నా ప్రియులారా, ఎల్లవేళల దేవుడు మిమ్మును తన పక్షమున ఉంచుకోవాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అనేక ఫర్యాయములు ఆయన మీ పక్షమున ఉండాలని మీరు కోరుకుంటారు. మీరు ఎందుకు ఆ విధంగా కోరుకుంటారంటే, మీరు పిలిచినప్పుడల్లా ఆయన మీ పక్షమున వచ్చి, ఆయన మీకు సమస్తమైన సేవలను అందించాలని మీరు ఆలాగున కోరుకుంటారు. కానీ, దేవుడు మీ సహచర్యమును కోరుకుంటున్నాడు. ఆయన యొద్ద నుండి ఏదియు ఆశించే విధానము కాకుండా, కేవలం ఆయనను ఘనరపనరచుచున్న విధానము, ఆయనను ప్రేమించుచున్న విధానము, ఆయననను స్తుతించుచున్న విధానము, ఆయనకు వందనాలు చెబుతున్న విధానమునే ఆయన కోరుకుంటున్నాడు. కనుకనే, దేవుడు ఎల్లవేళల మీరు ఆయనతో కూడా ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 8:30వ వచనములో మనము ఈ సంగతులను చదువుచున్నాము. ఆ వచనము, " నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని'' ప్రకారము అవును, మీరు విచారము గుండా వెళ్లుచున్నప్పటికిని కూడా మీరు బాధ గుండా వెళ్లుచున్నప్పటికిని, దుష్ట ప్రజలైన వారి నుండి విమర్శలను మీరు ఎదుర్కొంటున్నప్పటికి కూడా, మీరు ఆర్థిక సమస్యల గుండా వెళ్లుచున్నప్పటికిని కూడాను, అయినప్పటికిని, అన్నిటికంటె మిన్నగా, వీటన్నిటి వైపు చూడకుండా, కేవలము యేసు సన్నిధి వైపు మీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు, మీరు దేవుని వైపు వెళ్లుచుండగా, దేవుడు అనుదినము మిమ్మును ఆనందించువారినిగా చేయనై యున్నాడు. అప్పుడు లోకపరమైన ఏదియు కూడా మిమ్మును తాకజాలదు. ఆయన పరసంబంధమైన సన్నిధి మిమ్మును ఆలాగున ఆనందింపజేయుచుంటుంది. ఆయన తన ఆనంద ప్రవాహములోనికి మిమ్మును త్రాగనిచ్చి, మిమ్మును ఆనందింపజేయును. యేసుకంటె మిన్నగా దేనిని ఈ లోకములో మీకు ఉంచబోడు. యేసే మీకు సమస్తమై యుంటాడు. మీకు ఆహారము లేకపోయినప్పటికిని ఆయన సన్నిధిచేత మీరు సంతృప్తిపరచబడతారు.
నా ప్రియులారా, అందుకే బైబిల్ నుండి కీర్తనలు 16:8వ వచనములో దావీదు ఇలాగున అంటున్నాడు, "సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను'' అని చెప్పగలిగినప్పుడు, మీరు అది కలిగియుండగలిగే అత్యంత గొప్ప సంతృప్తియై యున్నది. మీరు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు, మీరు రెండవరోజు, మూడవ రోజునకు వచ్చినప్పుడు, ఆహారము కొరకైన ఎదురు చూపు ఆశ, లోకము కొరకు ఎదురు చూపు ఆశ మీ నుండి మిమ్మును విడిచిపెట్టి వెళ్లిపోతాయి. మీరు యేసు సాన్నిధ్యములో లీనమైపోతారు. అదియే ఆనందము. అనుదినము మీరు సంతోషించుచు, లేక ఆనందించుచున్నప్పుడు, లోకపరమైన ఏ విచారములు మిమ్మును తాకజాలవు. సమస్యలు ఉంటే ఉండవచ్చును. కానీ, అవి మిమ్మును ఎప్పటికిని తాకజాలవు. కనుకనే, మీరు ఇలాగున ప్రార్థన చేస్తారా? 'ప్రభువా, నిరంతరాయముగా, నేను నీ పక్షమున ఉండగోరుచున్నాను,' అని చెప్పినప్పుడు, ఆయన మీ పక్షమున ఉంటాడు. ఆలాగుననే, "సదాకాలము యెహోవా యందు నా గురిని, నా దృష్టిని నిలుపుచున్నాను'' అని కీర్తనకారుడు చెప్పినట్లుగానే, మీ యొక్క పదోన్నతి మీద కాదు, ధనము మీద, ప్రఖ్యాతి మీద, ప్రజలు చెప్పుచున్న అభిప్రాయముల మీద కాదు, మీ దృష్టిని ఎల్లప్పుడు ప్రభువు మీదనే నిలపాలి. నిరంతరాయముగా మీ గురిని ఆయన మీదనే నిలిపియుండాలి. అప్పుడు ఆయన మీ కుడిపార్శ్వము ఉంటాడు. అనగా, మీరు ఎల్లవేళల కుడివైపున, యేసు ఎడమ వైపు ఉండియున్నాడన్నమాట. లోకపరమైన ఏ సమస్యలైనప్పటికిని ఎప్పటికిని మిమ్మును కంపింపజాలవు. అందుకే దావీదు ఈలాగున అంటున్నాడు, "నేను ఎప్పటికిని కదల్చబడను'' అని అంటున్నాడు. నేడు దేవుడు ఇటువంటి కృపను మీకును ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు.
నా ప్రియులారా, దేవుడు మీకు సమీపముగా ఉన్నప్పుడు, మీరు ఆయన సాన్నిధ్యములో ఉండియున్నప్పుడు, బైబిల్ నుండి సామెతలు 8:12వ వచనములో ఏమి చెబుతుందనగా, "జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును'' ప్రకారము దేవుని జ్ఞానము మీలో కూడా నివాసము చేయును. మరియు 1 కొరింథీయులకు 1:24వ వచనములో చూచినట్లయితే, "ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు'' ప్రకారము దేవుని శక్తియును, దేవుని జ్ఞానమునై యున్న క్రీస్తు మీతో కూడా నివాసము చేయును. బైబిల్ నుండి యాకోబు 1:17వ వచనములో చూచినట్లయితే, "శ్రేష్ఠమైన ప్రతి యావియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు'' ప్రకారము మీరు ఆయనతో ఎంత ఎక్కువ సహవాసంలో ఉంటారో, ఆయన మీపై అంత ఎక్కువ సమాధానమును, జ్ఞానము మరియు ఆశీర్వాదం కుమ్మరిస్తాడు. మీరు ఆయన పరలోక దృక్పథం నుండి సమస్తమును చూడటం ప్రారంభిస్తారు. మీ పోరాటాలు కూడా పాఠాలుగా మారుతాయి, మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారుతాయి మరియు మీ నిరీక్షణ ఆరాధనగా మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆయన మిమ్మల్ని అద్భుతాల కొరకు కాదు, ఆశీర్వాదాల కొరకు కాదు, తన యొద్దకు దగ్గరకు రమ్మని ఆహ్వానించుచున్నాడు. ఎందుకనగా, ఎక్కువగా ఆయనను కోరుకోండి. మీ హృదయం ఇలాగున చెప్పనివ్వండి, 'ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ పక్కన ఉండాలనుకుంటున్నాము.' అప్పుడు ఆయన సన్నిధి మిమ్మల్ని ఒక కేడెము వలె ఆవరిస్తుంది మరియు మీరు ఎన్నటికిని కదిలించబడరు. పరమందుండి వచ్చు ప్రతి సంపూర్ణమైన ప్రతి యీవియు మీతో కూడా నివాసము చేయును. దేవుడు మిమ్మును తన సాన్నిధ్యములో ఉంచును గాక. యేసు సాన్నిధ్యములో జీవించండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహిమ గల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును నీకు సమీపముగా ఉండాలని కోరుకున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము సదాకాలము నీ పక్షమున ఉండాలని కోరుకుంటున్నాము. దేవా, నీ సన్నిధి నుండి మమ్మును దూరం చేయుచున్న ప్రతి అవాంతరాన్ని మా నుండి తొలగించుము. ప్రభువా, మా హృదయాన్ని నీ శాంతి మరియు ఆనందంతో ప్రతిరోజు నింపుము. దేవా, నీవు మాకు అనుగ్రహించే దీవెనల కొరకు కాకుండా, మేము నిన్ను ప్రేమించడానికి మరియు నీ పక్షమున మేము నిలిచియుంటూ, నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా దృష్టిని నీపై ఉంచునట్లుగాను, లోకములో ఉన్నవి ఎప్పుడూ కదిలించబడకుండా ఉండునట్లుగా మాకు నేర్పుము. దేవా, నీ జ్ఞానం మరియు సన్నిధి మా ఇంటిని, మా పనిని మరియు మా హృదయాన్ని నింపనట్లుగా చేయుము. ప్రభువైన యేసయ్యా, మమ్మును నీతో సహవాసం కలిగియుండునట్లుగా మమ్మును నీలోనికి ఆకర్షించుకొనుము. ప్రభువా, మా జీవితం నిరంతరము నీ సన్నిధి ఆనందంతో పొంగిపొరునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


