిశుద్ధతతో నింపబడినవారుగా, దేవుని చూచు కృపను కలిగియున్నవారినిగా, మీరు మీ హృదయములో సమాధానమును కలిగియున్నప్పుడు, దేవునితో సమాధానము, మీరు ప్రజలందరితో సమాధానము కలిగియున్నప్పుడు, మీరు ప్రజల మధ్య సమాధానము కలిగించగలిగినట్లయితే, ఇట్టి ఆశీర్వాదము దేవుడు మీకు ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు.
ఎన్నూరు నుండి సహోదరి సెల్వి తన సాక్ష్యమును ఈలాగున పంచుకున్నారు. ఒకరు
పెట్టుబడి ఆవకాశంతో ఆమెను సంప్రదించారు. ఆమె వారిని నమ్మి తన ధనమును పెట్టుబడి పెట్టారు. మొదటి నెల వారు తిరిగి వచ్చి రాబడి ఇచ్చారు. కానీ, రెండవ నెల రాబడి ఇవ్వడము మానేశారు. ఇవ్వడానికి వారు ఆలస్యము చేశారు, ఇంకను ఇవ్వడము కూడా పూర్తిగా మానేశారు. తప్పుడు వాగ్దానాలు చేశారు. ఇది కుటుంబానికి చాలా ఒత్తిడిని తీసుకొని వచ్చినది. వీరు ఎవరికైతే, అప్పుగా ఉన్నారో వారందరు కూడా విరుద్ధంగా మాట్లాడడము మొదలు పెట్టారు. ఈ ఒత్తిడి వలన భర్త త్రాగుబోతుగా మారిపోయాడు. ఇంట్లో ఏ మాత్రము సమాధానము లేదు, ఏ మాత్రము నిద్రపోలేకపోయాము. అన్నిటిని కోల్పోయినట్లుగా అనిపించుచుండెను. బిడ్డలతో ఎంతగానో బాధపడ్డాను. అటువంటి సమయములో యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు వచ్చారు. వారు ప్రతి కూటమునకు పాల్గొనుటకు ప్రారంభించారు. దేవుని సమాధానము వారి హృదయాలను నింపినది. యేసులో ఉన్న గొప్ప నిరీక్షణ వారికి కలిగినది. ఆమె తన ఆస్తిని అమ్మగలిగారు. నెమ్మదిగా ధనమును తిరిగి చెల్లించగలిగారు. ఈ రోజు భర్త రూపాంతరపరచబడి, మద్యపానము బానిసత్వము నుండి బయటకు వచ్చాడు. బిడ్డలు ఆశీర్వదింపబడ్డారు, సంతోషంగా వారికి వివాహములు జరిగినవి. యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ఉన్న కుటుంబ ఆశీర్వాద పధకములో వారందరు భాగస్థులుగా మారారు. ప్రజలందరితో సమాధానము. దేవుడు వారి జీవితాలను సమాధానముతో స్థిరపరచాడు. దేవునికే మహిమ కలుగును గాక.
ఆలాగుననే, నా ప్రియులారా, దేవుడు మీ జీవితాన్ని ఆలాగున స్థిరపరుస్తాడు. మీరు తిరిగి ఇతరుల విషయములో చెల్లించవలసిన ధనము విషయములో మీరు తిరిగి చెల్లించడానికి దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తాడు. మీ మీద నింద మోపడానికి ఇక మీకు విరోధముగా ఎవ్వరు కూడా ఉండరు. నిజముగా దేవుడు జాగ్రత్త వహించుచున్న నిజమైన బిడ్డగా మీరు ఉంటారు. దేవుడు మీరు కోల్పోయిన సమస్తమును తిరిగి మీకు ఇస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఇట్టి ఆశీర్వాదముచేత మీకు సమాధానమును అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సమాధానమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, సమాధానపరచువారు ధన్యులు; వారు నీ పిల్లలు అని పిలువబడతారని నీ ప్రేమపూర్వకమైన వాగ్దానమును మాకు ఇచ్చినందుకు వందనములు. ప్రభువా, నీ నామములో మాత్రమే కాదు, ఆత్మ మరియు సత్యంలో కూడా మేము నీ బిడ్డలుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. దేవా, దయచేసి మా హృదయాన్ని నీ సమాధానముతో నింపుము. ప్రభువా, మొదట నీతో సమాధానపరచుకోవడానికి, తరువాత ఆ సమాధానమును ఇతరులతో, మా సంబంధాలలోకి తీసుకువెళ్లడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, మమ్మును నిందించేవారిని, మాకు విరోధముగా లేచు వారిని క్షమించే బలాన్ని, పునరుద్ధరించడానికి వినయాన్ని మరియు ప్రజల మధ్య వారధిగా ఉండటానికి ధైర్యాన్ని మాకు అనుగ్రహించుము. దేవా, దయచేసి ప్రతిరోజు నీ పరిశుద్ధతతలో నడవడానికి మరియు విభజన ఉన్న చోట సమాధానమును తీసుకురావడానికి మమ్మును ఉపయోగించుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము ఈ రోజు నీ ఆశీర్వాదాన్ని పొందుకొనునట్లుగాను మరియు మమ్మును నీ యొక్క సమాధానమునకు పాత్రగా మమ్మును మలుచుకోమని వేడుకొనుచున్నాము. దేవా, మేము ఇతరులతో సమాధానముగా ఉండుటకు అటువంటి ధన్యతను మరియు నిన్ను చూచు ధన్యతను మాకు అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.