నా ప్రియమైన స్నేహితులారా, మీకు శుభములు తెలియజేయుటలో నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. ప్రభువుయందలి మన నిరీక్షణ వైఫల్యము చెందదు. ప్రభువును మనలోనికి తీసుకొని వస్తుంది. ఇంకను ఆయన ఆశీర్వాదములను తీసుకొని వస్తుంది. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 1:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును'' ప్రకారము నీటి కాలువల చెట్లను మనము చూచినట్లయితే, అవి ఎంతగానో బాగుగా పోషించబడతాయి. ఎందుకంటే, అవి నీటిని సేవించగలుగుతాయి. ఆలాగే నేల సారవంతముగా ఉంటుంది. సమృద్ధియైన పోషక విలువలను అవి సంగ్రహిస్తుంటాయి. కనుకనే, అది చాలా ఆరోగ్యవంతముగా ఉంటుంది. సరిగ్గా తగిన సమయమునందు అది ఫలములనిస్తుంది. ఈ వచనము ఆ రీతిగా తెలియజేయుచున్నది. సరైన స్థలమునందు ప్రభువు ఆ రీతిగా నేడు మిమ్మును నాటబోవుచున్నాడు.

నా ప్రియులారా, దానికి ముందున్న వచనము అనగా, కీర్తనలు 1:2వ వచనములో మనము చూచినట్లయితే, "యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు'' అని చెప్పబడిన ప్రకారముగా దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ఆకువాడక ఫలమిచ్చు ఆ చెట్టువలె ఉండును వ్రాయబడియున్నది. కనుకనే, ఈ రోజు నుంచి దేవుడు తన వాక్యము చేత మనకు పోషణను అనుగ్రహించబోవుచున్నాడు. అది మనలను ఆరోగ్యవంతమైన చెట్టు వలె చేయుచున్నది. ఆయన వాక్యము మన జీవితములోనికి వచ్చి, మనము ఫలమును ఫలించునట్లుగా చేయుచున్నది. మనము నాటబడియున్న స్థలము ఒకవేళ మంచి స్థలములు కాకపోవచ్చును. కానీ, ఆ స్థలములో నుండి మనలను తీసివేయాలని తలంచుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన వేర్లతో సహా మనలను అక్కడ నుండి తీసివేసి, మనలను పెకలించివేస్తాడు.

ఒక వ్యక్తి ఒక కార్పోరేట్ ఆఫీస్‌లో పనిచేయుచున్నప్పుడు, తనకు కలిగియున్న తన స్థితిని నాకు ఈరీతిగా తెలియజేశాడు. తన యొక్క వివాహ జీవితమునకు వెలుపట ఒక స్త్రీతో అక్రమ సంబంధ బాంధవ్యమును కలిగియున్నట్లుగా నాకు తెలియజేసియున్నాడు. ఆ యొక్క బాంధవ్యము ఎంతో మంచిగా సంతృప్తిని కలిగించుచున్నది అని భావించాడు. అది అతనికి సంపూర్ణమైన సంతోషమును ఇస్తుంది అని అనుకున్నాడు. కానీ, అతడు నాతో ఈలాగున చెప్పాడు, 'నేను పొందుకున్న సంతోషము ఆలాగున లేదు. నేను ఎంతగానో దాక్కుంటూ ఉండిపోయాను. ప్రతి క్షణము కూడా నేను భయపడిపోవుచున్నాను. నా యొక్క పేరు పాడై పోతుందని నిత్యము భయపడ్డాను. నేను ఆ బాంధవ్యమును కలిగియున్నప్పుడు, నరకములో ఉన్నట్లుగా ఉండేది. నేను ఏమియు కూడా ఆనందించలేకపోయేవాడను. నేను దేని కోసము చూస్తున్నానో, నేను దానిని ఏ మాత్రము కూడా పొందలేకపోయేవాడను.' అవును, నా ప్రియులారా, దేవుడు అటువంటి తప్పుడు ప్రభావవితమైన ప్రాంతముల నుండి మనలను వేర్లుతో సహా పెకలింపవేయుచున్నాడు. ఈ రోజు దేవుని యొక్క వాక్యముగా ఉన్న నీటి కాలువ ఓరను ఆయన మనలను నాటబోవుచున్నాడు. ఆయన మనలను ఫలములను ఫలించునట్లుగా చేస్తాడు. మనము ఈ ఆశీర్వాదమును స్వీకరిద్దామా? ఒకవేళ నేడు మీరు ఆలాంటి తప్పుడు భావములతో ఉండియున్నట్లయితే, ఇప్పుడే, వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించినట్లయితే, నిశ్చయముగా, మీరు ఎల్లప్పుడు ఫలించువారుగా దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా మారుస్తాడు. నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా కష్టాలలో మాకు సహాయం చేయుము. దేవా, మేము ప్రతి ఉదయం నీ వాక్యాన్ని ఉద్రేకంతో పానము చేయడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీవు స్పష్టంగా మరియు వ్యక్తిగతంగా మాతో మాట్లాడటం మేము వినునట్లుగాను చేయుము. దేవా, మమ్మును నీ యొక్క ఆనందంతో నింపుము మరియు మా జీవితంలోని ప్రతి ప్రాంతంలో మమ్మును సమృద్ధులనుగా మరియు మమ్మును ఫలవంతమైన వృక్షంగా చేయుము. ప్రభువా, నీ వాక్యంలో లోతుగా పాతుకుపోయి, బలంగా, పోషించబడి, నీ జీవజలములచే నాటబడినవారలముగా మమ్మును మార్చుము. ప్రియమైన ప్రభువా, దయచేసి, మా ఇబ్బుందులలో మాకు సహాయము చేయుము. తండ్రీ, ఎక్కడైతే మా మీద తప్పుడు ప్రభావములు వేయబడుచున్నవో, మేము ఇప్పుడు నీ సహాయత కొరకు ఎదురు చూస్తున్నాము, ఇప్పుడే వాటిని మా నుండి తొలగించివేయుము. దేవా, అట్టి తప్పుడు కార్యములను మరియు తప్పుడు కోరికలను మా నుండి తొలగించివేయుము. ప్రభువా, సరైన మార్గము నుండి మమ్మును తొలగించు వాటన్నిటి నుండి మమ్మును బయటకు లాగివేయుచున్న వాటన్నిటిని మా నుండి వేర్లతో సహా పెకలింపజేయుము. దేవా, ఈ రోజు నుండి నీ వాక్యము ద్వారా మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, మేము ప్రగాఢమైన వాంఛతో ప్రతి ఉదయమును నీ వాక్యమును పానము చేయునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీవు మాతో మాట్లాడునట్లుగా వాక్యము ద్వారా నీ స్వరమును వినగలుగునట్లుగా, కృపను దయచేయుము. దేవా, మేము మా జీవితములో సంతోషభరితులుగా వృద్ధిని కలిగినవారుగా ఉండునట్లుగా కృపను దయచేసి, ఆలాగున, ఫలించు వృక్షమువలె మమ్మును మార్చుము. ప్రభువా, నీ యొక్క వాక్యములో వేరుపారు వారలముగా ఉండునట్లుగా ఎల్లప్పుడు ఆకువాడక పచ్చగా ఉండునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.