Date : June 06, 2025
''ఊరకుండుడి, నేనే దేవుడనని తెలిసికొనుడి; అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమిమీద నేను మహోన్నతుడనగుదును!''
కీర్తన 46:10 వాక్యము ఒక దేశము దేవునిలో కాపుదలను వెదకుచున్న నేపధ్యములో వ్రాయబడినది. అయిన్నప్పటికీ ఇది వ్యక్తిగతముగా కూడా అధిక ప్రయోజనకారిగా ఉంటుంది. దేశము వ్యతిరేకపు శక్తులచే దాడులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను ఎందుకు ''ఊరకుండుడి'' అని చెప్పుచున్నాడు అని ఆశ్చర్యముగా ఉన్నదేమో. నిజానికి ఇచ్చట అపవాది పన్నాగములకు ''ప్రతిస్పందించుటను ఆపుమని'', ''తనలో విశ్రాంతి తీసుకొమ్మని'' ఆయన తన ప్రజలకు దృఢముగా చెప్పుచున్నాడు.
దేవుని విధానము లేదా స్పందన అనేది చాలా ప్రత్యేక రీతిలో ఉంటుంది. ఆయన పూర్తి ప్రణాళికను మనము ఎన్నడూ అర్ధము చేసుకోలేము. అయినప్పటికీ మనకు మేలైనది ఏదో అది మాత్రం మనము చేయాలి. ఆయన చెప్పుచున్నది మాత్రం మనం చేయాలి. అది చాలా సులువైనది. ''ఊరకుండుట'' అనగా అది ఏమైనప్పటికి ఆయన ప్రణాళికకు విధేయత చూపుట లేదా లోబడుట అని అర్ధం. ఎప్పుడైతే మనము ''ఏమి చేయకుండా'' దేవుని అనుమతించినపుడు యుద్ధంలో మనము జయిస్తాము. పరిశుద్ధ గ్రంథమును మనము జాగ్రత్తగా విశ్లేషించినపుడు అది భావోద్వేగమును రేకెత్తించు గొప్ప బంగారు నిధి వంటిదిగా ఉంటుంది. ఎందుకనగా అందులో ప్రతి పుట లేదా పేజీ అనేది దేవుని గూర్చి మాట్లాడుతుంది లేదా దేవుని స్వంత చేతులతో చెక్కినట్లుగా అందులో వాక్యము ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమును ఆసక్తితో చదివే చదువరులను అది విస్మయం నొందిస్తుంది కూడా. ప్రత్యేకించి అందులో కొన్ని మాటలు సామాన్య లోకపు ఆలోచనలకు విరుద్ధంగా ఉంటాయి. యిర్మీయా 9:23-24 లో అటువంటి మాటలు ఉన్నవి. జీవితము గూర్చి దేవుడు పంచుకొనిన మాటలను అచ్చట చూస్తాము. ''జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు''.
సంపన్నులు తమకున్న ఆస్తులనుబట్టి సంతోషించుట, తెలివైనవారు తమ తెలివితేటలను బట్టి ఆనందించుట మరియు బలశాలులు తమ బలము లేదా అధికారమును ప్రదర్శించుట అనేది అసాధారణము ఏమి కాదు కదా! కానీ ప్రభువు ఒక మంచి కారణముతోనే దీనిని విభేదిస్తున్నాడు. ఆయన లేకుండా మనము ఎంతటి చిన్నవారము లేదా శక్తిహీనులము అనేది ఎన్నడూ మరువకూడదని మననుండి ఆయన కోరుకొనుచున్నాడు. మనము ఏది సాధించినా లేదా ఏది నెరవేర్చినా ఆయన అన్నివిధముల ఎంతటి సార్వభౌముడు లేదా సర్వాధిపతి అనేది గుర్తించుటలో మనము దృష్టించవలసియున్నది. మీరు దేవుని శోభాతిశయమును మరియు వైభవమును ఆనందించాలని భావించినచో ఊరకుండుటను నేర్చుకొని పాటించుడి.
ఈ లోకములో ఇప్పటివరకు జీవించినవారందరిలో గొప్ప జ్ఞానియగు సోలోమోను రాజు ప్రసంగి 9:11 లో ఇదే మాటలను తెలిపాడు. దావీదు రాజు యొక్క ప్రియ కుమారుడు అయినట్టి సోలోమోను అనేక అనుభవములను సంపాందించిన పిమ్మట తన వృద్దాప్యములో వ్రాసిన మాటలుగా వీటిని చూడవచ్చును. అతను ఇలా చెప్పాడు. ''మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయమొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే, కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.''
తాను దేనినిగూర్చి గర్వపడవలసినది లేదని, తాను సంపాదించినది అంతయూ - సమృద్ధితో కూడిన సంపద, నైపుణ్యములు, జ్ఞానము, ఘనత మరియు గొప్ప పేరు ఇవన్నియు కూడా సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త కారణముగా ఇవన్నియు తన స్వంతమైనవని సోలోమోను చాలా స్పష్టముగా ప్రకటించాడు. చరిత్రలో ఎన్నడూ మరువలేని పరిపాలనను అందించిన రాజు చివరిగా దేవుని ముందర తలవంచుచు తన జయకరమగు జీవితమునకు దేవుడే కారకుడని ప్రకటించాడు. ఇదే అంతిమ విజయమని తెలుసుకోవాలి. దేవునియందు వేచియుండుడి. ఇది శత్రువును పడగొట్టుటలో విజేతకు ప్రాముఖ్యముగా అవసరమగు లక్షణము లేదా గుణాతిశయమైయున్నది. ఆ శత్రువు తప్పక మీచుట్టుపట్ల ఉన్న దుష్టులైన ప్రజలే కావలసిన అవసరం లేదు. అవి మీ అనారోగ్యము, మీ వ్యసనములు, దేవునికి ఇష్టములేని మీలో ఉన్నట్టి గుణములు ఏవైనా కావచ్చును. కొన్నిసార్లు మీ లక్ష్యాలు లేదా మీ కోరికలు మిమ్మును దైవికముకానట్టి మార్గములలోనికి నడిపించవచ్చును. కొన్నిసార్లు దేవుని చిత్తమునకు వెలుపల మీరు చేయుయుచున్నట్టి ఆలోచనలు - మిమ్మును జీవముగల రక్షకుని నుండి దూరపరిచే ప్రతిదీ కూడా మీరు ''ఊరకుండిన'' స్థితిలో అవన్నియు నాశనమౌతాయి. ఆవిధమైన నిశ్చలమగు నమ్మకము, పూర్ణ విధేయత మరియు నిత్య నిరీక్షణ అనేవి దేవుని సన్నిధిలో ఊరకుండుటకు లేదా వేచియుండుటకు మిమ్మును మీరు అనుమతించినపుడు మాత్రమే ఈ నెలలో మరియు ఎల్లప్పుడూ మిమ్మును సమాధానముతో నడిపిస్తాయి.
తన శ్వాస లేదా ఊపిరితో సముద్రమును విభజించింపజేసిన, తన గద్దింపుతో తుఫానును నిమ్మళపరచిన, తన చేతితో సూర్యుని కక్ష్యలో నిలిపిన మరియు మీరు ఎక్కడ ఉన్నను ఎల్లప్పుడూ పరలోకమునునుండి తన సహాయమును మీకు అందించుచున్న దేవుని యందు మీ నమ్మికను నిత్యము ఉంచండి. మీరు ఊరకుండుటను నేర్చుకొనినచో విజయము మీదే. ఆయనకు స్తుతిగీతములు పాడుడి, హృదయపూర్వకముగా ప్రార్థించండి, ఆయనవైపు చూడండి తద్వారా మీ అద్భుతమును పొందుకొనుడి. ఈ జూన్ నెల మీకు ఆశీర్వాదముగా ఉండునుగాక!
డా. పాల్ దినకరన్