నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 1:16వ వచనమును తీసుకొనబడినది. ఇది మీ కొరకు ఇవ్వబడిన దేవుని వాగ్దానమై యున్నది. ఆ వచనము, "ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి'' అని చెప్పబడిన ప్రకారము ప్రభువైన యేసు, తండ్రియైన దేవుని యొక్క ఆశీర్వాదాలను సంపూర్ణమైన కొలతతో కలిగియున్నాడు. ఆయన సంపూర్ణంగా పరిశుద్ధతతో నింపబడియున్నాడు. సంపూర్ణంగా ఆయనకు దేవుని శక్తి కలదు. ఆయనకు పరిపూర్ణమైన భక్తిని కలిగియున్నాడు. ఆయన శరీరధారియైన దేవుడు. కనుకనే, అటువంటి యేసును మీరు అంగీకరించినప్పుడు ఇలాగున చెబుతారు: " ప్రభువా, మా పాపాన్ని మరియు అపవాదితో మా సంబంధాన్ని మేము విడిచిపెట్టుచున్నాము. ఇంకను ఈ లోకంలోని దుష్టులతో మా సంబంధాన్ని విడిచిపెడుతున్నాము. ప్రభువైన యేసయ్యా, పరిశుద్ధతకు మాదిరిగా ఉన్న నీతోనే మేము మా సంబంధాన్ని కలిగియుంటున్నాము'' అని స్పష్టముగా చెబుతారు. అంతమాత్రమే కాదు, మీరు కృప వెంబడి కృపను పొందుకుంటా రు. అది క్షమించగలిగిన కృప. ఇంకను యేసుని స్వరూపంగా మార్చబడడాని కొరకైన దేవుని కృప. యేసులో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొనుట కొరకు కృప. పరలోకంలో ప్రవేశించుటకు కృప. ఇలాగున మీరు కృప వెంబడి కృప పొందుకొని, మీరు దేవునిలో సంపూర్ణంగా జీవిస్తారు.

నా ప్రియులారా, కృప వెంబడి కృప అంటే మీరు ఏ పాపం చేసినా కృప వచ్చి మిమ్మల్ని క్షమిస్తుంది అని అర్థము కాదు. ఉద్దేశపూర్వకంగా పాపం చేసినవారిని దేవుడు ఎన్నటికిని సహించడు. అవును, మనం మన బలహీనతలో పాపం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ మన నిమిత్తము తండ్రి యొద్ద మధ్యవర్తిగా ఉండి, విజ్ఞాపనము చేస్తాడు. పరిశుద్ధాత్మ మనకు ఇలా చెబుతుంది, 'నీవు పాపం చేసావు' అని మనకు తెలియజేసినప్పుడు, మనం నిజంగా పశ్చాత్తాపపడి, ఆ పాపం ఇకపై చేయకుండా ఉండటానికి దేవుని కృప కొరకు అడిగినప్పుడు, మరియు మనము మన పాపాలను విడిచిపెట్టి క్షమాపణ అడిగినప్పుడు, దేవుని కృప మన యొద్దకు వస్తుంది. మనం ఏడుసార్లు పడిపోయినప్పటికి, మనం నిజంగా పశ్చాత్తాపపడి ఆయనను సంపూర్ణంగా నమ్మినప్పుడు దేవుని కృప మన మీదికి దిగివస్తుంది. మరియు దేవుని కృప మనలను రక్షిస్తుంది మరియు మనకు యేసు యొక్క సంపూర్ణతను కలిగిస్తుంది. మనం పాపం చేసి, పాపం లేకుండా జీవించడానికి యేసు స్వరూపంలోనికి రూపాంతరం చెందాలని అడగకుండా, 'ప్రభువా, నన్ను క్షమించు' అని చెప్పినట్లయితే, కృపకు ఎలాంటి అర్థం ఉండదు.

నా ప్రియులారా, కాబట్టి, మనం నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు, దేవుడు మనకు యేసును మోసుకెళ్లడానికి సంపూర్ణతను అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, మనము రూపాంతరం పొందుటకు కృపను కుమ్మరిస్తాడు. నేటి వాగ్దానముగా ఇవ్వబడిన ఈ వచనం యొక్క మరొక అనువాదం ఇలా చెబుతుంది, 'యేసు యొక్క సంపూర్ణత నుండి, మనం ఒకదాని వెంబడి ఒకటి ఆశీర్వాదాలను పొందుకుంటాము. ప్రతి ఆశీర్వాదం యేసులోనే ఉన్నది. కాబట్టి, నా ప్రియులారా, నేడు మీ హృదయాన్ని దేవుని వైపునకు తెరవండి. మీకు ప్రస్తుతం ఎటువంటి ఆశీర్వాదం అవసరమైనా, యేసు యొక్క పరిపూర్ణతను అంగీకరించండి. కానీ, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం కావాలని అడగకండి. అందుకు బదులుగా యేసును అడగండి, ' ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మ వరములతో నింపుము' అని అడగండి. ఆలాగుననే, మా తండ్రిగారు, ' ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మ వరములతో నింపుము' అని ప్రార్థించినప్పుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మా తండ్రిగారిని, 'దినకరన్, నీకు నేను కావాలా లేక పరిశుద్ధాత్మ వరములు కావాలా?' అని అడిగాడు అప్పుడు పరిశుద్ధాత్మ మా తండ్రిగారిని, 'ప్రభువా, నాకు నువ్వు కావాలి' అని చెప్పి, ప్రార్థించునట్లుగా చేసెను. ఆలాగుననే, ప్రభువు మా తండ్రిగారికి కావలసిన వాటన్నిటిని అనుగ్రహించి, ఆయనను ఆశీర్వదించాడు. ఆలాగుననే, నా ప్రియులారా, యేసు యొక్క సంపూర్ణత నుండి, మీరు కృప వెంబడి కృపను పొందుకుంటారు. ఇంకను ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ఇప్పుడే మీ మీదికి దిగి వస్తుంది. కనుకనే, నా స్నేహితులారా, నేడు కూడా మీరు దేవుని యొద్ద నుండి కృపను కోరుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము ద్వారా మీకు కృప వెంబడి కృపను అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. యేసయ్యా, నీవు, దేవుని యొక్క సంపూర్ణత, పరిశుద్ధత, శక్తి మరియు కృపతో నింపబడి ఉన్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, మేము కూడా నీవు నింపబడిన అదే కృపతోను, శక్తితోను, పరిశుద్ధతతోను నింపబడుటకు మాకు అటువంటి నీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించుము. ప్రభువా, ఈ రోజు, మేము మా పాపాలను, వ్యసనాలతోను, మా సంబంధాలను మరియు మమ్మును నీ నుండి ప్రత్యేకపరచు ప్రతిదానిని విడిచిపెట్టుకొనుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. దేవా, నీవు మాత్రమే పరిశుద్ధుడవు కనుకనే, మేము నీతో మాత్రమే సహవాసమును కలిగి ఉండాలని కోరుచున్నాము. యేసయ్యా, క్షమించబడటానికి మాత్రమే కాదు, నీ స్వరూపంలోనికి మార్చబడడానికి మమ్మును నీ కృపతో నింపుము. ప్రభువా, మాకు అవసరమైన ప్రతి ఆశీర్వాదం నీలో గుప్తములై ఉన్నవి. కనుకనే, మేము నిన్ను ఎక్కువగా వెదకాలనుకుంటున్నాము. కాబట్టి, నేడు నీ యొక్క ఆశీర్వాదాలను మాత్రమే కాదు, నీ కృపను మా మీద మెండుగా కుమ్మరించుము. ప్రభువా, మాకు అవసరమైన ప్రతి ఆశీర్వాదం నీలో గుప్తములై ఉన్నది కనుకనే,దయచేసి మాలో నివసించుము. ప్రభువా, మా జీవితం నీ సంపూర్ణతను మోయునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, ఇప్పుడు మరియు ఎల్లప్పుడు మా జీవితం మీద నీ యొక్క కృప వెంబడి కృపను కుమ్మరించి, మేము ముందుకు సాగి వెళ్లునట్లుగా మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు కృపగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.