నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 14:27వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను...'' ప్రకారం దేవుడు మీకు శాంతిని అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. పై వచనములో, "నా శాంతి'' అనుబడుచున్న ఈ శాంతి, యేసునకు చెందిన శాంతియై ఉన్నది. బైబిల్‌లో యోబు 25:2వ వచనములో చూచినట్లయితే, "అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును'' ప్రకారం ఆయన విశ్వములోనికి శాంతిని పంపించుచున్నాడు. అందుచేతనే విశ్వమంతయు ఒక క్రమము ప్రకారం నడుచుచున్నది. దేవుని యొక్క శాంతి విశ్వమంతటిని తన స్వాధీనములో ఉంచుకొనియున్నది. అందుచేతనే చంద్రుడు మరియు విభిన్నమైన గ్రహాలు ఢీకొని, వేరొక దిశలో వెళ్లిపోకుండా ఉండునట్లుగా జరుగుతుంది. మా తండ్రిగారికి ఒక దర్శనము కలిగినది. ఆయన ఎంతగానో బ్రద్ధలైన పరిస్థితిలో ప్రభువైన పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను పరలోకమునకు తీసుకొని వెళ్లాడు. ప్రభువు తన సింహాసనము మీద ఆసీనుడై కూర్చుని ఉండుట చూశారు. ఆయన ఎదురుగా గ్రహాల యొక్క సంచారాన్ని ఆయన చూశారు. విశ్వసమంతయు కూడా కదులుచున్నది. గ్ర హములన్నియు కూడా ఆయన సింహాసనమును ఆలాగున దాటి వెళ్లుచున్నప్పుడు, అవన్నియు కూడా ఆయన యెదుట సాష్టాంగపడి తిరిగి మరల వాటి మార్గములో, కక్షలో వెళ్లుచున్నట్లుగా కనిపించినది. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, ' నా కుమారుడా, నేను విశ్వమంతటిని ఎలాగున నా ఆధీనములో ఉంచుకొని యున్నావో నీవు చూచి యున్నావు కదా! నేను వాటిని నా ఆధీనములో ఉంచుకొనగలిగినట్లయితే, నా యొక్క శాంతి చేత క్రమముగా వెళ్లునట్లుగా చేయుచున్నట్లయితే, ఏ విధమైన సంక్షోభము లేకుండా, నేను నీ జీవితమును నా ఆధీనములో నడిపించలేనా? నా శాంతిని నేను నీకనుగ్రహించ్చుచున్నాను. నా శాంతి, లోకము ఇచ్చునట్లుగా కాదు, లోకము ఇచ్చు శాంతి సంక్షోభముగా ఉంటుంది ' అని తెలియజేశాడు.

ఎందుకంటే, అది అపవాది నుండి వచ్చియున్నది. లోకము యొక్క శాంతి నిరంతరమునకు నిలిచి ఉండునది కాదు. కానీ, ఎవరైన ఇతరుల యొద్ద ఏదైన కావాలనుకుంటే, అప్పుడు వారితో సమాధానముగా ఉంటారు. ఆ తర్వాత, వారిని విసిరి పారవేస్తారు. కానీ, యేసు సెలవిచ్చుచున్నాడు, 'శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించియున్నాను, నేను నిరంతరమునకు నిన్ను ప్రేమించుదును. నేను సిలువలో చిందించిన నా రక్తము చేత నిన్ను కొనిన దినము మొదలుకొని, నీవు నా సొత్తువు, నీవు నా వాడవు, నీవు నాకు చెందినవాడవు, నిరంతరమునకు నేను నీతో శాంతిని కలిగియున్నాను, అట్టి నా శాంతిని నేను నీకు అనుగ్రహించుచున్నాను' అని అన్నాడు. ఆలాగుననే, ఆయన మా తండ్రిగారికి ఏమని చెప్పాడంటే, 'నా కుమారుడా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నిత్యమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా శాంతితో కూడా వెళ్లు, నేను ఎప్పటికి నిన్ను విడువను, నిన్ను ఎన్నటికిని ఎడబాయను అని చెప్పాడు.' ఆ తర్వాత, మా తండ్రిగారి యొక్క సమస్యలు మరియు సవాళ్లు అన్నియు ఆ విధంగా కనుమరుగైపోయాయి. మా తండ్రిగారి ద్వారా లక్షలాదిమంది దీవించబడ్డారు. దేవుడు ఆలాగుననే మీకును కూడ జరిగిస్తాడు.

నా ప్రియులారా, ఆయన యేసు యొక్క తన శాంతిని మీలోపల ఉంచుచున్నాడు. యేసు అట్టి శాంతిని కలిగియున్నాడు. తను అప్పగించడానికి వచ్చిన యూదాకు భయపడలేదు. తనను ఎరుగను అని చెప్పిన పేతురును బట్టి ఆయన భయపడలేదు. ఆయనను గూర్చి ఆసూయ చెంది, ఆయనకు విరుద్ధముగా ఎన్నో అబద్దపు మాటలు పలికియున్న యాజకులకు ఆయన భయపడలేదు. సిలువ వేయబడు నిమిత్తమై ఆయనకు శిక్షావిధి పలికియున్న పిలాతును గూర్చి యేసు ఏ మాత్రమును కూడా భయపడలేదు. తన నామమును బట్టి నిందారోపణ చేసిన ఎవరికిని ఆయన భయపడలేదు. అంతమాత్రమే కాదు, ఆయన ఈలాగున చెప్పాడు, 'తండ్రీ, వీరిని క్షమించు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు' అని పలికాడు. ఆలాగుననే, ఆయన మృతి నుండి తిరిగి లేచియున్నాడు, ఈ రోజు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై యున్నాడు. నా ప్రియులారా, అట్టి యేసుక్రీస్తు మీలో ఉన్నాడు, అట్టి యేసు యొక్క శాంతి మీలోనికి దిగివచ్చియున్నది. యేసు ద్వారా, యేసు యొక్క శాంతిని మీ హృదయములోనికి స్వీకరి ంచండి, మీ హృదయమును కలవరపడనీయకండి, మీరు జీవించెదరు. దేవుని యొక్క శాంతి ద్వారా దేవుడు ఐశ్వర్యవంతముగా మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నీ సింహాసనం నుండి ప్రవహించే పరిపూర్ణ శాంతికి ధన్యవాదాలు. దేవా, గందరగోళం మరియు క్షణికమైన సుఖాలతో నిండిన ప్రపంచంలో, మేము నీ శాశ్వత శాంతిని ఎంచుకుంటాను. యేసు శాంతి మా హృదయాన్ని నింఎ జీవితాన్ని నడిపించనివ్వండి. గ్రహాలను మరియు మొత్తం విశ్వాన్ని సామరస్యంగా ఉంచినట్లే, నా జీవితాన్ని కూడా మీరు క్రమంలో ఉంచుతారని నమ్మడానికి దయచేసి నాకు సహాయం చేయండి. లోకం ఇచ్చినట్లుగా కాదు, కానీ మీరు ఇచ్చినట్లుగా, అన్ని అవగాహనలను అధిగమించే మరియు మా జీవితంలోని ప్రతి తుఫానును శాంతింపజేసే శాంతిని మేము పొందుకొనునట్లుగా చేయుము. తండ్రీ, యేసయ్య, నీవు మా యొక్క హృదయాలలోనికి ప్రవేశించునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ కుమారుడైన యేసు నామమున అన్నియు కూడా శాంతియుతముగా జరుగునట్లుగా చేయుము. అన్నియు కూడా యేసు యొక్క శాంతియుతముగా ఉండునట్లుగా నీ కృపను మాపై కుమ్మరించుము. దేవా, మేము నీ శాంతిని పొందుకొనునట్లుగా మా జీవితాలను మరియు హృదయాలను పరిశుద్ధపరచుము. యేసయ్య, నీవు మాతో కూడా ఉండి, మాకు విజయమిచ్చునట్లుగా సహాయము మాకు చేయుము. దేవా, మేము దేనికిని భయపడకుండా చేయుము. ప్రభువా, సమస్తమును మా మేలు కొరకు జరుగునట్లుగాను, వాటన్నిటిలోను మాకు అత్యధికమైన విజయమును పొందునట్లుగా చేయుము. దేవా, మేము మరల లేవనెత్తబడునట్లుగా చేసి, మరల నూరంతలుగా దీవించబడునట్లుగా చేయుము. యేసయ్య, నీ ద్వారా మేము విమోచనను, నిత్యజీవము కలిగియుండునట్లుగా చేయుము. దేవా, ఈ రోజును దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.