దేవుడు డాక్టర్. పాల్ దినకరన్‌గారి ద్వారా యేసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పధకమును పరిశుద్ధాత్మచేత బయలుపరచెను.

 • వ్యాపార గృహాలు/ వ్యాపార సంస్థలు

 • వ్యాపారంలో ఉన్న వ్యక్తులు

 • దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి మరియు వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి సంపదను సృష్టించాలి.

అవును, నా స్నేహితులారా, మీరు ఈ ప్రణాళికలో మీ దుకాణం, వాణిజ్యం, వ్యాపారం లేదా పరిశ్రమను నమోదు చేసుకొన్నప్పుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు మరియు మీ వ్యాపారానికి దైవిక కాపుదల, సమృద్ధిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రభువు మీకు లాభదాయకంగా ఉండటానికి మరియు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి నేర్పుతాడు. మీరు పెట్టుబడి పెట్టిన నూతన సంస్థ అయినా లేదా కొనసాగుతున్న సంస్థ అయినా ప్రభువును విశ్వసించండి, ఆయన మిమ్మును నష్టాన్ని ఎదుర్కోనివ్వడు. ప్రభువైన దేవుడు మీకు సమస్తాన్ని రెట్టింపు పరిమాణంలో పునరుద్దరిస్తాడు. నూరు రెట్లు ఆశీర్వాదపు పంటను పొందేలా మిమ్మును బలపరుస్తాడు (ఆదికాండము 26:12). మీ శ్రమ ఫలాలను శాంతితోను, ఆనందంతోను అనుభవించేలా చేస్తాడు.

ఈ సమృద్ధి ప్రణాళికలో వాగ్దానం చేయబడింది

నేడు ప్రపంచం అనేక వ్యాపారాలను ప్రభావితం చేసే ఆర్థిక సంక్షోభాన్ని, ద్రవ్యోల్బణం, వస్తువుల కొరత, వ్యర్థమైన పోటీ, ప్రకృతి వైపరీత్యాలు, ప్రజలు మరియు దేశాల మధ్య విభజన, వ్యాపార వర్గాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అయితే, ఈ సంక్షోభాల మధ్య, తన రాజ్యాన్ని నిర్మించే తన ప్రజలను అభివృద్ధి చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. (మలాకీ 3: 10,11) అన్న వచనముల ప్రకారము మీ దశమ భాగమును దేవుని యొద్దకు తీసుకురండి, " నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తిని వేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనము చేయవు, మీ ద్రాక్షచెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ''

వ్యాపార సంస్థలను మరియు వ్యాపారంలో పాలుపంచుకున్న వారిని పరలోకపు వాకిళ్లను విప్పి దేవుడు ఆశీర్వదించాలని, ఆయన తన ప్రజలకు ఆశీర్వాదాలను తీసుకొని వస్తున్న, దేవుని పరిచర్యకు తమ కానుకలను పంపుతున్నవారి సంపాదనకు నష్టాన్ని తీసుకొని వచ్చి, మ్రింగివేయుచున్న అపవాదిని గద్దించాలనియు, తన బిడ్డల యొక్క జీవితాలలో ఆశీర్వాదాలను తీసుకొనిరావలెనని దేవుడు కోరుకుంటున్నాడు.

యెషయా 60: 5 ప్రకారం, ప్రభువు రాబోయే రోజుల్లో, తన ప్రజలను దేశ సంపదను వారసత్వంగా పొందేలా చేస్తాడు మరియు జాతీయ రాజకీయ విధానాలలో పాలుపొందుటకు వారు తోడ్పడటానికి సహాయపడతాడు, ఇది దేశాన్ని ఆశీర్వదించడానికి, దేవుని పరిచర్యతో ఏకీభవిస్తుంది, ఈ దేశములో ఉన్న ప్రతి పౌరుడిని వృద్ధిపొందునట్లు చేస్తుంది. ఇది నీతిని, దేశంలో ఉన్నవారందరికి సంపదను సమానంగా పంపిణీ చేస్తుంది, తద్వారా ప్రతి పౌరుడిపై దేవుని మహిమ స్థిరముగా నిలిచియుంటుంది (యెషయా 66:21). అప్పుడు దేశం ఆనందిస్తుంది (యెషయా 25: 8) ఈ సందర్భంలోనే వ్యాపార ఆశీర్వాద పధకము పరిశుద్ధాత్మ యొక్క దైవిక నడిపింపు ద్వారా మీకు ఇవ్వబడియున్నది.

ఎవరు నమోదు చేయవచ్చు?

నమోదు చేయాలనుకునే భాగస్థుల వ్యాపారమును గురించి బాధ్యత లేదా వ్యాపార చేయు వ్యక్తి లేదా వ్యాపారం కోసం పనిచేసే వ్యక్తి కావచ్చును మరియు వారిని పంపడానికి సిద్ధంగా ఉన్నాడు.

 • యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు ప్రతి నెల భాగస్థుల కానుక

 • ప్రతి సంవత్సరం వారి వార్షిక లాభాలలో కొంత భాగాన్ని యేసు పిలుచుచున్నాడు పరిచర్య కొరకు

 • యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు ప్రతి నెల మొదటి రోజున సేకరించబడును.

 • మొదటి చెల్లింపు, ప్రతి నెల ప్రారంభంలో ఈ వ్యాపారమును యేసు పిలుచుచున్నాడు పరిచర్య అందుకుంటుంది. దీని నిమిత్తము, ప్రార్థన, ఆలోచనల ద్వారా వారి విరిగిన హృదయాలకు మరియు జీవితాలకు స్వస్థతను తీసుకురావడానికి ఆ డబ్బును ప్రార్థనతో ప్రజల జీవితాలలో పెట్టుబడి పెట్టడం లేదా విత్తడం జరుగుతుంది. సామాజిక మరియు ఆర్థిక సహాయం, విద్య మొదలైనవి మరియు దేవుని ప్రేమ మరియు శక్తి ద్వారా వారికి జీవితాన్ని అనుగ్రహిస్తుంది.

నమోదు చేయడం వలన కలిగే ప్రయోజనాలు

 • డాక్టర్. పాల్ దినకరన్‌గారు లేదా వారి కుటుంబంలోని సభ్యులు ఎవరైనా కూటాల ద్వారా లేదా వ్యక్తిగతంగా కలుసుకొనుట ద్వారా ఎప్పటికప్పుడు వ్యాపార ఆశీర్వాద పధకములో ఉన్న భాగస్థుల కొరకు ప్రత్యేక కూటాలు నిర్వహించి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు.

 • నియమించబడిన ప్రార్థన యోధులచే భాగస్థుల కోసం ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు అందించబడతాయి.

 • ఇందునిమిత్తము తపాల, టెలిఫోన్ లేక ఈమెయిల్ ద్వారా భాగస్థులు ప్రార్థన గోపురమును సంప్రదించిన ప్రతిసారి వారి రిజ్రిస్టేషన్ నెంబర్‌ను సూచించుట ద్వారా ఎజియమ్స్ చర్చలు, ప్రత్యేక చర్చలు, వ్యాపార వివాదములు, వ్యాపార ఒప్పందాలను నిర్ణయించడం, ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూడటం మొదలైన వాటి కొరకు ఆ సమయములో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడును.

 • ప్రార్థన గోపురముల వద్ద ప్రార్థన వీరులు ప్రార్థనలు చేస్తారు, 24 గంటల గొలుసు ప్రార్థనలు జరుగుతాయి.

 • వ్యాపార సంస్థల యజమానులు, వాణిజ్యవేత్తలు, వ్యవస్థాపకులు మరియు పారిశ్రామికవేత్తల ఆశీర్వాదం కోసం భారతదేశంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములన్ని కలిసి నెలకు ఒకసారి నిర్వహించే వ్యాపార ఆశీర్వాద సమావేశంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగించబడును.

 • తమ వ్యాపార ప్రయత్నాలలో దేవుని చిత్తాన్ని వెదకుతున్న వారి కొరకు దినకరన్లు ప్రార్థనలు చేస్తారు.

 

  సమస్యలు ఆగిపోయాయి, లాభాలు పెరిగాయి

  నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను అయితే, సహోదరులు పాల్ దినకరన్‌గారి ప్రార్థనల ద్వారా స్వస్థత పొందాను. అప్పటి నుండి, నేను యేసును వెంబడించడం ప్రారంభించాను. నేను ఒక ట్రావెల్స్ (ప్రయాణాల) వ్యాపారాన్ని ప్రారంభించాను. అయితే, ఇతర ప్రయాణ సంస్థల నుండి నేను చాలా పోటీ సమస్యలను ఎదుర్కొన్నాను. నా కుటుంబం లేదా స్నేహితుల నుండి నాకు ఎటువంటి సహాయం రాలేదు. ఆ సమస్యలన్నిటిని ఒంటరిగా మోయవలసి వచ్చింది. ఆ సమస్యలన్ని ఎందుకు సంభవించాయో నాకు అర్థం కాలేదు. ఈ పరిస్థితిని అధిగమించలేక, కలవరానికి గురైన ఆ క్షణాల్లో యేసు పిలుచుచున్నాడు " వ్యాపార ఆశీర్వాద పధకంను '' గురించి తెలుసుకున్నాను. నేను " వ్యాపార ఆశీర్వాద పధకంలో '' నమోదు చేసుకొన్నాను. యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురంలోని ప్రార్థన వీరులు నా కొరకు, నా వ్యాపారం కోసం ప్రార్థించడం ప్రారంభించారు. నా సమస్యలన్నియు కనుమరుగైపోయాయి. ఇంతకు ముందు, నా వ్యాపారం ప్రారంభించేటప్పుడు నేను ఒక బస్సును కొన్నాను. కానీ, ఇప్పుడు మూడు బస్సులు కొనగలిగాను. దేవుని దయతో వ్యాపారాన్ని లాభదాయకంగా నడుపుతున్నాను. " వ్యాపార ఆశీర్వాద పధకం '' ద్వారా ప్రభువైన యేసు వలన నిజంగా ఆశీర్వదించబడ్డాను. దేవునికే మహిమ కలుగును గాక.

  - సంధ్య కుమారి, రాంచీ.

   

   

  దేవుని పనికి ఇవ్వండి మరియు మీరు గొప్ప లాభం పొందుకుంటారు