నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలములో మీకు శుభములు తెలియజేయడములో నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 సమూయేలు 2:9వ వచనమును మనము నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును...'' ప్రకారం ప్రియ స్నేహితులారా, ప్రభువు మిమ్మును కాపాడుతాడు. మీరు ఆయన పరిచర్య చేయుచుండగా, మీరు ఎక్కడికి వెళ్లిన ప్రభువు మీ పాదములను త్రొటిల్లకుండా మిమ్మును కాపాడతాడు. మీరు ఎంచుకున్న ప్రతి ఎంపికలో ప్రభువు మిమ్మును నడిపిస్తాడు. మీ మార్గములో ఆయన మిమ్మును ఎంతో సురక్షితముగా నడిపిస్తాడు.
నా ప్రియులారా, ఈ వచనమును ప్రతిబింబింపజేయుటకు ఒక అద్భుతమైన సాక్ష్యము ఇక్కడ కలదు. తిరుచ్చి పట్టణము నుండి జవహర్ ప్రభాకర్ అను ఒక సహోదరుని యొక్క సాక్ష్యమును మనము చూడగలము. అతడు తన సాక్ష్యమును ఇలాగున పంచుకున్నారు. అతని భార్య పేరు క్యార్లిన్, అతనికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉండెను. అతడు ఒక ప్రవేటు కళాశాలలో పనిచేయుచుండెను. మరియు తిరుచ్చిలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో స్వచ్ఛంద సేవకునిగా పనిచేయుచుండెను. 2023వ సంవత్సరము మే నెలలో కోయంబత్తూరు నుండి తిరుచ్చికి ఆయన కారులో ప్రయాణము చేయుచుండగా, ఒక ప్రమాదమునకు గురియైయ్యాడు. ఒక కూడలి వద్ద వెనుక నుండి ఒక లారీ వచ్చి, అతని కారును గుద్దించి, మరియు ఆ డివైడర్‌కు వెళ్లి కొట్టుకోవడం జరిగినది. కొంతసేపు ఆ డివైడర్‌కు కొట్టుకొని ఆలాగున వెళ్లిపోయినది. ఇతని కారు పూర్తిగా నలిగిపోయినది. ఈ ప్రమాదము జరిగినప్పుడు, ఆయన తన కుటుంబము ఖచ్చితంగా చనిపోతారు అని అతను భావించుచుండెను. మరియు వారందరు భయముతో నిండిపోయారు. అయితే, ఆశ్చర్యకరముగా ప్రజలు ఈ ప్రమాదమును చూసి, ఆ కారు చుట్టు చేరుకున్నారు. ఒక్కొక్కరిని ఆ కారు నుండి బయటకు లాగారు. ఎవ్వరికి ఏ హాని జరుగలేదు. నలుగురు కూడా క్షేమముగా ఉన్నారు. ఈ సంఘటన జరుగక ముందే, యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురములో ప్రార్థన యోధునిగా స్వచ్ఛందగా పనిచేయుచూ, నేను యేసు పిలుచుచున్నాడు రాయబారిగా చేరాను అని చెప్పాడు. ప్రజలకు ప్రార్థన చేయడాని కొరకు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ, ప్రభువు పరిచర్య కొరకు నేను నా సమయమును ఇచ్చియున్నాను కాబట్టి, ప్రభువు నన్ను మరియు నా కుటుంబమును ప్రమాదములో కాపాడాడు అని చెప్పారు. ప్రభువు నా కుటుంబాన్ని కాపాడడము మాత్రమే కాదు కానీ, నూతనమైన ఒక కారును కూడా ప్రభువు నాకు ఇచ్చాడు. యేసు పిలుచుచున్నాడు కుటుంబానికి మరియు ప్రార్థన గోపురమునకు నేనెంతో ధన్యుడను అని తన సాక్ష్యమును తెలియజేసును. దేవునికే సమస్త మహిమ కలుగును గాక.
నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, మీరు మీ సమయమును ప్రభువు పరిచర్యకు ఇచ్చినట్లయితే, దేవుడు మిమ్మును భద్రముగా కాపాడుతాడు. అవును, యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో మీరు వచ్చి పరిచర్య చేయునట్లుగా, ఇక్కడ మీ కొరకు ఎన్నో అవకావములు ఉన్నాయి. మీరు ప్రార్థన గోపురమునకు వచ్చి, ప్రజల కొరకు ప్రార్థన చేయవచ్చును. టెలిఫోన్ ప్రార్థన గోపురము ద్వారా కూడా ప్రజలకు ప్రార్థించవచ్చును. ప్రార్థన గోపురములో నుండి కూడా కాదు, మీ యింటి నుండి కూడా మీరు ఆలాగున ప్రజల కొరకు ప్రార్థించవచ్చును. మీరు ఇక్కడకు వచ్చి స్వచ్ఛందముగా పని చేయుటకు ఎన్నో అవకాశములు కలవు. ప్రభువు పరిచర్య చేయుట కొరకు, నా ప్రియ స్నేహితులారా, ప్రభువుకు మీ సమయమును ఇవ్వండి, ఆయన మిమ్మును మరియు మీ కుటుంబాన్ని కాపాడతాడు. తన సేవకుల పాదములను ఆయన కాపాడుతాడు. మీరు ఆలాగున భద్రముగా కాపాడబడతారు. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మనకు ఇచ్చుచున్న ఈ అద్భుతమైన కాపుదల కొరకు ప్రభువుకు వందనాలు చెల్లించుదామా? ఆలాగున మీరు చేసినట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును కాపాడి సంరక్షించి, దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, ఈ నూతన దినానికి మరియు నీ నమ్మకమైన సేవకుల పాదాలను నీవు కాపాడతావని నీ ప్రేమపూర్వక వాగ్దానానికి కృతజ్ఞతలు. దేవా, మేము ఎల్లప్పుడూ శ్రద్ధగల సంరక్షకునిగా మా పక్షమున ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నీతిమంతులముగాను మరియు నీయందు భయభక్తులు కలిగి జీవించుటకు మాకు సహాయము చేయుము. దేవా, మేము నీకు సేవచేయుట ద్వారా మా పాదములను భద్రముగా కాపాడుము. ప్రభువా, మేము నీ పరిచర్య చేయుచున్నందున మాకు ఏ హాని కలుగకుండా, మమ్మును మరియు మా కుటుంబమును భద్రముగా కాపాడుము. దేవా, నీ పరిచర్య చేయుటకు ప్రయాణము చేయుచున్న మమ్మును భద్రముగా మా గమ్యమునకు చేర్చుము. ఇంకను మా ఉద్యోగస్థలమునకు, పాఠశాలకు, కళాశాలకు ఎక్కడకు వెళ్లుచున్నను, నీవు మమ్మును కాపాడుము, మా సమయమును మా జీవితమును నీ పరిచర్య కొరకు ఇచ్చుచుండగా, మాకు ఎటువంటి హాని కలుగుకుండా, మమ్మును భద్రంగా కాపాడుము. దేవా, మేము నీకు విధేయతతో మరియు సేవలో నడుస్తున్నప్పుడు మేము నీ సంరక్షణను విశ్వసించుచున్నాము. ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళినా, మమ్మును నడిపించుము; మా అడుగులు నడిపించుము, మా నిర్ణయాలను నిర్దేశించు మరియు మా మార్గాన్ని నీ సన్నిధితో నింపుము. దేవా, మా సమయాన్ని మరియు హృదయాన్ని నీకు ఇవ్వడానికి మరియు నీకు సంతోషంగా పరిచర్య చేయడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా కుటుంబాన్ని మరియు మమ్మును నీ దైవిక సంరక్షణతో ఆవరించుము మరియు మాకు ఏ హాని మా దగ్గరకు రాకుండా కృపను దయచేయుము. దేవా, మా జీవితాన్ని నీ ప్రేమపూర్వక హస్తాలకు సమర్పించుకొనుచున్నాము, నీవే మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.