నా ప్రియమైన స్నేహితులారా, నేడు నూతన మాసములో అడుగిడిన మిమ్మును దేవుడు బలపరచాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేడు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలుగజేయుచున్నది. బైబిల్ నుండి ఈ రోజు మనం హబక్కూకు 3:19లో ఉన్న వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. ఆ వచనములో చెప్పబడియున్నది, "ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును'' అన్న వచనము ప్రకారము దేవుడు లేడి కాళ్లను ఎలాగున బలపరుస్తాడో, అలాగే నేడు మీ కాళ్లను మరియు మీ పాదాలను కూడా బలపరుస్తాడు.

నా ప్రియమైన వారలారా, బలమైన సింహం, వేగవంతమైన చిరుత, శక్తివంతమైన కాళ్లు ఉన్న ఏనుగు లేదా పొడవాటి కాళ్లు ఉన్న జిరాఫీతో ఎందుకు పోల్చలేదని మీరు ఆశ్చర్యపోవచ్చును. నా ప్రియ స్నేహితులారా, మీరు లేడి కాళ్ళను చూసినప్పుడు, అవి సన్నగా కనిపించవచ్చును మరియు అవి దాని శరీర బరువును ఎలా భరిస్తాయని మీరు ప్రశ్నించవచ్చును. అయినప్పటికిని, ఆ కాళ్ళు చాలా బలంగా ఉంటాయి, లేడికి సహాయపడగలవు మరియు ఇరుకైన మార్గాల ద్వారా కొండలు మరియు పర్వతాల మీదుగా నడవడానికి మరియు ఎక్కడానికి, ఉన్నత స్థలములకు చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి.

అదేవిధంగా, నా ప్రియమైన వారలారా, దేవుడు మన పాదాలను మరియు కాళ్ళను లేడికాళ్ల వలె బలంగా ఉండేలా బలపరుస్తాడు. అందుకే కీర్తనాకారుడైన దావీదు కీర్తనలు 18:33లో కూడా ఇలాగున చెప్పాడు, "ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు'' అన్న వచనము ప్రకారము జీవితంలో మీరు ఎదుర్కొనే ఇరుకైన మార్గాలు లేదా వంకర మార్గాలు ఉన్నను సరే, ఇబ్బందులు మరియు అడ్డంకులు మీకు ఎదురు వచ్చినప్పుడు కూడ, మీరు వాటిని అధిగమించగలుగుతారు. ఎందుకంటే, దేవుడు మీ కాళ్లను లేడి కాళ్లవలె బలపరుస్తాడు మరియు సరైన సాధనాలతో మిమ్మును ఆయత్తపరుస్తాడు. ఖిజీఝజీజ్చూటజూడ, ఎౌఛీ ట్టట్ఛnజ్టజ్ఛిnట ౌఠట జ్ఛ్ఛ్ట ్చnఛీ 

కాబట్టి, నా స్నేహితులారా, సంతోషంగా ఉండండి. ఈ రోజు, మీరు మీ జీవితంలో ఇరుకైన మార్గాలను ఎదుర్కొంటూ ఉండవచ్చును, కానీ నేటి వాగ్దానం ప్రకారం, దేవుడు మీ కాళ్లను లేడి కాళ్లవలె చేయుచున్నాడు, మీ భుజాల మీద బరువును మోయడానికి మరియు ప్రతి ఇరుకైన మార్గాలలో చక్కగా నడిపించడానికి మిమ్మును అనుమతిస్తుంది. మీరు సులభంగా అధిరోహించి ఉన్నత స్థలములకు చేరుకుంటారు. దేవుడు మీ కాళ్లను లేడి కాళ్లవలె చేస్తాడు, తద్వారా మీరు ఉన్నత స్థలములలో నడవగలరు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.


ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నీ వాగ్దానాలకు మరియు నీ అపురూపమైన శక్తికి మరియు ప్రేమకు కృతజ్ఞతతో నిండిన హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నీవు మా కాళ్లను లేడి కాళ్లవలె చేసి, మమ్మును ఉన్నత స్థలములకు ఎదుగుటకు వీలు కలుగజేయుచున్నందుకై నీకు వందనాలు. దేవా, లేడి కాళ్లు ఇరుకైన మార్గాల ద్వారా మరియు ఎత్తైన పర్వతాల పైకి తీసుకువెళ్లేంత బలంగా ఉన్నట్లుగానే, మా జీవితంలోని సవాళ్లు మరియు అడ్డంకులను తొలగించి, మేము కూడ ఇరుకు మార్గములలో చక్కగా నడవడానికి నీవు మమ్మును సన్నద్ధం చేయగలవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా మార్గంలో వచ్చే భారాలను మోయడానికి మాకు శక్తిని ఇచ్చినందుకై మరియు కష్టమైన మార్గాలలో మమ్మును నడిపించుము. తండ్రీ, మేము కష్ట సమయాలను ఎదుర్కొన్నప్పు డు ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితం యొక్క ఇరుకైన మార్గాల ద్వారా మేము ఉపాయంతో నడుచుకోవడానికి అవసరమైన సాధనాలు మరియు శక్తితో మమ్మును బలవంతులనుగా మార్చుము. దేవా, నీవు మాతో ఉన్నావని గుర్తెరుగుట ద్వారా మేము ఎల్లప్పుడూ ఓదార్పును పొందుకొనునట్లుగాను, మా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మరియు నీ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి మాకు అటువంటి గొప్ప కృపను అనుగ్రహించుము. ప్రభువా, ఈ రోజు ఈ వాగ్దానాన్ని స్వీకరించి మరియు దానిని మా జీవితంలో ప్రకటించునట్లుగా చేయుము. దేవా, బలహీనమైన మా కాళ్లను ముట్టి స్వస్థపరచి, లేడి కాళ్లవలె చేసి, తద్వారా ఉన్నత స్థలములకు ఎక్కునట్లుగా మమ్మును నడవచేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.