దేవుడు మీ జీవితంలోని అతి స్వల్పమైన కార్యములను కూడా ఆయన బాధ్యత వహిస్తూ, మిమ్మల్ని గొప్పవారినిగా చేయగలడు. కనుకనే, మీ విశ్వాసం మరియు ప్రార్థన దైవీకమైన ఉన్నతికి ద్వారములు ...
మా కొత్త పాటలు


The Promise 2026 (Kannada)


The Promise 2026


The Promise 2026 (Telugu)


The Promise 2026 (Tamil)


Karthar Nam Saarbil


The Promise 2026 (Kannada)


The Promise 2026


The Promise 2026 (Telugu)


The Promise 2026 (Tamil)


Karthar Nam Saarbil
ఆశీర్వాద పథకాలు
సాక్ష్యములు

Kerala
ఉన్నతముగా ఎదిగెను
నేను యౌవన భాగస్థురాలినిగా ఉండటము నాకు చాలా గర్వకారణముగా ఉన్నది. దేవుడు నా జీవితంలో తరలించిన నమ్మశక్యం కాని మార్గాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఆగష్టు 31వ తేదీన, నేను నర్సింగ్ వృత్తి నిమిత్తము ఒఇటి (ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్) పరీక్ష వ్రాశాను. పరీక్షకు ముందు, నేను ఎదుర్కొనుచున్న సవాళ్లకు సంబంధించియు, ముఖ్యముగా వినడం మరియు మాటలాడే విధానములకు సంబంధించియు, డాక్టర్. పాల్ దినకరన్గారితో పంచుకొని, ప్రార్థన చేయమని కోరుతూ, ఈమెయిల్ పంపించాను. నేను ఈమెయిల్కు ఒక జవాబును పొందుకున్నాను. అది నాకు ఆదరణను మరియు నిశ్చయతను కలుగజేసింది. నేను యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమును పరీక్షకు ముందు రోజు మరియు పరీక్ష రోజు కూడా సంప్రదించాను. వారి ప్రార్థనలు నా యొక్క విశ్వాసమును బలపరచి, నాకు నమ్మకమును కలిగించింది.
ప్రాముఖ్యముగా, వినికిడి విధానము చాలా కష్టమైనది. కానీ, దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే నమ్మకముతో నేను దేవుని హత్తుకున్నాను. ఫలితాలు వచ్చినప్పుడు, నేను ఊహించినదాని కంటె
అధికముగా దేవుడు నాకు అత్యధికమైన విజయమును అనుగ్రహించాడు. మొదటి ప్రయత్నములోనే 'బి' గ్రేడ్లో అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత పొందుకున్నాను. ఈ విజయము తన సొంత జ్ఞానము వలన కలుగలేదు. కానీ, కేవలం ఈ విజయం పూర్తిగా దేవుని జ్ఞానం మరియు కృప ద్వారానే జరిగింది. ఏప్రిల్ నెలలో, నేను డిగ్రీ చదువుచున్న సమయములో కేంద్ర ప్రభుత్వము నుండి పొందుకొనుచున్న స్కాలర్షిప్కు సంబంధించి మరొక ప్రార్థన విన్నపమును పంపించాను. ఆధార్ కార్డులో సమస్య ఉన్నందున, చివరి సంవత్సరములో నాకు రావలసిన స్కాలర్షిప్ రాలేదు. నెలల తరబడి, పోన్ ద్వారా మరియు ఎన్నో ఈమెయిల్ ద్వారా అధికారులను సంప్రదించినను ఎటువంటి ప్రయోజనము లేదు. నేను అటువంటి సమయములో, నాకు రావలసిన స్కాలర్షిప్ వచ్చినట్లయితే, అందులోని ఒక భాగము యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు కానుకగా సమర్పించెదనని మ్రొక్కుబడి ప్రార్థన చేసుకున్నాను. అద్భుతరీతిగా, నా పరీక్ష ఫలితములు వచ్చిన మరుసటి రోజే నాకు రావలసిన స్కాలర్షిప్ డబ్బులు కూడా నా అకౌంటులో పడినవి.
మాటలలో చెప్పలేనంతగా కృతజ్ఞతతో నింపబడి, నేను మ్రొక్కుబడి చేసుకొనిన ప్రకారం యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు నా యొక్క కృతజ్ఞతా కానుకను పంపించాను. అంతేగాక, యౌవన భాగస్థుల పధకము ద్వారా ప్రార్థన సహాయమును అందించుచున్న డాక్టర్. పాల్ దినకరన్గారికి మరియు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలోని ప్రార్థన యోధులందరికి నేను హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలను తెలియజేయుచున్నాను. యౌవన భాగస్థుల పధకము ద్వారా బయల్పరచబడిన ప్రార్థన శక్తిని నేను నిజంగానే అనుభవించాను. దేవునికే మహిమ కలుగును గాక.

Chennai
స్వస్థత నొందెను మరియు ఆశీర్వదింపబడెను
చాలాకాలంగా నేను గర్భము ధరించలేనందున మనస్సు విరిగిపోయి, ఎంతో వేదనను ఎదుర్కొన్నాను. గర్భస్రావము ఏర్పడిన తరువాత, నా బాధ ఇంకా అధికమయ్యింది. అటువంటి క్లిష్ట సమయములో, నేను వచ్చి, కుటుంబ ఆశీర్వాద పధకమును గూర్చి తెలుసుకున్నాను మరియు విశ్వాసముతో ఆ పధముకలో చేరాను. ప్రార్థనల ద్వారా దేవుడు నా కుటుంబములో అద్భుతము చేస్తాడని నేను విశ్వసించాను. దేవుడు నా విశ్వాసమును ఘనపరిచాడు! నాకు ఒక చక్కటి బిడ్డను ఇచ్చి, నన్ను ఆశీర్వదించాడు. తద్వారా, మా కుటుంబము ఆనందముతో నింపబడినది.
అనేక సంవత్సరముల తర్వాత, నేను మరొక సవాలును ఎదుర్కొన్నాను. నాకు శస్త్రచికిత్స చేయబడిన ఆరు సంవత్సరముల తరువాత, ఆ మచ్చ వద్ద, చీము ఏర్పడుటను నేను గమనించాను. చింతించినను, నేను దేవుని యందు నమ్మకమును కోల్పోలేదు. భయం నాలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించింది. కానీ, నేను మరల దేవునిపై నమ్మకం ఉంచాలని ఎంచుకున్నాను. బదులుగా, మరొకసారి నేను దేవుని తట్టు తిరిగి, యేసు పిలుచుచున్నాడు క్యాలెండర్లో ఉన్న అనుదిన వాగ్దాన వచనములను చదివి, ధైర్యము తెచ్చుకున్నాను మరియు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురముల ద్వారా బలపరచబడ్డాను.
దేవుడు నమ్మదగినవాడు - గనుకనే, ఆయన నన్ను సంపూర్ణంగా స్వస్థపరచాడు. మరియు ఒకప్పుడు నాకు ఎంతో భయాన్ని కలిగించిన ఆ సమస్య కేవలం ఇప్పుడు అదృశ్యమైంది. ఈ రోజు, నేను మరియు నా కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదముల క్రింద జీవించుచున్నాము. నేను పొందుకున్న ప్రేమ, స్వస్థత మరియు నిరీక్షణకు ఎల్లప్పుడు కృతజ్ఞురాలై ఉన్నాను. కుటుంబ ఆశీర్వాద
పధకము ద్వారా, దేవుడు ఆలకిస్తాడు, ప్రతిస్పందిస్తాడు మరియు పునరుద్ధరిస్తాడనే విషయాన్ని నేను ప్రత్యక్షంగా అనుభవించాను. దేవునికే మహిమ కలుగును గాక.
జరగబోయే ప్రార్థనా కూడికలు
Feb ' 26
01
Sunday
Students Prayer Meet 2026
From : 01-02-26 02:00 PM
To : 01-02-26 05:00 PM
Wings Convention Center @ St. George's School Ground Poonamallee High Road, Near Pachaiyappa's College Metro Station, Chennai - 30.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now








































