కుటుంబ ఆశీర్వాద పధకం

 

దేవుని శ్రేష్ఠమైన ఆశీర్వాదాలపై మీ కుటుంబం స్థాపించబడుట కొరకు

 

" నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.'' (కీర్తనలు 128:2,3

దేవుడు మానవుని మీద ఉంచిన మొదటి ఆశీర్వాదము మరియు మొదటి బాధ్యత కుటుంబమై యున్నది. ఈ కుటుంబ ఆశీర్వాద పధకము,  కుటుంబాలు ఆశీర్వదించబడటానికి, ఐక్యముతో జీవించడానికి మరియు అభివృద్ధి చెందడానికి డాక్టర్. పాల్ దినకరన్‌గారికి ప్రభువు అనుగ్రహించిన అసాధారణమైన పధకమే ఈ ' కుటుంబ ఆశీర్వాద పధకం.' ఈ పధకములో సభ్యత్వం పొందిన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, సమాధానమును అనుభవించ లని మరియు కుటుంబంలోని ప్రతి సభ్యుడు మంచి ఆరోగ్యంతో ఉండాలని యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురములో ప్రార్థనలు చేయబడుచున్నవి

మీ కుటుంబము దేవుని హస్తములకు సమర్పించుకున్నప్పుడు, అబ్రాహామునకు మరియు అతని కుటుంబమునకు దేవుడు వాగ్దానము చేసిన ఆశీర్వాదములను మీ మీదికి తీసుకొని వచ్చుటకు ఆయన కూడ మీ కుటుంబముతో చేతులు కలుపును. విడదీయలేని ప్రేమ బంధములతో ఆయన మిమ్మును కట్టును మరియు ఆయన సన్నిధి మీ చుట్టు మరియు మీ ప్రియమైన వారి చుట్టు తిరుగుచు, మిమ్మును కాచి కాపాడును. మీరు శ్రేష్టమైన ఆశీర్వాదములను అనుభవించెదరు, వృద్ధి పొందెదరు మరియు ఫలించెదరు.

కుటుంబ ఆశీర్వాద పధకము యొక్క ప్రత్యేక ఆధిక్యతలు:
  • రూ.3000/- కానుకలు చెల్లించిన తరువాత ఒక భాగస్థునికి వాగ్దాన వచనముతో కూడిన ఒక సర్టిఫికెట్‌ను పంపించబడుతుంది
  • దినకరన్ కుటుంబ సభ్యుల నుండి ఒక ప్రత్యేకమైన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కార్డు పంపించబడుతుంది.
  • ప్రార్థన యోధులు మీకు ఫోన్ చేసి, మీ వివాహ వార్షికోత్సవ దినమున ప్రార్థన చేస్తారు. 
  • అనుదినము ఎస్.ఎమ్.ఎస్. (SMS) ద్వారా ఒక వాగ్దాన వచనము మీకు పంపించబడుతుంది
  • ప్రతినెల యేసు పిలుచుచున్నాడు పత్రిక మీ చిరునామాకు పంపించబడుతుంది.

ప్రతినెల కనీసం రూ. 500/- లేక అంతకంటె ఎక్కువగా, త్యాగపూరితముగా మీరు పంపించే మీ కానుకలు విరిగినలిగిన హృదయముగలవారికి సేవ చేయడంలోను మరియు కుటుంబాలకు సేవ చేయడంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు సహాయపడుచున్నది. 

మీరు, మీ కుటుంబము యొక్క ఫోటోలను, మీ పేరు, పుట్టిన తేదీ మరియు మొబైల్ నెంబర్‌ను, [email protected] అను మా ఈ మెయిల్‌కు పంపించండి. 


కాపుదల మరియు అభివృద్ధి: 
 

కుటుంబ ఆశీర్వాద పధకములో చేరుట ద్వారా ఆశీర్వాదములను పొందిన ఒక సహోదరి సాక్ష్యమును ఇక్కడ చూడగలము. 
కుటుంబములో సమాధానము పునరుద్ధరించబడినది

నాకు వివాహమై 28 సంవత్సరములైనది. నా భర్త చాలా మంచివాడు. కానీ, గత రెండు సంవత్సరములుగా ఆయన దురాత్మ బంధకములతో పీడింపబడుచు, కోపంతో నింపబడి, కఠినముగా ప్రవర్తించుచుండేవాడు. ఆయన ఎల్లప్పుడు చిరాకుపడుచు, నాతో గొడవపడుతూ ఉండేవారు. దీని వలన మేము మా కుటుంబములో సమాధానమును కోల్పోయాము. అటువంటి సమయములో నాకు ఏమి చేయాలో తెలియలేదు మరియు మా దినములన్నియు కన్నీటితో నిండిపోయినవి. ఇటువంటి పరిస్థితులలో, నేను కుటుంబ ఆశీర్వాద పధకమును గూర్చి తెలుసుకొన్నాను మరియు మా కుటుంబమును అందులో చేర్చాను. ఎంత అద్భుతము! త్వరలోనే, నా భర్తలో గుర్తించతగిన మార్పును చూశాను. మా కుటుంబ సమాధానమును పాడు చేసిన దురాత్మ బంధకముల నుండి ఆయన మమ్మును విడిపించాడు, మేము విడుదల పొందుకున్నాము. ఇప్పుడు మేము మళ్లీ సంతోషముతోను మరియు సమాధానముతోను జీవించుచున్నాము. దేవునికి స్తోత్రం

- సి. గ్లాడిసీ వసంత్, చెన్నై.

 
దేవుని ప్రణాళికకు మీ కుటుంబమును సమర్పించుకోండి మరియు మీ కుటుంబము చుట్టు దేవుని కంచెను కలిగి ఉండండి

 

పరిచర్యను గూర్చిన వివరముల కొరకు ఉ.7.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు 044-23456677 అను పార్టనర్ క్యేర్ నెంబర్‌కు ఫోన్ చేయండి.