నా అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 పేతురు 2:9వ వచనమును మన ధ్యాననిమిత్తము నేడు తీసుకొనబడినది. ఆ వచనము, "మీరు...ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు'' అని చెప్పబడిన ప్రకారం మీరు దేవునికి ప్రత్యేకమైన సొత్తయై ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. నేడు ప్రభువైన యేసు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, "మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గానీ... నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని, నేను మిమ్మును ఏర్పరచుకొనియున్నాను. నేను మిమ్మును రూపించియున్నాను, మీ తల్లిగర్భములో మీ ఎముకలు ఇంకను రూపింపబడకమునుపే, నేను మిమ్మును ఎరిగియున్నాను.'' కనుకనే, 'నేను పనికిమాలినవాడిని/దానను అని నా స్నేహితులారా, మిమ్మును గూర్చి మీరు అనుకొనకండి. అందరు నన్ను మరచిపోయారు కదా అని మీరు భావించకండి. నేను దేవుని చేత ఏర్పరచబడిన పాత్రను అని భావించండి. నేను దేవుని ప్రణాళికతో అనుసంధానమై యున్నాను. నేను ఈ లోకములో ఏకాకిని కాను' అని ధైర్యముగా చెప్పండి. నా ప్రియులారా, ఈ రోజు నుండి అధికముగా ఫలించు నిమిత్తమై దేవుని హస్తము మిమ్మును నడిపిస్తుంది.

రెండవదిగా, నా ప్రియులారా, మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారు. మీ అనుదిన జీవితమునకు సంబంధించిన ప్రతి నిర్ణయము పరలోకమందు నిర్ణయించబడుతుంది. మీరు దేవుని ప్రణాళికను ఇతరుల కొరకై తీసుకొని వచ్చెదరు. తద్వారా, మీరు వారి కన్నీటిని తుడిచేయుదురు. మూడవదిగా, దేవుడు మిమ్మును పరిశుద్ధ జనముగా చేసియున్నాడు. దేవుని యెదుటను, నరుల యెదుటను మీరు పరిశుద్ధముగా ఉండునట్లుగాను, ఏ నేత్రాశ మరియు ఎటువంటి శరీరాశ మీకు ఉండదు. ఎలాంటి జీవపు డంబము మీలో ఇక ఎన్నటికిని మిమ్మును తాకజాలదు. ప్రతి దినము మీ యొక్క దేహము పరిశుద్ధమైనదిగా, అంగీకార యోగ్యమైనదిగాను దేవునికి మీరు సమర్పించుకొనుచుండగా, మీరు దేవునికి పరిశుద్ధ జనాంగమై ఉన్నారు. మీరు దేవునికి ప్రత్యేకమైన స్వాస్థ్యజనాంగమై ఉన్నారు. ఆయన ఎప్పటికిని మిమ్మును విడువడు మరియు ఎడబాయడు. ఆయన ఎల్లవేళల, మీతో కూడా ఉంటాడు. మీరు దేవునికి సొత్తయిన ప్రజలై ఉన్నారు. కొంతమంది పిల్లలు, వారి సంచిని ఎప్పుడు విడిచిపెట్టరు. వారు ఇతర బిడ్డలకు ఇవ్వనే ఇవ్వరు. 'ఇది నా సంచి, అంటు ఉంటారు. దాని లోపల నా యొక్క పెన్సిల్ ఉన్నది, అది నాది అని అంటారు.' నా స్నేహితులారా, ఆలాగుననే, దేవుడు మీ పక్షమున పోరాడుతాడు. ఆయన మీ నిమిత్తమై పోరాడుతాడు. మీరు కేవలము మౌనముగా ఉండండి. ప్రభువు మీ కోసం సమస్తమును పరిపూర్ణము చేస్తాడు. ఎందుకనగా, మీరు ఆయనకు స్వాస్థ్యజనాంగమై ఉన్నారు. కనుకనే, మీరు భయపడకండి.

ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యము ఉన్నది. ఔరంగాబాద్ నుండి శ్రీ. లక్ష్మన్ మరియు శ్రీమతి అల్కా వారి సాక్ష్యమును పంచుకున్నారు. లక్ష్మన్ నిరుద్యోగిగా ఉండెను. భద్రత సిబ్బందిగా పనిచేయుచుండెను. అతని సంపాదన రోజుకు 100 రూపాయలు. సౌందర్యవంతమైన కుమార్తె ప్రీతిని కలిగియున్నారు. వారు ఆమె యొక్క మొదటి సంవత్సరము జన్మదినోత్సవము జరిపించినప్పుడు, వారి కోసము భోజనము కొనుక్కోవలసి వచ్చినప్పుడు, వారి యొద్ద ఉన్న వెండి గొలుసు వారు అమ్ముకోవలసి వచ్చినది. అటువంటి సంర్భములోనే సహోదరుడు లక్ష్మన్ ప్రార్థనా గోపురమునకు వెళ్లాడు. అక్కడకు వెళ్లి కన్నీటితో ప్రార్థించాడు. ప్రార్థన యోధులు కలిసి అతనితో కూడా ప్రార్థించారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసా? ఒక ప్రాధమిక పాఠశాలలో అతనికి ప్రభుత్వ ఉద్యోగము లభించినది. అతడు ఎంతగానో కృతజ్ఞతను కలిగియున్నాడు. కుటుంబ సమేతముగా, కుటుంబ ఆశీర్వాద పధకములో వారు సభ్యులుగా చేరారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారి ఆర్థిక సమస్యలన్నియు తొలగిపోయాయి. రెండవ బిడ్డకు ప్రయత్నించారు. కానీ, అనేకసార్లు గర్భస్రావము కలిగెను. అంధకారపు ఆకారాలు వచ్చి, వారి మీద దాడి చేస్తున్నట్లుగా ఉండేది. ఆమె యింటిలో నుండి బయటకు పారిపోవుచుండెను. ఆ యొక్క బిడ్డ గర్భములోనే చనిపోయేది. అటువంటి సమయములోనే యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా మహోత్సవాలు ఔరంగాబాద్‌లో నిర్వహించబడినవి. సహోదరి ఇవాంజెలిన్‌గారు ప్రార్థించుచుండగా, అంధకార ఆకారము, శ్రీమతి అల్కాలో నుండి పూర్తిగా బయటకు వెళ్లిపోవడము జరిగింది. దైవీకమైన ఆనందము ఆమెలోనికి వచ్చినది. ఆమె గర్భము దాల్చినది. దేవుడు ఆమెకు ఆరోగ్యవంతమైన బిడ్డను అనుగ్రహించాడు. వారికి ఒక బాబు మరియు ఒక పాప జన్మించారు. మహా అద్భుతమైన రీతిలో దేవుడు వారికి ఒక గృహమును నిర్మాణము చేశాడు. ఈ రోజు వారికి మంచి తాజా నీరు అందుబాటులో ఉన్నది. ఇతరులు వచ్చి, వారి యింటిలో నుండి నీటిని తీసుకొని వెళ్లతారు. వారు ఆశీర్వదకరముగా ఉన్నారు. ఈనాడు వారు ఏర్పరచబడిన వంశమునైన పాత్ర, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తయిన ప్రజగా ఉండెను. నా ప్రియులారా, నేడు మీరు కూడా ఇలాంటి గొప్ప ధన్యతను పొందుకోవాలంటే, మిమ్మును మీరు సజీవయాగముగా సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, మీరు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగముగాను, దేవుని సొత్తయిన ప్రజలుగా ఉంటారు. ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము పరిశుద్ధముగా ఉండడానికి మాకు సహాయము చేయుము. యేసయ్యా, కుటుంబ సమేతముగా మేము నీతిమంతులుగా నిన్ను వెంబడించడానికి నీ కృపను మాకు దయచేయుము. దేవా, మాకు ఏ కీడు మరియు ఏ నష్టము మా యొద్దకు ఎప్పుడు కూడా రాకుండా, నీ నామమున మేము విడుదల పొందుకొనుటకు నీ కృపను మాకు దయచేయుము. మా కుటుంబములో అద్భుతకార్యములను జరిగించుము. దేవా, మేము సమృద్ధిని కలిగియుండునట్లుగా కృపను అనుగ్రహించి, నీ యొక్క ఘనత వహించు పాత్రలుగా మేము ఉండునట్లుగా సహాయము చేయుము. పరలోకపు తండ్రీ, మేము ఎవరో కాదు, నీ గొప్ప ప్రేమ వలన మమ్మును ఎన్నుకున్నందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, నీవు మమ్మును ఏర్పరచుకున్నావు, మమ్మును నీవు ఎన్నుకున్నావు, మా జీవితం పట్ల నీకు ఒక ఉద్దేశ్యం కలదు. దేవా, మేము మరచిపోయామని లేదా అనర్హుడని అనిపించినప్పుడు కూడా, మేము నీ బలమైన చేతులలో ఎన్నుకోబడిన పాత్రనని మాకు గుర్తు చేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, మమ్మును ఫలవంతం చేయుము. ప్రభువా, మా అడుగులు మరియు నిర్ణయాలను నీ ద్వారా నడిపించే కృపను మాకు దయచేయుము. యేసయ్యా, మేము రాజులైన యాజక సమూహముగాను ఉంటూ, మా చుట్టూ ఉన్నవారికి నిరీక్షణ, స్వస్థత మరియు నీ ప్రణాళికను తీసుకొని వచ్చునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, ప్రతిరోజు నీ సొత్తుగా ఉండుటకు మేము నీకు లోబడి జీవించడానికి మరియు మా శరీరాన్ని నీకు పరిశుద్ధముగా మరియు అంగీకారయోగ్యమైన సజీవయాగముగా అర్పించడానికి మాకు సహాయం చేయుము. దేవా, ఈలోకాశలైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ద్వారా ఏ శోధన మమ్మును తాకకుండా చేయుము. ప్రభువా, మాకు సంబంధించిన ప్రతిదాన్ని పరిపూర్ణం చేయుము మరియు మా జీవితంలోని అన్ని రోజులు నీ హస్తము మా మీద ఉండునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.