నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు దేవుని వాక్యము ద్వారా మీకు శుభములు తెలియజేయుటలో నాకు చాలా సంతోషముగా ఉన్నది. దేవుడు మీతో మాట్లాడినప్పుడు, ఆయన దానిని మీ జీవితంలో పరిపూర్ణం చేస్తాడు. కనుకనే, ఆయన నేటి వాగ్దానము ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 14:2వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టిత జనము. మరియు యెహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను'' ప్రకారం మీరు దేవునికి స్వకీయ జనముగా ఉన్నారు. నా స్నేహితులారా, ఇది ఎంతటి గొప్ప అద్భుతకార్యము కదా! దేవునిచేత ఏర్పరచుకొనబడటానికి, ఆయన ప్రతిష్టిత జనముగా ఉండటానికి, తద్వారా ఆయన దృష్టి మీ మీద ఉంచియున్నాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

నేను పాఠశాలలో చదువుచున్నప్పుడు మరియు నేను మిడిల్ స్కూల్ చదువుచున్న కాలములలో, నా పిటి టీచర్లు నాకు చెప్పే ఒక ఆట (గేమ్) నాకు చాలా ఇష్టం. మేము హ్యాండ్‌బాల్ ఆడుకునేవారము. మమ్మల్ని వేర్వేరు రంగుల హౌసులుగా విభజించేవారు, మరియు నేను మా జట్టు గెలవాలని ఎంతగానో కోరుకున్నాను. అందుచేత, విరామ సమయాలలో కూడా మేమంతా ఒకచోట కూడుకునేవారము, మా జట్టు గెలిచేందుకు నేను యోచనలతో పధకాలను రూపొందిస్తాను. అయితే, ఒక టోర్నమెంట్‌లో ఒక కోచ్‌వారు నన్ను చూచి, 'శ్యామ్, నీవే మా జట్టుకు కెప్టెన్‌గా ఉండాలి. వెళ్లి జట్టును నడిపించు,' అని చెప్పినప్పుడు, నాకు చాలా సంతోషం అనిపించింది. మరల, 'శ్యామ్, నీవు వెళ్ళి మా జట్టును నడిపించు' అని చెప్పారు. అప్పుడు నాకు హ్యాండ్‌బాల్ అంటే చాలా ఇష్టము కనుకనే, అది నాకు చాలా గొప్ప విషయంగా అనిపించినది. కాబట్టి, నాకు ఆ బాధ్యత ఇవ్వగానే, నేను గంతులు వేస్తూ, ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయాను.

నా ప్రియులారా, అలాగే, మీ జీవితంలో కూడా, ఇది మిమ్మల్ని ఎన్నుకోవలసిన సమయం; సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మును స్వయంగా తనకు స్వకీయ జనము ఏర్పరచుకున్నాడు. ఇంకను అన్నిటికంటె ముఖ్యంగా, ఆయనకు ఎంతో విలువైన ప్రతిష్ట జనముగాను, స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకొనుటయే. కాబట్టి, నా స్నేహితులారా, ఈరోజు, మీ చుట్టూ ఉన్న వారు మిమ్మును తక్కువ చేసి, 'లైన్‌లో వెనుకకు వెళ్ళు' అని చెబుతుండవచ్చును. వారు మిమ్మును జట్టు నాయకులనుగా ఏర్పరచుకొనకపోవచ్చును లేదా మిమ్మును ముందు వరుసలో ఉండు వారు (ఫ్రంట్-రన్నర్)గా లేదా ప్రచారం చేసే నాయకులనుగా(ప్రమోటర్‌గా) ఎన్నుకొనకపోవచ్చును. వారు మిమ్మును మరచిపోయిన చోటనే మిమ్మును ఉంచి ఉండవచ్చును. కానీ నా ప్రియులారా, మీ జీవితం సర్వశక్తిమంతుడైన దేవుని హస్తాలలో ఉన్నదనియు, ఇంకను ఒక స్వకీయ సంపాద్యముగా ఎన్నుకొనబడినదని మరచిపోకండి. ఆయన మీ పట్ల కలిగియు ఉద్దేశ్యంలో, ఆయన హస్తాలలో మీరు ఒక నాయకులుగా ఉన్నారని ఎన్నటికిని మర్చిపోకండి. అతి త్వరలోనే, ఆయన మిమ్మును అన్నిటిలోను వర్ధిల్లునట్లుగా చేస్తాడు. దేవుడు చేసిన ఈ గొప్ప ఎంపికని ఎన్నటికిని తృణీకరించవద్దు. దానిని విలువైనదిగా భావించినప్పుడు మీ జీవితంలో త్వరలో గొప్ప కార్యాలు జరగడం మీరు చూచెదరు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఉన్నతముగా ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాలో జీవం మరియు ఉద్దేశ్యాన్ని కలిగియున్నావని నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఈ రోజు, నీవు మమ్మును నీ యొక్క స్వకీయ జనముగా ఎన్నుకున్నందుకు మేము ఆనందించుచున్నాము. ప్రభువా, ఈ లోకములో మమ్మును ఎవ్వరు తృణీకరించినా లేదా మరచిపోయినా, నీ కనుదృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉన్నదని మాకు తెలుసు. కనుకనే, నేడు నీ యొక్క దైవీకమైన ఉద్దేశ్యంలో మేము ఒక నాయకులుగా నీ చేతులలో ఉన్నామని ప్రతిరోజూ మాకు గుర్తు చేయుము. దేవా, నీ పరిపూర్ణ సమయంలో, నీవు మమ్మును వర్ధిల్లునట్లుగా చేస్తావని నమ్ముతూ, మనోధైర్యంతోను మరియు విశ్వాసంతోను ఆ పిలుపులో నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ యొక్క 'గొప్ప ఎంపిక'కు మేము విలువనిచ్చి, మా జీవితాన్ని నీ శక్తివంతమైన ప్రణాళికకు మరియు హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. దేవా, నీ ద్వారా మేము నాయకులముగా వాడబడే కృపను మాకు దయచేయుము. ప్రభువా, మమ్మును నీకు ప్రతిష్టిత జనముగాను మరియు భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా నీకు స్వకీయ జనమగునట్లు మమ్మును నీవు ఏర్పరచుకున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మేము ఈ లోకములో ఉన్నవారికంటె నీకు ప్రతిష్ట జనముగా సమర్పించుకొనుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. ఇంకను మేము నీ కొరకు వాడబడే పాత్రగా ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.