నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానము బైబిల్ నుండి హోషేయ 11:4వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి అకర్షించితిని; ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని'' ప్రకారం నేడు మనతో స్నేహము కలిగి ఉండాలని మన పట్ల కోరుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి 1 యోహాను 4:8 వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, 'దేవుడు ప్రేమాస్వరూపి.' అవును, దేవుడు నిత్యము ప్రేమా స్వరూపియై యున్నాడు. కనుకనే ఆయనలో ప్రేమ, ప్రేమ, ప్రేమ తప్ప వేరే వైవిధ్యం లేదు. కాబట్టి, మొదట, ఆయన మిమ్మును తన యొక్క గొప్ప ప్రేమతో బంధించియున్నాడు. అందుకే మీరు బైబిల్ నుండి ఎఫెసీయులకు 5:23-30 వ వచనములను చదివినట్లయితే, ఎఫెసీయులకు 5:30వ వచనంలో ప్రభువు మీ ఎముకలను తన ఎముకలతోను, తన మాంసాన్ని మీ మాంసంతోను, యేసు శరీరాన్ని మీ శరీరంతోను బంధించడం ద్వారా మిమ్మల్ని తన స్నేహబంధములతో బంధించాడని చెప్పబడియున్నది. ఎందుకంటే, మనం ఆయన శరీరములోని అవయవములై ఉన్నాము. అందుకే పై వచనము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది, " మనము క్రీస్తు శరీరమునకు అవయవముల మై యున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు'' ప్రకారం ఆయన మిమ్మును తనతో ఐక్యపరచుకుంటున్నాడు. తద్వారా, లోకములో ఉన్న ఎటువంటి అవినీతి కూడా మిమ్మల్ని తాకకూడదని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. దీనిద్వారా, యేసు మిమ్మల్ని ఎంతగా ప్రేమించుచున్నాడో తెలుసుకోవడం ఎంత గొప్ప ఆనందం కదా. కనుకనే, నా ప్రియులారా, మా పట్ల ఎవ్వరు కూడా ప్రేమ చూపుట లేదని మీరు ఎల్లప్పుడు నిరుత్సాహపడకూడదు. కానీ, ఆయన ప్రేమకు, ఆయనను మీతో ఐక్యం చేసుకున్నందుకు, ఆయనతో మిమ్మల్ని ఐక్యం చేసుకున్నందుకు ఎల్లప్పుడూ ఆయన చూపించిన ప్రేమ నిమిత్తము మీరు ఆయనను స్తుతించండి. ఎటువంటి అవినీతికి లేదా మోసానికి ఎప్పుడూ మీరు చోటు ఇవ్వకండి, కానీ ఈ కృప కోసం దేవుని అడగండి.

రెండవదిగా, బైబిల్‌లో ప్రసంగి 4:12వ వచనములో మనము చూచినట్లయితే, "మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?'' అని చెప్పబడియున్నది. ఆ మూడు పేటల త్రాడు అనగా, భర్త, భార్య, మరియు మూడవది యేసుతో కలిసి ఉంటుంది. కనుకనే, ఆయన కుటుంబాన్ని ఐక్యపరచుచున్నాడు. ఆయన భార్యాభర్తలను తనతో, ప్రేమగల త్రాడుతో ఐక్యపరుస్తాడు. భార్యాభర్తలు తమంతట తాము శాశ్వత ప్రేమను కలిగి ఉండలేరు, కానీ అందుకే నిజమైన ప్రేమ అయిన యేసుగా, దేవుడే మన యొద్దకు దిగివస్తాడు. ఆయన భార్యాభర్తలను తన ప్రేమతో ఏకముగా చేస్తాడు మరియు కుటుంబాన్ని తనతో ఐక్యపరుస్తాడు. దేవుడు మీకు ఒక కుటుంబంగా ఆ కృపను నేడు అనుగ్రహించును గాక. మీ భార్యాభర్తల సంబంధంలో యేసు ప్రేమను గుర్తించండి. నా ప్రియ స్నేహితులారా, ఈ కృప నేడు మీ మీదికి దిగి రావాలని ప్రతిరోజు మీ చేతులు పట్టుకుని యేసుతో కలిసి ప్రార్థించండి. మీరు ఎల్లప్పుడూ యేసుతో ఒక కుటుంబంగా ఐక్యంగా ఉంటారు మరియు మీ కుటుంబ జీవితంలోకి ఎటువంటి అవినీతి మీ యొద్దకు రాదు.

మూడవదిగా, బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 133:1వ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, " సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! '' ఎందుకంటే, అక్కడ ప్రభువు ఆశీర్వాదాన్ని, నిత్య జీవమును కూడా ఆజ్ఞాపించాడు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్మును ఇతర దేవుని సేవకులతో మరియు ప్రార్థించేవారితో ఐక్యపరుస్తాడు. దేవుడు మీ హృదయాన్ని ప్రార్థనలో ఏకం చేసినప్పుడు, ఆయన మీపై మరియు మీరు ప్రార్థించే ప్రతిదాని మీద ఆశీర్వాదం ఆజ్ఞాపిస్తాడు. అందుకే, మేము మిమ్మల్ని ప్రార్థనా గోపురమునకు వచ్చి, ఎస్తేరు ప్రార్థన బృందంలో భాగం కావాలని మరియు ఇతరులతో కలిసి ప్రార్థించమని ఆహ్వానించుచున్నాము. ఇతర దేవుని సేవకులతో కలిసి దేశం కోసం 15 రోజులు ప్రార్థించడానికి ఢిల్లీలోని జాతీయ ప్రార్థన గోపురానికి రండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సేవకులతో పాటు ప్రపంచ దేశాల కోసం ప్రార్థించడానికి ఇశ్రాయేలు ప్రార్థన గోపురానికి రండి. లేదా మీ ఇంటి నుండి కూడా, మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌కు కనెక్ట్ చేయబడిన యేసు పిలుచుచున్నాడు కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఇతరుల కోసం ప్రార్థించవచ్చును. మీరు ప్రార్థన యోధులతో కనెక్ట్ అయి ఇతరుల కోసం, దేశం కోసం మరియు ప్రపంచం కోసం ప్రార్థించినప్పుడు, దేవుడు మీ కోసం ఒక ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తాడు. కనుకనే, నేడు మీరు దేవునితో ఐక్యమవ్వండి, ఆయన మిమ్మును స్నేహబంధములతో బంధిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క శాశ్వతమైన స్నేహ బంధములతో మమ్మును బంధించినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మమ్మును యేసుతో, ఎముకను ఆయన ఎముకకు, మాంసాన్ని ఆయన మాంసానికి, ఆత్మను ఆయన ఆత్మకు ఏకం చేసినందుకు నీకు ధన్యవాదాలు. ప్రభువా, ఈ లోకపు ఏ అవినీతి మమ్మును లేదా మా కుటుంబాన్ని తాకనివ్వకుండా మమ్మును నీ కాపుదల క్రింద భద్రపరచుకొనుము. దేవా, మా కుటుంబ జీవితంలో కేంద్రంగా ఉన్న మా ప్రభువా, మా ఇంటిని విడదీయలేని లేక త్వరగా తెగిపోలేని మూడు పేటలు గల ప్రేమ త్రాడుతో మమ్మును బంధించి, ఆశీర్వదించుము. యేసయ్యా, నీ శరీరంతో ఐక్యమగుట కొరకు మరియు ప్రార్థనలో ఇతర విశ్వాసులతో చేరడానికి కృప కొరకు మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, మేము ఇతరుల కోసం మరియు మన దేశం కోసం మేము విజ్ఞాపనము చేయడానికి చేతులు కలిపినప్పుడు, నీ ఆశీర్వాదాలు మాలో ప్రవహించునట్లుగాను మరియు నీ సన్నిధి మా జీవితాన్ని నింపునట్లుగా సహాయము చేయుము. దేవా, మమ్మును నీలో ఏకముగా చేసుకొని, మేము చేయు ప్రతిదానిపై నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు శాశ్వతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.