నా ప్రియులారా, బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 2:13 వ వచనం ప్రకారం ప్రభువు నేడు మనలను నడిపిస్తానని వాగ్దానం చేయుచున్నాడు. ఈ వచన ము, "ఎందుకనగా, మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుట కును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే'' అని చెప్పబడిన ప్రకారం ఈ లోకంలో ఎన్నోసార్లు, మనం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు, మనకు ఆనందాన్ని కలిగించే విషయాలనే మాత్రమే మనం ఆలోచిస్తాము. మనమే మనలను ఈలాగున ప్రశ్నించుకుంటాము-దీని వలన నేను సంతోషంగా, ఆనందంగా ఉండగలనా? నేను గొప్ప స్థాయికి చేరి, ప్రజల నుండి గొప్ప పేరును పొందగలనా? ఇలాంటి పనిని చేయడం వలన నాకు లాభముంటుందా? అని మన కనుదృష్టి ఎల్లప్పుడు మన సొంత ఆనందాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇంకను అనేకసార్లు, మన స్వంత ఇచ్ఛలను బట్టి కార్యసిద్ధి కలుగజేయాలని కోరుకుంటాము. కానీ, మన హృదయాలను మార్చుకోమని ప్రభువు మనలను తన యొద్దకు ఆహ్వానించుచున్నాడు.
నా ప్రియులారా, అయితే, మీరు చేయు ప్రతి పనిలో దేవునికి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో ఆలోచించడం మరియు మీరు ఆయన చిత్త ప్రకారము చేయుటకు ప్రారంభించినప్పుడు, మీరు ప్రభువు ఉపదేశముల ప్రకారం జీవించడం మొదలుపెడతారు. మనము ఆలాగున జీవించడము ప్రారంభించినప్పుడు, ఇది మన ప్రభువైన యేసుకు ప్రీతికరమైనదిగా ఉంటుందా? అని మొట్టమొదట మనము గ్రహించాలి. ఈ కార్యక్రమాన్ని జరిగించుట ద్వారా నేను మంచి మార్గాన్ని ఎన్నుకున్నానని దేవుడు నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడా? నా జీవితం పట్ల ఇది దేవుని యొక్క చిత్తమేనా? అని గుర్తించాలి. ప్రియులారా, మీకు ఇలాంటి మనోభావాలు ఉన్నప్పుడు, అది నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగియుండుటయు, మన నిమిత్తము దేవుని యెదుట మనము కార్యసిద్ధి కలుగజేయుటయే అని గ్రహించాలి. మరియు మీ సంతోషాన్ని కంటే ఆయన ఆనందానికి ప్రాముఖ్యతనిచ్చే జీవితంగా ఉండాలి. ప్రత్యేకంగా నా ప్రియమైన Äౌవనస్థులారా, మీరు మీ జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా మీరు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకుంటున్నప్పుడు, మీరు ప్రభువు చిత్తానుసారముగా నడుచుకుంటూ మరియు ఆయన దయాసంకల్పమును నేరవేర్చినప్పుడు, ఆయన మీ పట్ల ఆనందిస్తాడు. అదే మీకు కావలసిందల్లా, అప్పుడు ప్రభువు తానే మీ పట్ల బాధ్యతను స్వీకరించి మిమ్మల్ని ఆశీర్వదించుటలో ఆనందిస్తాడు.
బైబిల్ దినములలో ప్రారంభ కాలములో కయాను మరియు హేబెలు అనే ఇద్దరు సోదరులు తమ అర్పణలను ప్రభువు సన్నిధికి తీసుకు వచ్చినట్లుగా ఒక ఉదాహరణను మనం చూడగలము. కొంతకాలమైన తరువాత కయాను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కానీ, హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను; అది ఒక గొప్ప త్యాగంగా మార్చబడినది. అయితే, కయానును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు అని బైబిల్ చెబుతుంది. నా ప్రియులారా, మీరు నిజంగా దేవుని ఆనందము కొరకు కార్యసిద్ధికలుగజేసినప్పుడు, హేబెలు అర్పణలు అంగీకరించినట్లుగానే, ఆయన దానిని అంగీకరించి, మిమ్మును ఆశీర్వదిస్తాడు. నేడు, మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయుటకు ఆయన మీకు అలాంటి హృదయాన్ని అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి! నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ ఇష్టానికి అనుగుణంగా మాలో కార్యసిద్ధికలుగజేయడానికి మరియు నీ యొక్క దయాసంకల్పమును నెరవేర్చడానికి మాలో కార్యసిద్ధి కలుగజేయుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. ప్రభువా, మేము ఎల్లప్పుడు మా ఇచ్చలను, మా స్వంత ఆదరణను మరియు మా స్వంత గుర్తింపును వెంబడించకుండునట్లుగాను, మేము వాటన్నింటిని నేడు నీకు అప్పగించుకొనుటకును మరియు నిన్ను వెంబడించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మాకు ఇష్టమైన దానికంటే, నీ యొక్క చిత్తాన్ని వెదకడానికి మరియు నీ దయాసంకల్పమును నెరవేర్చుటకును మాకు నేర్పించుము. దేవా, ప్రేమ, త్యాగం మరియు భయభక్తులలో తనకు కలిగిన దానిలో శ్రేష్టమైనదానిని నీకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్న హేబెలు హృదయాన్ని మాకు దయచేయుము. ప్రభువా, మా నుండి ప్రతి స్వార్థపూరితమైన ఆశయాన్ని తొలగించి, దానిని నీ చిత్తాన్ని ఘనపరచాలనే కోరికతో మమ్మును నింపుము. యేసయ్యా, మేము కార్యసిద్ధికలుగజేయుటకు చేయవలసిన ప్రతి ఎంపిక నీకు మహిమను తీసుకొని వచ్చునట్లుగాను మరియు మా జీవితానికి నీ ఉద్దేశ్యానికి మమ్మును సమీపంగా తీసుకువచ్చునట్లుగా చేయుము. దేవా, మా జీవితం, మా పనులు మరియు మా హృదయం ఎల్లప్పుడూ నీకు ఆనందాన్ని తీసుకొని వచ్చునట్లుగా కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.