Date : Aug 21, 2025
"మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు
పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.'' (యూదా 1:25)
ఈరోజు దీనిని చదువుచున్నప్పుడు మీ మనస్సులో మీకు ఏమి తోచుచున్నది? మీరు చేస్తున్న పనిలో మంచి అనుభూతితో ఉన్నారా? లేదా మీరు మరల చేసిన తప్పుల వలన మీకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని ఆలోచిస్తున్నారా? అది ఏదైనా కావచ్చును కానీ, దేవుడు వాటన్నింటిని పూర్తిగా మార్చగలడని గుర్తుంచుకోండి. ఎందుకంటే, ఆయన కేవలం శక్తిమంతుడు మాత్రమే కాదు, ఆయన జ్ఞానమంతుడు కూడా. కాబట్టి, దేవుని ప్రధాన లక్షణాలలో ఒకటి ఆయన జ్ఞానం. ఆయనకు ఆరంభం నుంచి అంతం వరకు తెలుసు. ఇంకా, ఆయనకు మీ గురించి కూడా సమస్తమును తెలుసు!
బైబిల్లో దేవుని జ్ఞానం గురించి ప్రారంభం నుండి చివరి వరకు మాట్లాడుచున్నది. కీర్తనలు 147:5లో దేవుని వాక్యం నుండి, "మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు'' అని చెప్పబడియున్నది. సాధారణమైన ప్రజలు దేవుని యొక్క జ్ఞానంపై ఆధారపడి అసాధారణమైన కార్యాలను చేశారు. రాజులు మరియు ప్రవక్తలు దేవుని జ్ఞానం ప్రభావంతో శక్తివంతమైన రాజ్యాలు పడిపోవడాన్ని లేక పతనమవడం చూశారు. జ్ఞానవంతుడైన సొలొమోను రాజు, 'జ్ఞానము సంపాదించుకొనుము' (సామెతలు 4:5) మరియు 'అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్ఠము' అని తెలియజేసియున్నాడు. మరియు (సామెతలు 16:16), 'జ్ఞానం సంపాదించుకొనుము, వివేకమును సంపాదించుకొనుము,' అని అతను చెబుతూ, "బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును'' అని తన నమ్మకత్వాన్ని సూచిస్తూ సామెతలు 19:8లో వక్కాణించుచున్నాడు,
జ్ఞానానికి, అభివృద్ధికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సామెతలు 8:35 లో, సొలొమోను రాజు దీనికి జవాబును తెలియజేసియున్నాడు, అక్కడ మనం చదువుతాము: "నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షం వానికి కలుగును.'' దేవుని వాక్యాన్ని అనుసరించాలని ఎంచుకునేవారు, ఆయన కృపను పొందుతారు మరియు ఆయన చేత ఆశీర్వదించబడతారు అన్నది ఒక సార్వత్రిక సత్యం.
" విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును'' అని సామెతలు 21:20వ వచనంలో సొలొమోను దీనిని మరల నిర్ధారిస్తున్నాడు.
అనేక సందర్భాల్లో, దేవుడు, 'తన హృదయానుసారుడు' అని సంబోధించిన సొలొమోను తండ్రియైన దావీదు రాజును, తన జీవితంలో దేవుని గొప్ప సాన్నిధ్యాన్ని, 'ఆనంద తైలం' అని పేర్కొన్నాడు. తన 'గొర్రెల కాపరిగా' కీర్తనలో ప్రసిద్ధి చెందిన దావీదు - గొర్రెల కాపరి నుండి రాజుగా ఎన్నుకోబడ్డాడు - కీర్తనలు 23:5 లో ఇలా ప్రకటిస్తున్నాడు: " నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది '' అని ఆ పరిపూర్ణ ఆనందాన్ని అనుభవించినట్లు తన కీర్తనలలో వ్యక్తపరచి యున్నాడు.
మీరు భరించవలసిన సవాళ్లును; మరియు ఆశాజనకంగా అనిపించే పరిస్థితులు, నిరాశగా మారియున్న మీ ప్రస్తుత మార్గమును ‘గిన్నె’అనేది సూచిస్తుంది. ప్రాథమికంగా, 'గిన్నె' అంటే మీరు జీవించడానికి ఇవ్వబడిన జీవితం. తన శత్రువులచే వెంబడించబడినప్పటికీ, అతను నమ్మిన వ్యక్తులచే నిందించబడినప్పటికీ మరియు బెదిరించబడినప్పటికీ, దావీదు ఇప్పటికీ తన "గిన్నె నిండి పొంగిపొర్లుతుంది" అని చెప్పగలిగాడు, తనపైగల దేవుని అనుగ్రహాన్ని మరియు దేవుని అభిషేక తైలమును ఉన్నతపరిచాడు. ఆ అభిషేక తైలము దావీదుకు ఒక దేశాన్ని పరిపాలించుటకు, తన శత్రువులను జయించుటకు, దైవిక రాజ్యాన్ని నిర్మించడానికి మరియు, ముఖ్యంగా, దేవుని హృదయానికి దగ్గరగా ఉండటానికి శక్తిని ఇచ్చెను!
మీరు ఇప్పుడు ఒక పోరాటం గుండా వెళ్లుచున్నట్లయితే మరియు దానికి అంతం సమీపముగా ఎక్కడ కనుగొనలేకపోవుచున్నామని తలంచినట్లయితే, భయపడకండి. మీ గిన్నెను తన మంచితనంతో పొంగిపొర్లునట్లుగా నింపుచున్న యేసు వైపు చూడండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వెదకండి- ఆ అమూల్యమైన జ్ఞానవాక్యం, అది మిమ్మల్ని ప్రమాదం నుండి కాపాడుతుంది, భక్తిహీనుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది మరియు ప్రతిరోజూ మిమ్మల్ని విజయవంతంగా నిలబెట్టుకుంటుంది. కనుకనే, మీరు యేసుతో నీతిగా జీవించుచూ, మీరు మీ పాపాలను ఒప్పుకున్నప్పుడు, మీ వ్యసనాలు, శాపాలు మరియు అవిశ్వాసం నుండి బయటపడటానికి ఆయన మీకు సహాయం చేస్తాడు.
యేసు ప్రభువు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. యెషయా 61:3 ఇలాగున చెబుతుంది, "దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును దుఃఖించేవారికిచ్చును.'' అవును, దుఃఖించేవారికి దేవుడు సహాయం చేస్తాడు... ఆయన మీకు సహాయం చేస్తాడు. "ఆయన మీకు దుఃఖమునకు బదులుగా ఆనందతైలమును ఇస్తాడు'' మరియు "ఆనంద తైలముతో మిమ్మల్ని అభిషేకించుట '' ద్వారా అందరికంటే మిమ్మును ఉన్నతంగా ఉంచుతాడు. (కీర్తనలు 45:7).
దేవుడు మిమ్మల్ని అభిషేకించినప్పుడు, మీ ఆశీర్వాదాలు పొంగిపొర్లుతాయి. మీరు ఎప్పటికీ ఒకేలా ఉండరు మరియు మీ జీవితం మేలుతో మార్చబడుతుంది. మీ ప్రతి దుఃఖం ఆనందంగా మారుతుంది. మీరు ఆయన జ్ఞానం మరియు సంపదలతో నింపబడి ఉంటారు. మీకు ఏ మేలు కొదువై ఉండదు! ఈరోజే ఆయన ఆనంద తైలాన్ని స్వీకరించండి. దేవుని దీవెనలు పొందండి.
- డా. పాల్ దినకరన్