నా ప్రియ స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయుడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మన్నాను పరలోకము నుండి స్వీకరించినప్పుడు, అది ఎంతగానో రుచికరముగా ఉండెను. ఆలాగుననే, మనము ఈ రోజు అటువంటి మన్నా అయిన దేవుని వాగ్దానమును పరలోకము నుండి స్వీకరించబోవుచున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 18:10వ వచనమును మన ధ్యాన నిమిత్తము తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును'' అని దేవుడు సెలవిచ్చియున్నాడు. అవును నా స్నేహితులారా, ఇది ఎంతో వాస్తవము. మనము పరుగెత్తి వెళ్లి, దేవుని నామము క్రింద దాగియున్నట్లయితే, ఆయన నామమును మన మీద మోయుచున్నప్పుడు, మనము ఆయన బిడ్డలముగా చెప్పుకొనుచూ, మనము సంపూర్ణంగా భద్రతను కలిగి ఉంటాము. అంతమాత్రమే కాదు, ఏ కీడు మన యొద్దకు వచ్చి, మనలను నాశనము చేయజాలదు. ఏదీయు కూడా మన ఆత్మను పాడుచేయజాలదు. మన జీవితములు నశింపజేయబడజాలవు. మనము దేవుని చేతులలో సురక్షితముగా భద్రపరచబడియుంటాము.

సాధారణంగా, క్రికెట్ ఆటను మనము గమనించినట్లయితే, ఇరువైపుల ఇద్దరు బ్యాట్స్‌మెన్ఉంటారు. వారు బంతిని కొట్టినప్పుడు, వారు వెంటనే అవతలి వైపుకు పరుగెత్తుకుంటూ వెళ్లి, అవతలి గీతను చేరుకోవడం మనము చూడగలుగుతాము. ఒక్కసారి వారు ఆ గీతను చేరుకోగానే మరియు వారు ఆ గీతకు చేరుకున్న తర్వాత, రిఫరీ లేదా అంపైర్ మీరు సంపూర్ణంగా క్షేమముగా, సురక్షితంగా ఉన్నారని చెబుతారు. ఎవరూ కూడా మీ వికెట్‌ను తీసివేయలేరు. మీరు బయటకు వెళ్లలేరు, మీరు ఈ ఆటలోనే ఉన్నారు అని చెబుతారు. ఇక అంతే, వారు సురక్షితంగా ఉంటారు. నా ప్రియులారా, నేడు మనము కూడా ఆలాగుననే ఉండాలి. మనము ప్రభువు నామములోనికి పరుగెత్తాలి. అవును, అక్షరాలా, మనము కూడా పరుగెత్తాలి. ఎందుకంటే, అక్కడ ఏ కీడు కూడా మనలను తాకజాలదు.

నా ప్రియులారా, నేడు మీరు కూడా బహిరంగా బయట ఉన్నట్లయితే, దేవుని నామము యొక్క కాపుదల లేకుండా మరియు దేవుని బిడ్డలుగా కాకుండా ఉన్నట్లయితే, మీరు అపవాది యొక్క దాడికి పూర్తిగా విడిచిపెట్టబడతారు. కనుకనే, మిమ్మును నాశనము చేయడానికి, నా స్నేహితులారా, ఆయన నామము క్రింద దాగియుండడము చాలా ప్రాముఖ్యము. కనుకనే, 'ప్రభువా, ఈ రోజు మేము నీ బిడ్డలము' అని ఆయన నామమును మనము స్వతంత్రించుకున్నప్పుడు, ఏ అపవాది యొక్క దాడి మన మీద వర్థిల్లదు. దేవుడు మనలను ఎంతో సురక్షితంగా భద్రపరుస్తాడు. మనము ఆయనలో సురక్షితముగాను, క్షేమముగా ఉంటాము. నేడు మనము ఈ వాగ్దానమును స్వతంత్రించుకుందామా? ఆలాగునైతే, నేడు మీరు నీతిమంతులుగా తీర్చబడునట్లుగా, దేవుని యొక్క బలమైన దుర్గములోనికి పరుగెత్తి వచ్చినట్లయితే, నిశ్చయముగా మీరు ఎంతో సురక్షితముగా ఉంటారు, ఏ కీడు మిమ్మును తాకదు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును కాపాడి, భద్రపరచి, దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రేమగల ప్రభువా, మాకు ఆశ్రయంగా, బలమైన కోటగాను మరియు సురక్షితమైన దాగుకొను చోటుగా ఉన్నందుకు వందనాలు. ప్రభువా, నీ యొక్క నామము మాకు బలమైన దుర్గముగా అనుగ్రహించినందుకై నీకు వందనాలు. దేవా, ఏ కీడు నీ దుర్గమును తాకలేదు, ఏదియు కూడా మమ్మును నాశనము చేయలేదు. కనుకనే, నీ నామము బలమైన దుర్గము, మేము అందులోనికి పరుగెత్తి సురక్షితముగా దాగుకొనుచున్నాము. యేసయ్యా, నీ రక్తము క్రింద మమ్మును కప్పుము, నీ యొక్క శక్తివంతమైన నామమును మా మీద ఉంచుము, తద్వారా, మా జీవితాలు శక్తివంతముగా ఉండునట్లు చేయుము. దేవా, ఏ అపవాది యొక్క దుష్ట ప్రణాళికను, మాకు విరుద్ధముగా వర్థిల్లకుండా చేయుము. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదములు అపవాది యొక్క ప్రణాళికను బ్రద్ధలు చేయునట్లుగా అటువంటి కృపను దయచేయుము. దేవా, మమ్మును అత్యంతగా ఆశీర్వదించుటకు, ఎల్లవేళల నిన్ను వెదకడానికి నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, ఈ రోజు, మేము విశ్వాసంతో నీ నామంలోనికి పరుగెత్తుటకును, 'మేము నీ బిడ్డలము, ప్రభువా' అని ప్రకటించుచున్నాము. దేవా, ఏ కీడు దగ్గరికి రాలేదని, ఏ చీకటి మమ్మును అధిగమించలేదని మేము నమ్ముచున్నాము, ఎందుకంటే మేము నీ బలమైన చేతులలో సురక్షితంగా ఉన్నాము. ప్రభువా, నీ రక్షణతో మమ్మును కప్పుము, మా హృదయాన్ని మరియు ఆత్మను రక్షించుము, మేము ఎదుర్కొనే ప్రతి యుద్ధంలో నీ నామం మా ధ్వజంగా ఉండునట్లుగా చేయుము. దేవా, నీవు మాకు ముందుగాను, వెనుక భాగమును మరియు ప్రతి వైపు మమ్మును కప్పియుంచుతావనిమా భద్రత, నిరీక్షణ, మాకు బలంగా ఉంటావని మేము నమ్ముచూ, యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.