నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున మీకు శుభములు తెలియజేయుచూ, ప్రేమతో మిమ్మును ఆహ్వానించుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 32:10వ వచనము తీసుకొనబడియున్నది. ఆ వచనము, " భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని యందు నమ్మిక ఉంచాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, " యెహోవా యందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది'' అని ఎంత అద్భుతముగా సెలవియ్యబడియున్నది కదా. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 13:5వ వచనములో చూచినట్లయితే, " నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, దేవుని కృపయందు మనము నమ్మికయుంచినప్పుడు, మన హృదయము దేవుని సంతోషము చేత హర్షించును. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 103:11వ వచనములో చూచినట్లయితే, " భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులుగలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవునియందు ఎంతగా భయభక్తులు కలిగియుంటారో అంత అధికముగా మీ పట్ల కృప విస్తరిస్తుంది.

నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని కృపయందు ఎంతగా భయభక్తులు కలిగియున్నారు? దేవుని కృప కొరకు మీరు ఎంతగా వేచియుంటూ, కనిపెట్టుచున్నారు? అందుకే బైబిల్ నుండి కీర్తనలు 143:8వ వచనములో చూచినట్లయితే, "నీ యందు నేను నమ్మికయుంచియున్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నేనెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము'' అని చెప్పబడినట్లుగానే, మనము దేవునియందు నమ్మికయుంచినప్పుడు, ఆయన మనము నడవవలసిన మార్గమును మనకు తెలియజేస్తాడు. అంతమాత్రమే కాదు, మనము ఆయనను ఉదయ కాలమున వేకువనే వెదకేవారముగా ఉండవలెను. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 63:1-2వ వచనములలో చూచినట్లయితే, " దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది నీ మీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, దావీదు దేవుని ప్రతి ఉదయ కాలమున వేకువ జాముననే ఆయనను వెదకియున్నాడు. కనుకనే, అతడు దేవుని కృపను పొందుకొనియున్నాడు. ఆలాగుననే, మనము కూడా ఆయన ప్రభావమును చూచుటకు దావీదు వలె ఆయనను వెకువనే వెదకాలి.

అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రతిరోజు మీరు దేవుని ముఖమును చూచుటకు మరియు ఆయన వాక్యమును చదువుటకు ఎంత సమయమును వెచ్చించుచున్నారు? నా ప్రియులారా, మీరు దావీదువలె వేకువనే, ఉదయాన్నే లేవండి. దేవుని మహిమ కొరకు లేచి తేజరిల్లండి. దేవుని వాక్యమును మీరు అనుదినము చదివినప్పుడు, దేవుని యొక్క గొప్ప సన్నిధానము మీ జీవితములో మీకు తోడుగా ఉంటుంది. మీరు మీ పూర్తి విశ్వాసమును ప్రభువునందు ఉంచినప్పుడు, మీరు ఎటువంటి పరిస్థితులలో కూడా కదిలింపబడరు. అన్నివేళల ప్రభువు మీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు కూడా మన జీవితాలను ప్రభువునకు సమర్పించుకొని, ఇటువంటి గొప్ప మహిమను మన జీవితములలో అనుగ్రహించమని ప్రభువు వేడుకుందాము. రండి ప్రార్థించి, ఇటువంటి అద్భుత జీవితమును మనకు ఇవ్వమని ప్రభువును అడుగుదాము. నా ప్రియులారా, మీరు దావీదువలె వేకువనే, ఉదయాన్నే లేచి, దేవుని కుటుంబముగా వెదకుచూ, ఆయన యందు నమ్మిక యుంచినట్లయితే, నిశ్చయముగా, మీ చుట్టు మరియు మీ కుటుంబము చుట్టు ఆయన కృప ఆవరిస్తుంది. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మేము నడవవలసిన మార్గమును మాకు చూపుచున్నందుకై నీకు వందనములు. తండ్రీ, ప్రతి ఉదయముననే నిన్ను వెదకగల కృపను మాకందరికి దయచేయుము. యేసయ్యా, నీ వలె మరియు నీ సేవకుడైన దావీదు వలె, మేము కూడా వేకువనే నిన్ను వెదకునట్లుగా మాకు సహాయము చేసి, ఇప్పుడే అటువంటి గొప్ప కృపతో మమ్మును నింపుము. దేవా, ప్రతిరోజు నీ యొక్క సన్నిధి కొరకు దాహమును కలిగియుంటూ, నీ వాక్యమును ప్రేమించునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నీ యందు విశ్వాసము కలిగియుండుటకును మరియు నీ కృప మమ్మును ఆవరించునట్లుగా చేయుము. దేవా, ఈ లోకపు శ్రమల వలన మేము కదలించబడకుండా మమ్మును కాపాడుము. ప్రభువా, మా హృదయములను నీ కృపతో నింపి, మా అడుగులను నడిపించుము మరియు నీ మార్గములలో మేము నడవడానికి మాకు నీ కృపను చూపుము. యేసయ్యా, నీ సన్నిధిచేత మా జీవితములను ఆకర్షించి, నీ యొక్క మహిమాన్వితమైన జీవితంలోకి మమ్మును నడిపించునట్లుగా చేయుము. దేవా, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు మేమెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియుండునట్లుగా చేయుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.