నా ప్రియమైన వారలారా, నేడు దేవుడు మీ కొమ్మును హెచ్చించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఇంకను, ‘‘నీవు నా కొమ్ము పైకెత్తితివి.’’ అవును, ఆయన బూడిద పెంట కుప్ప మీద ఉన్నవారిని అత్యున్నతమైన స్థాయికి లేవనెత్తు దేవుడుగా ఉన్నాడు. అంగలార్పుతో ఉండియున్నవారిని ఆనంద తైలపు స్థాయికి హెచ్చించనై యున్నాడు. ప్రభువు మీ దుఃఖమును సంతోషముగా మార్చుచున్నాడు. అవును, బైబిల్ నుండి యెషయా 60:22వ వచనమును చూచినట్లయితే, ‘‘ వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును’’ అని లేఖనము సెలవిచ్చుచున్నది. ఇంకను నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 92:10వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, ‘‘గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని’’ ప్రకారము దేవుడు మిమ్మును పైకిలేవనెత్తుతాడు. అవును, గురుపోతు తన యొక్క కొమ్ముచేత సింహములనైనను, పులులనైన, హైనాలైనా పారిపోవునట్లు చేస్తుంది. ఆలాగున అది జీవించగలుగుతుంది. అత్యంత భయానకమైన పరిస్థితిని కలిగించే జంతువులన్నిటి మధ్యలో కూడా అది నిర్భయముగా జీవించుచున్నది. దేవుడు మీకు కొమ్మును అనుగ్రహిస్తుంది. అదేవిధంగా, మీ శత్రువులపై పైకి లేవడానికి, బలంగా నిలబడటానికి మరియు విజయం సాధించడానికి దేవుడు మీకు బలాన్ని మరియు ఒక కొమ్మును ఇచ్చుచున్నాడు.

నా ప్రియులారా, ‘‘ఆయనే మన తలను పైకెత్తువాడై యున్నాడు’’ అని లేఖనము చెబుతుంది. ఈ రోజు మీరు తల దించుకొని ఉన్నటుగా ఉండి యున్నారా? మీరు అవమానముతో తలదించుకొని ఉన్నారా? నష్టముల చేత మీరు తలదించుకొని ఉన్నారా? విచారముచేత మీ తల క్రిందికి దించివేయబడినదా? ఒంటరి తనము చేత, పాపము చేత మీరు తల దించుకొనియున్నట్లుగా మీరు ఉన్నారా? దేవుడు మీ తలను తైలముతో అభిషేకించుచున్నాడు. మీ శత్రువుల కన్నుల యెదుట ఆయన మీకు భోజనము బల్ల సంసిద్ధము చేయుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి అటువంటిదై యున్నది. ‘దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్య్రము ఉంటుంది’అని చెప్పబడినట్లుగానే, దేవుని ఆత్మ మీతో ఉండునట్లుగాను, దేవుని యొక్క ఆత్మ మిమ్మును సర్వసత్యములోనికి నడిపించునట్లుగాను, దేవుడు మీ తలను పైకెత్తుతాడు. ‘సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని’ పరిశుద్ధ గ్రంథము తెలియజేయుచున్నది. గురుపోతు తన తలను పైకెత్తి, శత్రువులను ఏ విధంగా నాశనము చేస్తుందో, అదేవిధంగా, దేవుడు మీ యొక్క కొమ్మును తైలముతో ఆయన నాశనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క కొమ్ము, మిమ్మును హెచ్చించును. ఈ రోజున యేసు నామమున ఇట్టి ఆశీర్వాదమును ప్రకటించుచున్నాను. 

నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యము ఉన్నది. సహోదరి సావిత్రి తన కుమారుడైన వరున్ గురించి ఈలాగున వ్రాశారు. ఆమె తన కుమారుని యౌవన భాగస్థుల పధకములో భాగస్థునిగా చేర్పించారు. 2 వ తరగతిలోనే అతనిని యౌవన భాగస్థుల పధకములో సభ్యునిగా చేర్పించారు. అతడు రాష్ట్ర స్థాయిలో టెన్నిస్ క్రీడలలో ఎంతగానో ప్రతిభను రాణించాడు. కానీ, 11వ తరగతికి వరున్ వచ్చినప్పుడు, అతనికి ఒక జ్వరము సంక్రమించినది. నేను నిర్వహించిన విద్యార్థుల ప్రార్థన కూటమునకు వరున్ రావడము జరిగినది. ఆమె ప్రార్థన కోసమై నా యొద్దకు అతనిని తీసుకొని వచ్చారు. నేను ప్రార్థన చేసినప్పుడు, యేసు అతని జ్వరమును తొలగించి, 12వ తరగతిలో అద్భుతమైన మార్కులను అనుగ్రహించాడు. అయితే, అతడు బిటెక్‌లోనికి ప్రవేశించినప్పుడు, కళాశాలలో చెడ్డ స్నేహితులు అతనికి స్నేహితులుగా వచ్చారు. అనేక సబ్జెక్టులలో అపజయము పాలైయ్యాడు. 21 సబ్జెక్టులలో ఇంకా ఉత్తీర్ణత పొందకుండా, మిగిలిపోయాయి. అతడు మరల ప్రార్థన కొరకు ప్రార్థనా గోపురమునకు వెళ్లాడు, అతనిని నేను మరల కలుసుకున్నాను. అప్పుడు నేనేమి చెప్పానంటే, ‘ మీ కుమారుడు డిగ్రీని పూర్తి చేసుకుంటాడు, ఇతరులకు సహాయకరంగా ఉంటాడని చెప్పాను. ’ ఎంతో అద్భుతంగా, రెండు సెమిస్టర్ల్‌లోనే మిగిలిపోయి ఉన్న 21 సబ్జెక్టులన్నిటిలోను కూడా అతడు ఉత్తీర్ణుడయ్యాడు. వరున్ తల్లి, ‘ఇది ఊహకు మించిన అద్భుతకార్యము’ అని అన్నారు. అతడు ఎంబిఎ చేయడానికి కొయంబత్తూరులో ఉన్న కారుణ్య విశ్వవిద్యాలయములో అతనిని చేర్పించారు. అతడు 3వ సెమిస్టర్‌ను చదువుచుండగా, హైదరాబాద్‌లో అతనికి ఉద్యోగము వచ్చినది. ప్రవచనము నెరవేరినది. ఈ రోజున అతను ఎంతో వర్థిల్లతను కలిగియున్నాడు. ఆలాగుననే, దేవుని బిడ్డగా కూడా ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఆలాగుననే,  దేవుడు మీ తలను కూడా పైకి లేవనెత్తును. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా తల ఎత్తేవాడవుగాను మరియు మా కొమ్ము వెనుక బలాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రభువా, మేము అణగదొక్కబడినప్పుడు, నీవు మమ్మును  పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తి, ఆనందంతో కిరీటాన్ని అలంకరింపజేయుము. ప్రభువా, ఈ రోజు, నీవు మా కొమ్మును గురుపోతు కొమ్ము వలె పైకి లేవనెత్తుతావని మేము నీ యొక్క వాగ్దానాన్ని పొందుకొనుచున్నాము. ఆప్రకారముగానే మా జీవితములో జరిగించుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ తైలముతో మమ్మును అభిషేకించుము. యేసయ్యా, అవధులు లేకుండా మమ్మును నింపుము. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపి, రూపారంతరపరచుము. దేవా, మా జీవితంలోని ప్రతి అవమానం, దుఃఖం మరియు పోరాటం యేసు యొక్క శక్తివంతమైన నామంలో బ్రద్దలైపోవునట్లుగా కృపను చూపుము. ప్రభువా, మా శత్రువుల యెదుట ఒక బల్లను సంసిద్ధం చేయుము మరియు విజయపధంలో మా తల ఎత్తబడునట్లుగా చేయుము. దేవా, మా ప్రతి శత్రువుల కంటే ఉన్నతముగా మమ్మును పైకి లేవనెత్తి, నీ సత్యంలోను, స్వతంత్రలోను మరియు శక్తిలోను నడవడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.