నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 50:15వ వచనము మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు'' ప్రకారం మీరు దేవునికి మొఱ్ఱపెట్టండి, ఆయన మిమ్మును విడిపిస్తాడు. అవును, స్నేహితులారా, ఈ లోకమంతయు అంధకారముతో నిండియున్నది. ఆకస్మాత్తుగా, ప్రమాదములు జరుగవచ్చును, ప్రజలు వారి ప్రాణాలను కోల్పోతారు. అటువంటి అనేకమైన సమస్యలు కలుగవచ్చును. అయితే, హెబ్రీయులకు 13:6వ వచనములో చూచినట్లయితే, "కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము'' అని చెప్పబడినట్లుగానే, అటువంటి సమయములో ప్రభువు మాత్రమే మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. కాబట్టి, మీరు చింతించనవసరము లేదు, మీరు భయపడవనవసరము లేదు. అపవాది మనకు ఏమి చేయజాలడు. 'ఈ విషయాలు నన్ను ఏమి చేయజాలవు' అని అవును, మీరు ఆ విధంగా చెప్పగలుగుతారు. మీ దృష్టిని, మీ దృష్టిని ప్రభువు మీద ఉంచినప్పుడు, మీరు ఆ విధంగా చెప్పగలుగుతారు. ప్రభువు మీకు గొప్ప నిరీక్షణను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా!

మా స్వంత జీవితాలలో అనేకసార్లు అటువంటి అనుభూతిని కలిగియున్నాము. మా కుటుంబము మరియు పరిచర్యను గురించి అనేక విధాలుగా మాట్లాడేవారు. కానీ, మేము వారి వైపు చూచేవారము కాదు. అదే సమయములో మేము యేసు ప్రభువు వైపు మాత్రమే చూచేవారము. హల్లెలూయా! మనము ఆయన వైపు చూచినప్పుడు, ప్రభువు మనకు సమాధానమును ఇస్తాడు. ఇంకను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును మీకు అనుగ్రహిస్తాడు. అనవసరమైన మాటలన్నిటిలో నుండి అద్భుతమైన విధంగా మిమ్మును విడిపిస్తాడు. బైబిల్ నుండి కీర్తనలు 145:18వ వచనమును చూచినట్లయితే, "తనకు మొఱ్ఱపెట్టువారికందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు'' ప్రకారం నిజముగా మొఱ్ఱపెట్టు వారికందరికి ఆయన సమీపముగా ఉన్నాడు. మా కుమారుని దైవీకమైన బిడ్డగా మర్చాలని దైవీకంగా మేము పెంచియున్నాము. కానీ, కొన్ని సంవత్సరాలు అపవాది యేసు యొద్ద నుండి దూరముగా తీసుకొని వెళ్లిపోవాలని ప్రయత్నించాడు. అయితే, అతడు అంధకారములో ఉన్నాడు. మాకు ఏమియు కూడా వానిని గురించి తెలియదు. నా కుమారుడు సాతాను బంధకాల నుండి విడిపించబడాలని ఒక రోజు పూర్తిగా ఉపవాసము చేయాలని నేను అనుకున్నాను. ఆలాగున ఒక వారము, రెండువారములు, మూడు వారములు గడిచిపోయినవి. అప్పుడు అద్భుతము జరిగినది. హల్లెలూయా! నా కుమారుని అంధకారము నుండి బయటకు విడిపించాడు. దేవుడు దైవీకమైన పరిశుద్ధతలోనికి నా కుమారుని నడిపించాడు. 17 సంవత్సరముల యౌవనస్థుడుగా ఉన్నప్పుడే, ప్రభువు అతనిని తన పని కొరకు వాడుకొనుటకు మొదలు పెట్టాడు.

అవును, నా ప్రియమైన స్నేహితులారా, అంధకారము మా చుట్టు ఆవరించియున్నది, అంధకారము ద్వారా అనేక విషయాలు జరుగుచున్నాయి అని మీరు కూడా చెప్పవచ్చును. నేను చీకటిలో ఉన్నాను అని మీరు మొఱ్ఱపెట్టుచున్నారేమో? నేను ఎలా బయటకు రావాలని నాకు తెలియలేదు అని అంటున్నారేమో? అయితే, నా ప్రియులారా, యేసును మీరు గట్టిగా పట్టుకొనండి. యేసును గట్టిగా హత్తుకొనండి. ఆపత్కాలమున మీరు ఆయనకు మొఱ్ఱపెట్టండి. ప్రభువు నిశ్చయముగా మీ జీవితములో అలుముకొని యున్న అంధకారము నుండి మిమ్మును విడుదల చేస్తాడు. ఆయన ఎన్నడును మిమ్మును విడనాడడు. అటువంటి అంధకారములన్నిటి నుండి మిమ్మును విడిపించాలని ఇప్పుడే ఆయనకు మొఱ్ఱపెట్టండి. ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీకు ఆపత్కాలమున సహాయము చేసి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన :
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క అద్భుతమైన సన్నిధానము కొరకై నీకు వందనాలు. ప్రభువా, నీ ప్రభావము మహిమతో మా మధ్యకు దిగిరమ్ము. ప్రభువా, మేము అంధకారములో ఉండి, మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, మేము నీ సన్నిధికి వచ్చినప్పుడు, నీవు మాకు సహాయము చేసి, మమ్మును విడిపించగలవని మేము విశ్వసించుచున్నాము. ప్రభువా, మా యొక్క అంధకారము నుండి మేము బయటకు రావడానికి మాకు సహాయము చేయుము. మా జీవితములో ఉన్న చీకటినంతయు తొలగిపోవునట్లుగాను, మేము నీ యొక్క వెలుగులోనికి ప్రవేశించునట్లుగా, నీ దీవెనలు, నీ యొక్క సంతోషము, సమాధానమును, పొందుకొనునట్లుగాను కృపను దయచేయుము. ప్రభువా, నీ వాక్యం చెప్పినట్లుగానే, ఈ రోజు మా దృష్టిని నీ మీద ఉంచియున్నాము. దేవా, కష్టాలు, చీకటి మరియు భయాల మధ్య, మా ఏకైక సహాయకుడు మరియు విమోచకుడైన నీ వైపు మా దృష్టిని ఉంచుచున్నాము. మేము భయపడము, ఎందుకంటే నీవు మాతో ఉన్నావు. నీవు మా ప్రక్కన ఉన్నప్పుడు శత్రువు ఏమి చేయగలడు? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానముతో మా హృదయాన్ని నింపుము. ప్రభువా, మేము నిన్ను హత్తుకొని ఉండటానికి, నిన్ను నమ్మడానికి మరియు నీ శక్తివంతమైన విడుదల కొరకు ఓపికగా వేచి ఉండటానికి మమ్మును బలపరచుము. దేవా, సత్యంతో నిన్ను ప్రార్థించే వారందరికి నీవు సమీపముగా ఉన్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి చీకటి ప్రాంతంలోనూ నీ వెలుగును ప్రకాశింపజేయుము. దేవా, మేము నీ సహాయాన్ని మరియు నీ విజయాన్ని పొందుకొని అనుభవించునట్లుగా కృపను చూపుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.