నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 58:11వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో ప్రభువు ఇలాగున అంటున్నాడు, "కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడు...'' ప్రకారం మీరు అనుకోవచ్చును, మేము ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నాము మరియు మేము ఎంతో నీతిగా జీవించుచున్నాము, దేవుని యొక్క సేవకు మరియు సేవకులకును మరియు బీదలకు ఇవ్వడంలో మేము ఎంతో దాతృత్వము కలిగియున్నాము. మేము అందరితోను నీతిగా వ్యవహరించియున్నాము. వీటన్నిటికిని తగిన ప్రతిఫలము మాకు ఎప్పుడు వస్తుంది? అయితే, దేవుడు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "నీతిమంతులైన మీ యొద్దకు నిశ్చయముగా మీ ఫలము వస్తుంది. అది ఈ రోజునే వస్తుంది'' అంటున్నాడు. ఆలాగుననే నేడు అన్ని వైపుల నుండి మీ యొక్క నీతికి ప్రతిఫలము తప్పకుండా కలుగుతుంది. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, మత్తయి 6:33లో యేసు ప్రభువు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును'' అన్న వచనము ప్రకారము మీరు మొదట దేవుని రాజ్యాన్ని మరియు నీతిని వెదకినప్పుడు, నిశ్చయముగా, మీరు అడిగినవన్నియు మీకు ఇవ్వబడతాయి.


ఆలాగుననే, మహారాష్ట్రలో నుండి పూనెలో ఉన్న సంధ్య లోక్హండే అను ఒక ప్రియమైన సహోదరి అటువంటి ఆశీర్వాదమును పొందుకొని యున్నారు. 19 సంవత్సరములుగా యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో భాగస్థులుగా ఉన్నారు. 2002లో వివాహము జరిగింది, 2018 వరకు వారు అద్దె గృహములో నివాసమున్నారు. స్వంత గృహము కొరకు ఎంతగానో ఎదురు చూశారు. అటువంటి సమయములో కోయంబత్తూరులో కారుణ్య నగర్‌లో ఉన్న బేతెస్ద ప్రార్థనా కేంద్రమునకు వచ్చారు. అక్కడ మేనెలలో ప్రార్థన చేసుకున్నారు. అద్భుతకరంగా జూన్ నెలలో దేవుడు వారికి అందమైన ఒక నూతన గృహమును అనుగ్రహించాడు. కుటుంబ సమేతంగా వారు ఒక చిన్న గృహము కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే, దేవుడు వారి ఎదురు చూపులకంటే, మిన్నగా, ఒక గొప్ప అందమైన పెద్ద ఇంటిని దేవుడు వారికి ఇచ్చి, వారిని దీవించాడు. ఆయన అడిగి, ఆశించి మరియు ఊహించువాటన్నిటికంటే గొప్ప కార్యములు చేయువాడై యున్నాడు. కాబట్టి, దిగులుపడకండి.


ఇంకను వారు మరొక సాక్ష్యమును పంచుకున్నారు, ఆమె 15 సంవత్సరములుగా బహుళ జాతీయ సంస్థలో పని చేయుచున్నారు. తనతోటి ఉద్యోగస్థులందరికి కూడ పదోన్నతి లభించినది. అక్షరాల తగిన సమయమునకు వారికి పదోన్నతి వచ్చినది, మంచి అభివృద్ధి వారికి కలిగినది. కానీ, తాను అభివృద్ధి పొందుటలో ఎంతో వెనుకబడియుండెను. తద్వారా, ఆమె ఎంతో ఒత్తిడికి లోనైయినది. ఆమె చాలా కష్టపడి పనిచేసే ఉద్యోగిగా ఉండెను. ఎప్పుడు కూడ ఆమె పదోన్నతికి ఎవరు కూడ ఆమెకు సిఫార్సు చేయలేదు. అనేక సంస్థలలో ఉద్యోగాలకు ధరఖాస్తు పెట్టుకున్నారు. కానీ, ఏదీయు ఫలించలేదు. 2022 ఫిబ్రవరిలో మరల బేతెస్దకు వారు వచ్చారు. ఉద్యోగము కొరకు ప్రార్థించుకున్నారు. 'ప్రభువా, నీవు నాతో కూడ ఉన్నావని ఒక సూచన కనుపరచుము, నేను బే తెస్ద నుండి వెళ్లకముందే నాకు ఒక సూచన కావాలి.' ఆమె బేతెస్ద ప్రార్థన కేంద్రములో నడుస్తుండగానే, ఒక ఫోన్ కాల్ వచ్చినది. అద్భుతవిధంగా బహుళ జాతీయ సంస్థలో నుండి ఆమెకు ఉద్యోగము లభించింది. ఆమె అక్కడ పది నెలలుగా పనిచేస్తున్నారు. గతంలో పని చేసిన జీతము కంటే 50శాతము ఎక్కువగా వేతనము లభిస్తుంది. దేవుడు తనపై నమ్మకం ఉంచే వారందరికి వాగ్దానం చేసినట్లుగానే, అద్భుతమైన జీవన ప్రగతితో ఆమె నీతిని గౌరవించాడు. నీతిగా ఉన్నందుకై దేవుడు ఆమె బహుమానమును అనుగ్రహించాడు. దేవుడు ఆలాగున మీకును జరిగించును. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
నీతిగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మా జీవితంలో నీ యొక్క మంచితనాన్ని మరియు విశ్వాసాన్ని అంగీకరిస్తూ కృతజ్ఞతతో కూడిన హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, నీవు నీతిమంతులకు వచ్చు ప్రతిఫలమును గురించి నీవు చేసిన వాగ్దానాలకు మరియు మేము ఊహించనంతగా నీ యొక్క ఏర్పాటునకు వందనాలు తెలియజేయుచున్నాము. దేవా, మా జీవితానికి సంబంధించిన తగిన సమయం మరియు ప్రణాళికలను విశ్వసిస్తూ, అన్నింటికన్నా నీ రాజ్యాన్ని మరియు నీతిని మొదట వెదకడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము తీసుకొనబోయే ప్రతి నిర్ణయంలో మరియు పరిస్థితులలో నీ సన్నిధితో మమ్మును నడిపించుము. దేవా,మా నీతిని ఘనపరచుము, అప్పులన్నియు తిరిగి చెల్లించుటకు సహాయము చేసి, ఉద్యోగములో పదోన్నతిని లేక మంచి ఉద్యోగమును రెండింతల జీతముతో మాకు ఒక మంచి ఉద్యోగమును అనుగ్రహించుము. ప్రభువా, మాకు సమీపములోనే బదిలీ వచ్చునట్లుగాను, మా కుటుంబముగా కలిసి జీవించునట్లుగాను మరియు అదే నగరములో మమ్మును ఘనపరచుము, మేము వర్థిల్లునట్లు మాకు సహాయము చేయము. యేసయ్యా, ఇంతవరకు మేము నీతిలేకుండా, పాపముతో జీవించుచున్న మా జీవితమును నీ యొక్క అమూల్యమైన రక్తము ద్వారా కడిగి పవిత్రపరచి, మమ్మును నీతిమంతులుగా తీర్చిదిద్దుమని యేసుక్రీస్తు నీతిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.