నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 పేతురు 5:6వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి'' ప్రకారం దేవుడు మిమ్మును హెచ్చింపజేయాలని మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయకండి. ప్రియులారా, మీ జీవితంలో సంభవించుచున్న నష్టాలు, నిరుత్సాహ పరిస్థితుల వలన ఇంకెంత కాలము కృంగిపోతూ, కృంగిపోతు ఉండాలని అని మీరు ఆశ్చర్యపరచబడుచున్నారేమో? అయితే, దేవుడు అటువంటి మిమ్మును చూచి, "యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు'' అని చెప్పబడిన ప్రకారం ఎందుకనగా, దేవుని యొద్ద నుండి వచ్చు బలమును బట్టి, ప్రభువే మనకు ఆశ్రయముగాను మరియు మనకు బలముగాను ఉన్నాడు. అందుకే వాక్యము ఏమి చెబుతుందో చూడండి, "దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన తక్షణ సహాయకుడు'' అని చెప్పబడిన ప్రకారం దేవుని యొక్క బలిష్ఠమైన హస్తము మనకు సహాయపడుటకు సిద్ధముగా ఉన్నది. కనుకనే, భయపడకండి.

అవును, అనేక సంవత్సరముల క్రితం, మా తండ్రిగారు తన ఊపిరితిత్తుల వైఫల్యముతో కృంగిపోవుచున్న సమయములో, దానికి ముందుగానే, దేవుడు బలమైన స్వస్థతా పరిచర్యలో శక్తివంతముగా వాడుకుంటాను అని ఆయనకు వాగ్దానమిచ్చియున్నాడు. అయినప్పటికిని, ఆ తర్వాత దాడి వచ్చినది. ఆయన ఒక దర్శనమును చూశారు. ఆయన ఒక మరణ పడక మీద ఉన్నట్లుగాను మరియు చాలా ఇరుకైన మార్గములో, ఒక ఎంతో ఎత్తైన కొండ పర్వతము మీద నడుస్తున్నట్లుగా ఆయన కనబడ్డారు. ఆ యొక్క మార్గము ఆకస్మాత్తుగా ఆగిపోయినది. వెంటనే, ఆయన క్రిందికి చూచారు, అది చాలా లోతైన లోయ, ఆయనగాని, అందులో పడిపోయారంటే, ఆయన జీవితము ఇక అంతమైపోయినట్లుగానే ఉంటుంది. దానితో పాటు అంధకారపు ఆకృతులు ఆయనను పట్టుకోవడాని కొరకు ఎగురుతూ, గంతులు వేయుచు ఉండెను. అవి కేకలు వేయుచున్నవి, 'మా ప్రజలను ఇతను మా నుండి దూరముగా తీసుకొని వెళ్లుచున్నాడు, కనుకనే, ఇతని రక్తము మాకు కావాలి' అని చెప్పుచుండెను. అది చూచిన మా తండ్రిగారు భయకంపితులైయ్యారు. అయినప్పటికిని, ఒక హస్తము పరలోకము నుండి దిగివచ్చినది. అది మేకులతో కొట్టబడి గాయములను కలిగియున్న హస్తము ఈలాగున చెప్పుచుండెను, ' నా కుమారుడా, ఈ హస్తము మీదికి ఎక్కుము.'' అది ఆయనను లోయ దాటు వరకు మా తండ్రిగారిని మోసుకొని వెళ్లినది. అది చాలా లోతైన లోయ. అంధకార శక్తులు మరియు దురాత్మలు ఎంత ఎక్కువగా ఎగురుతూ ఉంటున్నప్పుడు, ఆ గాయపడిన హస్తము అంతకంతకు పైకి ఎగురుతూ మా తండ్రిగారిని కొనిపోవుచుండెను. ఆయనను అద్దరికి ఆ రీతిగా తీసుకొని వెళ్లియున్నది. ఆ హస్తము, "ముందుకు వెళ్లుము, వెనుకకు తిరిగి చూడకుము,'' అని చెప్పెను. వెంటనే ఆయన నిద్ర మేల్కొన్నారు. ప్రభువు ఆయనను స్వస్థపరచాడు. ఆయన ప్రార్థన ద్వారా లక్షలాది మంది స్వస్థపరచబడ్డారు. మిమ్మును మీరు తగ్గించుకొనండి, దేవుని బలిష్టమైన హస్తము క్రింద, ప్రతి విధమైన నొప్పి, బాధ, నష్టము, అపవాది దాడుల నుండి మరియు విచారము కంటె మిమ్మును పైకి లేవనెత్తుతాడు. ఎందుకనగా, ఆయన హస్తములు మేకులతో కొట్టబడి గాయములు పొందిన హస్తములు. అవి మీ జీవితమునకు స్వస్థతను తీసుకొని వస్తాయి. యేసు మిమ్మును ప్రేమించుచున్నాడు. కనునకే, నిశ్చయముగా ఆయన మిమ్మును పైకి లేవనెత్తుతాడు.

ఆలాగుననే, వసంత్ ఫిలిప్ప్ అను ఒక సహోదరుని యొక్క అద్భుతమైన సాక్ష్యము ఇక్కడ కలదు. 2022వ సంవత్సరములో ఫిలిప్పీయన్స్ దేశములో తన వైద్య విద్యను పూర్తి చేసి ముగించి, ఇండియకు వచ్చాడు. వైద్య అర్హత పరీక్షను వ్రాశారు. మరల, మరల వైఫల్యము చెందుతూనే ఉన్నాడు. చెన్నైలో యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు సమీపములో కోచ్చింగ్ తరగతులకు అతడు హజరగుచుండెను. ఒకరోజు ప్రార్థన గోపురమునకు వెళ్లి ప్రార్థించుకొనవచ్చునని అనుకున్నాడు. ఆ రోజున నేను అక్కడ ఉన్నాను. అతడు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు వచ్చాడు. ఆ రోజు 2025 జనవరిలో నేను అతని కొరకు ప్రార్థించాను. అతడు పరీక్ష వ్రాశాడు. ఫలితాలు వచ్చేశాయి. అతడు పరీక్ష ఉత్తర్ణీత పొందుకొనడము మాత్రమే కాదు, అతడు ఎదురు చూచినదానికంటే ఎంతగానో ఎక్కువగా మార్కులను పొందుకున్నాడు. ఈ రోజు పరిపూర్ణమైన అధికారపూర్వకమైన వైద్యునిగా అతడు పనిచేయుచున్నాడు. ఆలాగుననే, నా ప్రియులారా, నేడు దేవుడు మిమ్మును పైకి లేవనెత్తుతాడు. నేడు మీ ఎదుర్కొంటున్న వైఫల్యాలను తొలగించి, మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. తండ్రీ, మేము అనేకసార్లు పరీక్షలలో వైఫ్యలము చెందాము. ఈ ఫర్యాయము నీ యొక్క బలిష్టమైన హస్తముతో మమ్మును పైకి లేవనెత్తుము. మమ్మును గొప్ప ఎత్తునకు తీసుకొని వెళ్లి, మమ్మును వర్థిల్లింపజేయుము. దేవా, మేము పైకి లేవనెత్తబడుటకు నీ బలమైన హస్తము మా మీదికి దిగి వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మేము ఉన్నతమైన స్థానమునకు లేవనెత్తబడుటకు నీ నామమునకు మహిమ కలుగునట్లుగా మమ్మును బలపరచుము. దేవా, మా పరీక్షలన్నిటిలో మాకు సాఫల్యతను దయచేసి, ఇంకను శ్రేష్టమైన కోర్సులోనికి వెళ్లడానికి మాకు అటువంటి కృపను మరియు మాకు ఆర్థిక సహాయమును దయచేయుము. ప్రభువా, మేము విదేశాలకు వెళ్లడానికిని మరియు అక్కడ గొప్ప ఘనతతో సేవలు అందించుటకు మాకు సహాయము చేయుము. దేవా, ఈ రోజు నీ బలమైన చేతి క్రింద మమ్మును మేము తగ్గించుకుంటున్నాము. ప్రభువా, మా నిరాశ యొక్క లోతులను మరియు మా హృదయంలోని భారాన్ని నీవు చూస్తున్నావు. అయినప్పటికీ, నీవు తగిన సమయంలో మమ్మును పైకి లేపుతావని నీ వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాము. దేవా, చీకటి మమ్మును చుట్టుముట్టినప్పుడు కూడా, భయం, వైఫల్యం మరియు దుఃఖం అను మా యొక్క లోయల గుండా మమ్మును పైకి తీసుకెళ్లడానికి మేము నీ మేకులతో కొట్టబడిన హస్తములను విశ్వసించుచున్నాము. దేవా, పక్షిరాజు వలె మేము పైకి ఎగరడానికి, అలయకుండా పరిగెత్తడానికి, నడవడానికి మరియు సొమ్మసిల్లిపోకుండా ఉండటానికి మమ్మును నీ యొక్క శక్తితో బలపరచుము. దేవా, మాకు ఆశ్రయంగాను మరియు మాకు బలంగా ఉండుము. ప్రభువా, ఈ ఆపత్కాలములో మేము నమ్ముకొనదగిన సహాయకుడుగా మా పక్షమున ఉండి మాకు జయమును అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.