నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 10:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని...'' ప్రకారం దేవుని యొక్క ఈ వాగ్దానాన్ని మీరు గొప్ప నిరీక్షణతో పొందుకొందురు గాక. ఆ వచనము ఇలాగున చెప్పుచున్నది, "దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అవును, అదియే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హృదయము! ఆయన జీవమును, పునరుద్ధరణను, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఆ జీవం మీ కుటుంబ జీవితంలోనికి దిగివస్తుంది, మీరు కుటుంబములోను మరియు మీ యొక్క వ్యక్తిగత జీవితములో కోల్పోయిన సమస్తమును మరల పునరుద్ధరించబడుతుంది. ఇంకను యేసు అనుగ్రహించు సమృద్ధి జీవము మీరు అనారోగ్యంతో నిండి ఉన్నప్పటికిని, ఆ జీవం మీ శరీరంలోనికి దిగివస్తుంది. అది పరిపూర్ణముగా మీ జీవితములో నింపబడుతుంది. ఆ జీవము మీరు విజయాన్ని పొందలేని విద్యలో కూడా ఆ జీవం నింపబడి మీకు విజయమును అనుగ్రహిస్తుంది.
అనేక సంవత్సరాల క్రితం, నేను అహ్మదాబాద్‌లో జరిగిన ఒక యౌవనస్థుల సమావేశానికి వెళ్ళినప్పుడు, ఆ కూటములో ప్రజలు సందేశాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్నారు. అకస్మాత్తుగా, నలుగురు వ్యక్తులు దుప్పటి చుట్టిన ఒక వ్యక్తిని ఈ కూటమునకు తీసుకొని వచ్చారు. అతను డ్రిప్ యంత్రంకు జతచేయబడియున్నాడు, శరీరాన్ని కదిలించలేని స్థితిలో పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. ప్రార్థనా సమయంలో, ఆ స్థలంలో ఉన్న ప్రతిఒక్కరిని ఆయన శక్తిచేత నింపాలని వారి కొరకు ప్రార్థించునట్లుగా దేవుడు నన్ను నడిపించాడు. నేను అక్కడ ఉన్న వారందరి కొరకు ప్రార్థించాను. ప్రార్థన ముగించే సమయానికి, నేను యేసు యొక్క స్వస్థత నిచ్చు సన్నిధిని లోతుగా అనుభవించాను. నా స్నేహితులారా, ఆ వ్యక్తికి ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం లేకుండానే, డ్రిప్ అప్పటికి అతనికి జతచేయబడి ఉండగానే, అతను జీవముతో లేచాడు, తన పడక మీద నుండి లేచి, వేదికపైకి తానే స్వయంగా నడుచుకుంటూ వచ్చాడు. అతడు తన శక్తి కొలది, తాను ఆ రోజు యేసు తను తాకిన విధమును ప్రకటించుచూ తన సాక్ష్యాన్ని తెలియజేశాడు. అతను ఇలాగున తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు, 'నేను ఇక మంచానికి పరిమితుడిని కాదు. నేను నూతన జీవము పొందుకున్నాను' అని చెప్పాడు.
నా ప్రియ స్నేహితులారా, అపవాది మీ నుండి దొంగిలించి, మీ ఆరోగ్యాన్ని మరియు మీ ఆర్థికమును హరించవచ్చును. కానీ ప్రస్తుతం, దేవుడు మీకు సమృద్ధి జీవమును ఇవ్వడానికి మీ మధ్యన ఉన్నాడు. కనుకనే, ఆయనకు మీ జీవితాలను సంపూర్ణంగా సమర్పించినట్లయితే, నిశ్చయముగా, అపవాది చేత మీ యొద్ద దొంగలించబడిన సమస్తమును దేవుడు సమస్తమును మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్య, మాకు సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చినందుకు నీకు వందనాలు. ప్రభువా, అపవాదియైన శత్రువు మా ఆరోగ్యం, ఆనందం, సమాధానము లేదా ఉద్దేశమును దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు, నేటి వాగ్దానాన్ని మేము హత్తుకొనునట్లుగా మాకు కృపను దయచేయుము. యేసయ్య, నీవు అనుగ్రహించు నూతన జీవమును ద్వారా మా జీవితాలు పునరుద్ధరించబడునట్లుగాను, స్వస్థపరచబడునట్లుగాను సమృద్ధి జీవమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ యొక్క పునరుత్థానపు శక్తి మా శరీరం, మా కుటుంబం మరియు గాయపడిన హృదయాలను లేదా సమస్తమును కోల్పోయినట్లు అనిపించే ప్రతి కార్యములలోనికి ప్రవహించునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, నీవు పై చెప్పబడిన సహోదరుని పడక నుండి లేవనెత్తినట్లుగానే, ఈ రోజు మమ్మును మరియు మా ప్రియులగు వారి యొక్క వ్యాధి పడక నుండి నూతన జీవముతో లేవనెత్తుము. దేవా, మమ్మును నీ సన్నిధితో సమృద్ధిగా నింపుము మరియు అపవాదియైన శత్రువు నాశనం చేయడానికి ప్రయత్నించిన దానిని మా జీవితాలలో నీ యొక్క సమృద్ధి జీవముతో పునరుద్ధరించుము. ప్రభువా, మా విశ్వాసం ద్వారా నీ యొక్క శక్తివంతమైన నామంలో మేము నూతన జీవమును పొందుకొనునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.