నా ప్రియులారా, ఈరోజు, ఈ శుభప్రదమైన మట్టల ఆదివారంనాడు మనము సంతోషించుదాం! నేడు కూడా దేవుడు మన కొరకు విజయవంత మైన మార్గాన్ని సృష్టించియున్నాడు. ఆయన సజీవుడై యున్నాడు. కనుకనే, యేసును మనము కొనియాడెదము. ఆయనను ప్రేమించుదాం. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 8:20వ వచనములో చెప్పినట్లుగానే, ఈరోజే ఆయన మాటను మనము చూద్దాము. ఆ వచనము, "నీతి మార్గమునందును న్యాయ మార్గములయందును నేను నడచుచున్నాను'' ప్రకారం సామెతలు 8వ అధ్యాయము దేవుని జ్ఞానంతో నిండియున్నది మరియు అందులో చెప్పబడిన జ్ఞానం ఇలాగున ప్రకటించుచున్నది, "నేను నీతి మార్గంలో మరియు న్యాయ మార్గాలలో మాత్రమే నడుస్తాను'' అని చెప్పబడినట్లుగానే, ఎవరైతే ఈ దేవుని జ్ఞానాన్ని పొందు తారో, వారు కేవలం నీతి మరియు న్యాయాన్ని అనుసరించే మార్గంలో నడిపించబడతారు. అట్టివారు ఏదైనా కీడు చేయడానికి, చెడుగా ఆలోచించ డానికి లేదా అన్యాయంగా ప్రవర్తించడానికి భయపడతారు. జ్ఞానం మనలో దేవుని భయాన్ని ఉంచుతుంది. కాబట్టి, ఈ రోజు, మీరు నీతిమార్గంలో నడిపించబడటానికి అలాంటి జ్ఞానాన్ని పొందుకొనబోవుచున్నారు.

ఒక రోజు, నేను కారు నడుపుచుండగా, సిగ్నల్‌లో నాకు అక్కడ రెడ్ లైట్ కనిపించింది. ఆ సిగ్నల్ లైట్‌కు ముందున్న లైన్‌కు ముందు భాగంలో ఒక కారు ఆగి, వేచి ఉండెను. కానీ, ఒక్క క్షణం తర్వాత, వెనుక ఉన్న కార్లన్నీ బిగ్గరగా హారన్ మోగించడం ప్రారంభించాయి. ఎరుపు లైట్ వెలుగు చున్నప్పటికి, ఎదురుగా నుండి కార్లు మరియు ఎటువంటి వాహనములు కూడా రాకపోయినందున, వారు ముందుకు దూసుకు పోవాలనుకున్నారు. అయినప్పటికిని, ఆ ముందు కారులో ఉన్న వ్యక్తి మాత్రము కదలలేదు. అతను వారి మాటలకు లొంగిపోలేదు. కానీ, చివరికి ఒక ఆటో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చి, 'వెళ్ళు, వె ళ్లయ్యా!' అని అరిచాడు. ఎందుకు వేచి ఉన్నావు? అక్కడ ఎవరూ లేరు కదా! అని చెప్పాడు. కానీ, ఆ కారు ్రడైవర్ మాత్రము నెమ్మదిగా ఉండెను, అతని దృష్టి ముందుకు కేంద్రీకరించబడ్డా యి, అతడు ఎవరి మాటలను పట్టించుకోలేదు మరియు బాధపడలేదు. పూర్తిగా అతని దృష్టి అంతయు ఆ సిగ్నిల్ లైట్ మీద మాత్రమే ఉండెను. చివరికి, ఆకుపచ్చ లైట్ వెలిగిన తర్వాత మాత్రమే అతను అక్కడ నుండి కదిలా డు, ఆపై మిగిలిన వారందరూ అతని మార్గాన్ని అనుసరించవలసి వచ్చినది. అతను ఏలాగున సరైన మార్గములో ముందు వెళ్లాడో, అదేవిధముగానే, అతని వెనుక ఉన్న వారు కూడా సరైన మార్గాన్ని అనుసరించవలసి వచ్చింది.

చూడండి, నా ప్రియ స్నేహితులారా, ఆ విషయమును నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. జ్ఞానము మనలను అలాంటి మార్గములోనికి నడిపిస్తుంది. కనుకనే, నేడు మీరు కూడా ఇటువంటి జ్ఞానమునకు విధేయత చూపుతారా? నేడు మనము కూడా ఇటువంటి జ్ఞానానికి లోబడుదాము. మీరు అబద్ధం చెప్పాలనే ఆలోచనలు, ఇతరుల నుండి నిజం దాచడం, బహుశా! మీ యజమాని, మీ తల్లిదండ్రులు లేదా ఎవరు చూడలేదని వారి నుండి ఆలోచనలు ఎదుర్కొంటూ ఉండవచ్చును. మీరు వంకర మార్గాలను ఎన్నుకోవడానికి శోధించబడవచ్చును. కానీ ఈ రోజు, నా ప్రియ స్నేహితులారా, నీతివంతమైన ఆలోచనలు మరియు న్యాయవంతమైన చర్యలతో మనలను కాపాడటానికి జ్ఞానపు ఆత్మను కావాలని దేవుని యొద్ద ఈ రోజు మనము అడుగుదాం. తద్వారా, దేవుడు మిమ్మును ఘనపరుస్తాడు. ఆలాగుననే, ప్రియులారా, సామెతలు 8 వ అధ్యాయములోని ఈ క్రింది వచనాలు చెప్పినట్లుగా, "నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును '' అని చెప్పినట్లుగానే, నీతిని, న్యాయాన్ని అనుసరించేవారు దేవుని స్వాస్థ్యమును పొందుకుంటారు. అటువంటి వారిని దేవుడు ఆస్తికర్తలనుగా చేస్తాడు. నేడు, దేవుని స్వాస్థ్యము మీ కొరకు వేచి ఉన్నది. కాబట్టి, మీరు దానిని నేడు దేవుని యొద్ద అడిగి పొందుకుంటారా? ఆలాగుననే, ఆయన సన్నిధిలో దేవుని జ్ఞానము కావాలని అడగండి, నీతి న్యాయములతో నడుచుకొనండి, నేటి వాగ్దానము ద్వారా దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వసంపదలకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రేమగల ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఈ ఆశీర్వాదకరమైన మట్టల ఆదివారం నిమిత్తము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు సజీవంగా ఉన్నావనియు, నీవు పొందిన విజయం మాకు నిరీక్షణను కలిగిస్తుందని మేము నమ్ముచున్నాము. ప్రభువా, దయచేసి ఈ రోజు మమ్మును మరియు మా కుటుంబ సభ్యులను, మా ఉద్యోగ స్థలములలోను, మేము చేయు ప్రతి పనిలో నీ యొక్క జ్ఞాన ఆత్మతో నింపుము. దేవా, మమ్మును నీతి మరియు న్యాయం జరిగించు మార్గంలో నడిపించండి. ప్రభువా, అన్యాయం యొక్క ప్రతి ఆలోచన మరియు చర్యను తిరస్కరించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము నీకు భయపడి మేము చేయు ప్రతి పనిలో నిజాయితీగా నడుచుటకు మాకు నీ యొక్క జ్ఞానమును అనుగ్రహించుము. ప్రభువా, సత్యాన్ని ప్రేమించడం మరియు మోసం, అబద్దం నుండి మేము దూరంగా ఉండటం మాకు నేర్పించుము. ప్రభువా, నీ యొక్క జ్ఞానం మా హృదయాన్ని కాపాడునట్లుగాను, మా అడుగులను స్థిరపరచి, సరైన మార్గములో నడుచునట్లుగాను మరియు మా జీవితకాలమంతా నీ స్వాస్థ్యములో నడవడానికి మమ్మును అనుమతించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నీతిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.