నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 14:6వ వచనమును మనము ధ్యాన నిమిత్తము తీసుకొనబడినది. ఆ వచనము, "యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు'' అని యేసు సెలవిచ్చిన ప్రకారము ఆయన మనకు మార్గమై యున్నాడు. ఒకవేళ మనము, నాకు ఇంక ఏ మార్గము లేదు అని అనుకున్నప్పుడు, అటువంటి మిమ్మును చూచి, యేసు, 'నేనే మార్గమును' అని సెలవిచ్చుచున్నాడు. ఒకరోజు ఒక పెద్ద బృందం నూతనమైన అన్వేషణ యాత్ర కొరకై, ఆలాగున అడవిలో వెళ్లుచుండగా, జిపియస్ అనేది ఈ ప్రపంచములోనికి రాకమునుపు జరిగిన సంఘటన ఇది. ఆ యొక్క భూభాగమునకు సంబంధించిన అనుభవ జ్ఞానము కలిగియున్న ఒక చిన్న బాబును వారు కనుగొనడము జరిగియున్నది. గ్రామస్థులు ఏమని చెప్పారంటే, ఈ బాబును తీసుకొని వెళ్లండి, ఈ బాబు మీకు దారిని చూపిస్తాడు. కనుకనే, ఆ బాబు ఆ యొక్క భూభాగములో నుండి వారందరిని తీసుకొని వెళ్లుచుండెను, లోయలలో నుంచి, పర్వతములలో నుంచి, అరణ్యములో నుండియు, ఎక్కడ మార్గము లేదో, అట్టి ప్రాంతాలలో నుండి కూడా వారిని తీసుకొని వెళ్లుచుండెను. సుదూర ప్రాంతము ఆ యొక్క బృందము ప్రయాణించిన తర్వాత, ఆ యొక్క బృంద నాయకుడు ఏమని చెప్పాడంటే, ఓ చిన్న బాబు, నీకు నిజముగా ఆ యొక్క మార్గము తెలుసునా? మమ్మును మైళ్లు దూరము తీసుకొని వెళ్లుచున్నావు, మేము ఇంకను కూడా మా యొక్క గమ్యస్థానమును చేరుకొనలేదు, ఎక్కడ ఉన్నది ఆ యొక్క మార్గము? అని అడిగాడు. అప్పుడు ఆ బాబు ఏమని చెప్పాడంటే, 'నా వైపు చూడండి, నేనే మార్గము, నేనే మీ కొరకు మార్గమై ఉన్నాను, కనుకనే, నన్ను వెంబడించండి' అని చెప్పాడు.
నా ప్రియులారా, కానీ మనకైతే, దేవుడే స్వయంగా మనకు మార్గముగా ఉన్నాడు! ఆయనే స్వయంగా మార్గమై యున్నాడు. ఆయన మేకులచేత కొట్టబడి, మన కోసము బలి అర్పణగా చేయబడు నిమిత్తమే తను తాను సిలువలో బలిగా సమర్పించుకొనియున్నాడు. మనము దేవుని చేరుకోవడానికి మార్గమును తెరవజేయు నిమిత్తమే ఆయన త్యాగము చేశాడు. ఈ రోజు మనము యేసు నామమున ప్రార్థన చేయుచుండగా, మన ప్రార్థనలు యేసును చేరుకుంటున్నాయి. జవాబులు పరలోకము నుండి వస్తున్నాయి. భయపడకండి, యేసు నామమున దేనినైనను అడగండి. ఆయన " మీరు అడగండి, నేను దానిని జరిగిస్తాను, మీరు నన్ను అడగలేదు, అడగండి, తద్వారా మీరు పొందుకుంటారు. ఆలాగుననే, మీ సంతోషము పరిపూర్ణమవుతుంది. మీ సంతోషము పరిపూర్ణమవుతుంది'' అని సెలవిచ్చుచున్నాడు. దేవుడు మీకు సంతోషమును సంపూర్ణముగా ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. ఆయన ఈలాగున సెలవిచ్చుచున్నాడు, 'నేనే మార్గమును, ఇక వేరే మార్గము లేదు,' మనము యేసును మనతో కలిగియున్నాము, ఆయనను అంటిపెట్టుకొని ఉండండి, ఆయనను స్తుతించండి, ఆయన చేసిన త్యాగమును బట్టి, ఆయనకు వందనాలు చెల్లించండి, పునరుత్థానుడైన ప్రభువుగా ఆయన మనతో ఉన్నందుకై ఆయనను ఘనపరచండి. నా ప్రియులారా, అప్పుడు మీరు జీవమును కలిగియుండెదరు. ఆయన, 'నేనే జీవమును ' అని సెలవిచ్చుచున్నాడు. మీరు యేసు ద్వారా జీవించెదరు.
ఇక్కడ అద్భుతమైన సాక్ష్యము ఉన్నది, సహోదరి ధనభాగ్యము మరియు సహోదరుడు రాజా రత్నము. వారు ఇద్దరు కుమారులను కలిగియుంటూ, నలుగురుగా ఉంటున్న ఒక కుటుంబము. వారు ఒక నూతన సంవత్సరము ఆరాధనకు వెళ్లియున్నప్పుడు, అతడు ఆ యొక్క ఆరాధనలో కలుసుకోలేదు. కానీ, దేవుడు ఆ యొక్క తండ్రిగారితో మాట్లాడియున్నాడు. అయితే, కుటుంబము నూతన సంవత్సరము ఆరాధన కొరకై వారు అక్కడకు వెళ్లియున్నారు. తండ్రి అక్కడకు వెళ్లలేదు. కానీ, ప్రభువు ఆ తండ్రిగారితో మాట్లాడియున్నాడు, ' నీవు నా కోసం ఏమి చేశావు? యేసు అను నేను నీ కొరకు సమస్తమును చేసియున్నాను' అని చెప్పాడు. అప్పుడు ఆ యొక్క భర్తగారు, దేవుడు తనతో మాట్లాడుచున్నాడు, అను సంగతిని తెలుసుకున్నాడు, వెంటనే తన ఉద్యోగమునకు పదవి విరమణ చేశాడు. దేవుని సేవించడము ప్రారంభించాడు. వారికి ఎన్నో ఆర్థిక సమస్యలు ఉండెను, ఆర్థికపరమైన కష్టములను బట్టి, ఆదాయము కొదువుగా ఉన్నందున బట్టి, భర్తగారి యొక్క తల్లిదండ్రులు వారి యింటిలో నుండి వారిని బయటకు గెంటివేశారు. అటువంటి సమయములో వారు బేతెస్దకు వచ్చారు. ఆ యొక్క కూటములలో, నేను వారిని పేరు పెట్టి పిలిచాను. ఆమె భర్త యొక్క పేరును పెట్టి పిలిచియున్నాను. ఆ పేరు "రత్నం, రత్నం'' అను పేరు ఉన్న ఈ యొక్క దేవుని సేవకుడు ఎవరు అని పిలిచాను. 'మీరు దేవుని యొక్క సేవకుడు అని మీరు తెలుసుకోవాలి, మిమ్మును పేరు పెట్టి పిలుచుచున్నది దేవుడే అని నీవు గుర్తించాలని అని చెప్పాను. నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచియున్నావు, కనుకనే, దేవుడు నీ సాహస కృత్యములన్నిటిని వర్థిల్లింపజేయునున్నాడు' అని చెప్పాను. అప్పుడు గొప్ప శాంతి ఆ కుటుంబమును నింపియున్నది. ఈ రోజు అతను మరియు అతని యొక్క సతీమణి, నాలుగు మందిరములను నిర్మాణము చేసియున్నారు. వారి బిడ్డలు యౌవన భాగస్థులుగా ఉన్నారు. వారు దేవునికి సేవ చేయుచున్నారు. అవును, నా ప్రియులారా, యేసు మార్గమై యున్నాడు. ఆయన మీకును కూడా మార్గమై యున్నాడు. కనుకనే, మిమ్మును నడిపించడానికి మార్గమై యున్న యేసుకు మీ జీవితాలను సమర్పించినట్లయితే, ఆయన తన మార్గములో మిమ్మును నడిపించి, మీకు సమృద్ధి జీవమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు మమ్మును ఆశీర్వదించుము, మాకును మరియు మా భవిష్యత్తునకు తగిన ప్రణాళిక కొరకైన మార్గమును మాకు తెరువజేయుము. ప్రభువా, ఆ మార్గములో మేము నడుచుటకు మాకు శాంతిని అనుగ్రహించుము. మాకు గొప్ప సాఫల్యతను దయచేయుము. దేవా, మేము నీ చిత్తమును జరిగించుటకు మా జీవితములో నీ ప్రణాళికలోనికి మేము వెళ్లకుండా, మమ్మును ఆటంకపరచే ప్రతి సాతాను శక్తులను బంధించి, మాకు నీ నామమున విడుదలను దయచేసి, నీ ప్రణాళికలోనికి మేము ప్రవేశించునట్లుగా నీ కృపను మాపై కుమ్మరించి, నీ మహిమ కొరకు మమ్మును వినియోగించుకొనుము. ప్రభువా, 'నేను మార్గము, సత్యము మరియు జీవము' అయిన యేసు నామములో నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మేము దారితప్పినట్లు మరియు మార్గము తెలియకుండా ఉన్నప్పుడు, మా ఏకైక ముందుకు వెళ్ళే మార్గం నువ్వే అని మాకు గుర్తు చేయుము. దేవా, మాలో ఉన్న సందేహాలు మా హృదయాన్ని కప్పివేసినప్పుడు, నీవే మా సత్యము. ప్రభువా, మా జీవితం భారంగా అనిపించినప్పుడు, నీవే మా జీవముగా ఉండి, మమ్మును నడిపించుము. యేసయ్యా, తండ్రిని చేరుకోవడానికి మాకు మార్గం తెరవజేయడానికి సిలువపై నిన్ను నీవు త్యాగం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీవే మా రక్షకుడవు, మా కాపరివి, మా రాజుగా ఉన్నావు, ఈ రోజు మేము నిన్ను హత్తుకొనుచున్నాము. దేవా, నీ నామంలో అడగడానికి ధైర్యంతో మరియు మా జీవితంలో నీ చేయి కదులుతున్నట్లు మేము చూసినప్పుడు పొంగిపొర్లుతున్న ఆనందంతో మమ్మును నింపుము. ప్రభువా, మా పునరుత్థాన ప్రభువుగా మేము నిన్ను ఘనపరచునట్లుగా చేయుటకు మేము నీతో నడుచునట్లుగాను, నీ ద్వారా జీవించునట్లుగాను మరియు నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందాన్ని పొందుకొనునట్లుగా నీ కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.