2026 సంవత్సరము అనేది నిర్మించి అభివృద్ది పరచే సంవత్సరముగా ఉండును. ప్రభువు తన వాగ్దానములను డా. పాల్ దినకరన్ గారికి ప్రత్యక్షపరిచాడు, పునరుద్ధరణను, ఐక్యతను మరియు నూతన సంవత్సరములో తన ప్రజలపై పరిశుద్దాత్మ నూతన కుమ్మరింపును ఆజ్ఞాపించి ప్రకటించాడు.
  
2026 సంవత్సరము కొరకైన దేవుని వాగ్దానములు ఇలా ఉన్నవి :

1. ప్రభువు పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యూగముగు దేవుని ఆలయముగా మిమ్మును పునర్నిర్మించబోవుచున్నాడు  (1 కొరింథీయులకు 6:16,19;  రోమీయులకు 12:1,2) 

2. ప్రభువు మీ గృహమును మరియు మీ కుటుంబమును రక్షణ, సంబంధ బాంధవ్యాలలో  పునర్నిర్మించబోవుచున్నాడు  (1 కొరింథీయులకు 7:14; అపో.కా. 16:31) 
 
3. ప్రభువు మీ పేరును, స్థాయిని, స్థితిగతులను మరియు మీ ఆధిపత్యమును పునర్నిర్మించబోవుచున్నాడు  (యిర్మీయా 31:4) 
 
4. ప్రభువు మీపై మరియు మీ కుటుంబముపై తన పరిశుద్ధాత్మను కుమ్మరించబోవుచున్నాడు  (అపో.కా 2:17). 
 
5. ప్రభువు మీపై తన ప్రవచనాత్మక కృపను కుమ్మరించబోవుచున్నాడు, పరిశుద్ధాత్మ వరములు మరియు పరిశుద్ధాత్మ ఫలములు మీలో కార్యరూపం దాల్చుచుండగా దేవుని సేవ చేసేలా ఆయన మిమ్మును బలపరచబోవుచుచున్నాడు తద్వారా అద్భుతములు సంభవించి, క్రీస్తు స్వభావము ప్రత్యక్షపరచబడును మరియు పరలోకపు విషయములలో ఆత్మసంబంధమైన ఆశీర్వాదములలో నడిచెదము  (2 కొరింథీయులకు 3:18) 
 
 6. బోధకులు  (ప్రకటన 10:11) , మీడియా ప్రసంగీకులు మరియు గాయకులు, పేదలు మరియు అభాగ్యులకు సేవలు అందించేవారు, వ్యాపారస్తులు మరియు అంకుర వ్యాపారస్తులు (entrepreneurs), వైద్యులు, ఇంజినీర్లు. లాయర్లు మరియు సామాజిక కార్యకర్తలు వంటి ప్రజల హక్కుల కొరకు పోరాడేవారు, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూసేవారు వీరందరి మూలముగా తన ప్రవచనాత్మకృపను ప్రభువు అనుగ్రహిస్తాడు.      
  
7. క్రీస్తు నామమును మోసేవారు మరియు ప్రకటించేవారందరి మధ్యలో ఐక్యతా హృదయమును మరియు ఉద్దేశ్యమును ప్రభువు తీసికొనివస్తాడు; దేవుని సేవకులు అందరి మధ్యలో మంచి మరియు ఆహ్లాదకరమైన సంబంధము ఉండును.  
 
8. ప్రభువైన యేసు క్రీస్తు శరీరముగా ఐక్యపడుటకు కలిసిమెలిసి ముందుకు వచ్చుచున్న సంఘములు (churches) అన్నింటిపై దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు.
 
9. ప్రతి పరిచర్య అధిక సంఖ్యాకులగు ప్రజలతో నింపబడి, అధికమైన సమకూర్పు మరియు సంపూర్ణ సమాధానము కలిగియుండి వర్ధిల్లేలా దేవుడు పరిచర్యలపై ఆశీర్వాదమును ఆజ్ఞాపిస్తాడు.
 
10.  ప్రభువు తన సేవకులకు దైవిక కాపుదలను అనుగ్రహిస్తాడు.
 
11. దేశమంతటా లేదా భూలోకమంతటా సువార్త ప్రకటించు నిమిత్తము ప్రభువు మరియొకమారు తలుపులు తెరుస్తాడు.