పరలోకపు శాశ్వత బహుమానము కొరకు జీవించుట

నాకు ప్రశస్తమైన స్నేహితులారా, నిజమైన సమాధానము మరియు నిత్యము నిలుచు సంరక్షణ కలిగియుండే పరలోకము వైపునకు మన కన్నులను పైకెత్తు నిమిత్తము ప్రభువు మనలను ప్రేమతో పిలుచుచున్నాడు.

''చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము." (2 కొరింథీయులకు 5:1).

అవును, మనలో ఎవరైతే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నందు నమ్మిక ఉంచెదరో వారికి పరలోకములో ఒక నిత్యమగు నివాసము లేదా భవనము సిద్ధపరచబడినది. కాని ఎట్టి ప్రజల కొరకు శాశ్వతమైన బహుమానములను ప్రభువు సిద్దపరిచాడు?  దేవుని హృదయమును ఏ విధమైన జీవితము సంతోషపరుస్తుంది?

మత్తయి సువార్త 10:41–42 లో యేసు ఈ విషయమును గూర్చి మాట్లాడారు. మనము ఇప్పుడు ఈ మూడు పరలోకపు బహుమానములను గూర్చి మరియు వాటిని పొందుకొను జీవితములను గూర్చి చూద్దాం.

1. విశ్వాసముతో నిండిన శిష్యులకు : యేసును పూర్ణ  హృదయముతో వెంబడించుచు, జీవితములో ప్రతి విషయములో కూడా దేవుని వాక్యముచే తీర్చిదిద్దబడుటకు అనుమతించే వారే శిష్యులుగా పిలువబడతారు. దారితప్పించే లోకపు విధానములకు బదులుగా ప్రార్థన, రాజీపడుటకు బదులుగా పరిశుద్ధత మరియు అనుకూలతకు బదులుగా విధేయతను మనము ఎంచుకొనినపుడు ప్రభువు సంతోషిస్తాడు. అనుదినము ఆయనతో విశ్వాసపు నడకను కొనసాగించేవారిని ఆయన ఘనపరుస్తాడు.
'చీకటి పరిస్థితుల మధ్యలో కూడా మగ్దలేనే మరియ యేసుతో పాటుగా ఉన్నది. తన కృతజ్ఞతాభావము మరియు భక్తిభావము కారణముగా పునరుత్థానుడైన క్రీస్తుకు సాక్షిగా నిలిచిన మొట్టమొదటి ప్రజలలో తాను ఒకరిగా ఉన్నది.' (యోహాను 8:31, లూకా 8:2 & యోహాను 19:25)

2. నీతిమంతమగు జీవితమునకు : క్షమాపణ, తగ్గింపు, దయ మరియు పరిశుద్ధత ద్వారా అనుదిన జీవితములో క్రీస్తు స్వభావమును ప్రతిబింబించుటయే నీతికి అర్ధం. మనము నీతిలో దేవునికి పరిపూర్ణముగా సమర్పించుకొనినపుడు ఇతరులను బలపరచి, నడిపించే ఆత్మీయ అధికారమును ప్రభువు మనకు అప్పగిస్తాడు (దానియేలు 12:3).  

3. తన సేవకులైన ప్రవక్తలకు: ప్రవచనాత్మక పరిచర్య దేవుని కరుణను వెల్లడిపరుస్తుంది, విరిగిన జీవితములను పునరుద్ధరిస్తుంది మరియు ప్రభువు తమను మరచిపోలేదని ప్రజలకు జ్ఞాపకము చేస్తుంది. ఇది వ్యక్తులతో మాత్రమే ముగిసిపోదు కాని తన భారమును నగరములకు, దేశములకు మరియు నాయకులకు మోసికొనివెళ్లుటకు ప్రవచనాత్మక స్వరములను కూడా దేవుడు లేవనెత్తుతాడు.  (ఆమోసు 3:7, ప్రకటన 10:11, 1 కొరింథీయులకు 14:1 & 3, యిర్మీయా 1:10 & యోహాను 16:33).

'తన ప్రవచనాత్మక కృప పాస్టర్లు మరియు సువార్తికులపై మాత్రమే నిలిచియుండదు కాని ఉపాధ్యాయులు లేదా బోధకులు, విద్యా నాయకులు, మీడియా నిపుణులు, legal and statutory professionals, అంకుర వ్యాపారవేత్తలు, వ్యాపారులు, పేదలకు సేవచేస్తూ న్యాయము కొరకు నిలబడేవారు వీరందరిపై కూడా ప్రవచనాత్మక కృప నిలిచియుంటుంది. ఈ అంత్య దినములలో ఆయన మహిమ కొరకు గొప్ప కార్యములు సాధించుటకు చిన్నారులు కూడా దేవుని ఆత్మతో నింపబడెదరు.'

మనము యేసును వెంబడించుచుండగా, ఆయన ప్రేమను ప్రతిబింబించుచుండగా మరియు ఇతరులను ఆయనకు దగ్గరగా నడిపించుచుండగా ప్రభువు మన విశ్వసనీయతకు ఈ లోకములో మరియు నిత్యములో కూడా బహుమానము అనుగ్రహిస్తాడు.

'నా ప్రియ పరలోకపు తండ్రీ, మీతోపాటుగా విశ్వాసపు నడకను నడిచేలా మరియు మీ శాశ్వత బహుమానములు పొందుకొనుటకు అర్హత కలిగిన జీవితములను జీవించేలా మీ బిడ్డలను ఆశీర్వదించండి. వారు ఇతరులకు దీవెనగా ఉండేలా నీతి మరియు పరిశుద్దాత్మ శక్తితో వారిని నింపండి. మీ పరలోకపు సమాధానము, కటాక్షము మరియు ప్రవచనాత్మక కృప వారి జీవితములలో ఎల్లప్పుడు నిలిచియుండునుగాక! యేసు మాహాత్మ్యము కలిగిన నామములో నేను ప్రార్థించుచున్నాను. ఆమెన్.'  

 

సిఓఓ గారి కార్యాలయము నుండి
మీ కారణముగా - మే నెలలో పరిచర్యలో కనుపరచబడిన ప్రభావము

గత నెలలో దినకరన్ గారి కుటుంబ సభ్యులు వివిధ కూటములలో మరియు ఔట్రీచ్ పరిచర్యలలో సేవలను అందించారు, హృదయములు తాకబడినవి, కుటుంబములు ఆదరణ పొందుకొన్నవి మరియు పరిశుద్ధాత్ముడు బలమైన నదివలె ప్రవహించగా జీవితములు మార్పునొందినవి. మీయొక్క ప్రేమతో కూడిన ప్రార్థనలు మరియు ఉదారమైన సహకారమునుబట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. గడిచిన నెలలో మాత్రమే మేము 3 కోట్ల 52 లక్షల ప్రార్థన విన్నపముల కొరకు పరిచర్య సేవలు అందించాము మరియు అనేక జీవితములను ఆశీర్వదించాము.

  • ప్రార్థన గోపురము పరిచర్య ద్వారా 1.3 లక్షల మంది ప్రజలు ప్రార్థనలను పొందుకొన్నారు మరియు నేరుగా ప్రోత్సహింపబడ్డారు.
  • తమ అవసరతల సమయములో 3.9 లక్షల ప్రశస్తమైన జీవితములకు టెలిఫోన్ ప్రార్థన గోపురము పరిచర్య చేసింది.
  • ఉత్తరములు మరియు ఈ-మెయిళ్ల ద్వారా 59,100 మంది ప్రజలు తాకబడ్డారు.  
  • డయల్-ఏ.ప్రేయర్ కాల్స్ మూలముగా 13,500 మంది ప్రజలు బలము మరియు నిరీక్షణను పొందుకొన్నారు.
  • జీసస్ కాల్స్ వెబ్ సైట్ మరియు మొబైల్ యాప్ మూలముగా 2.2 మిలియన్లకు పైగా ప్రజలు పరిచర్య సేవలు పొందుకొన్నారు.
  • సామాజిక మాధ్యమము వేదికలు 3.24 కోట్ల వీక్షకులకు చేరువైనవి, జీవితములు మరియు కుటుంబములను నిరీక్షణ మరియు క్రీస్తు ప్రేమతో ప్రభావితము చేసినవి.  
  • డైనమిక్ కిడ్స్ క్యాంప్ ద్వారా 20,000 మంది చిన్నారులు దీవింపబడ్డారు.

 

కారుణ్య విశ్వవిద్యాలయము
క్రీస్తు కేంద్రీకృతమైన విద్య ద్వారా జీవితములను మార్పునొందించుచున్నాము)

  • 2026 సంవత్సరము ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 90 శాతం మంది ప్రాంగణములో జరిగిన ఇంటర్వ్యూల మూలముగా ఉద్యోగము పొందుకొన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగమునకు చెందిన ఒక విద్యార్థి Vasco Maritime లో 19.56 LPA package తో ఉద్యోగము పొందుకొన్నాడు.  
  • Cognizant నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన “Technoverse Hackathon 2026” లో “Drug Repurposing” విషయమై తమ innovation కు కారుణ్య విద్యార్థి బృందము second runner-up గా నిలిచి Rs.1 Lakh నగదు బహుమతిని గెలుచుకున్నారు.  
  • life saving applications and a smart Cradle device for baby monitoring కొరకు portable low cost CPAP ను అభివృద్ధి చేయుట ద్వారా కారుణ్య అధ్యాపక బృందమునకు రెండు పేటెంట్లు ఇవ్వబడినవి.
  • Nine Karunya students are pursuing their semester abroad program at University of Alicante - Spain, Cape Breton University – Canada, Vilnius University – Lithuania, Woosong University – South Korea undertaking advanced courses on Automation and Robotics as well as involved in joint projects with the professors.
  • కారుణ్య విశ్వవిద్యాలయములో 2026 సంవత్సరము కొరకైన ప్రవేశములు తొందరలో ముగుస్తున్నవి www.karunya.edu ను సందర్శించండి.


సీషా
(సంతోషమును వ్యాపింప జేయుచు ప్రకాశమానమగు భవిష్యత్తును నిర్మించుచున్నాము)

  • పేద యువతకు సమగ్ర నైపుణ్యతల అభివృద్ధి మరియు ఉద్యోగ అవకాశముల కార్యక్రమమును చెన్నైలోని వానగరం లో  ఆరంభించాము తద్వారా వారికి AI, life skills, soft skills and employability విషయమై market-relevant skills ను అందించుచున్నాము.
  • సీషా యొక్క ఉత్తర భారత project locations లో ఉన్న వెనుకబడిన సమాజములకు చెందిన 755+ చిన్నారులు దుస్తులు మరియు స్కూల్ కిట్లను పొందుకొన్నారు.
  • The Centre for Well-Being 107 మంది రోగులకు counseling support ను అందించింది మరియు 68 trainees రాంచీలో నిర్వహింపబడిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమములలో తమ శిక్షణను విజయంతముగా ముగించుకొని సర్టిఫికెట్లను పొందుకొన్నారు.


జూన్ నెలలో పరిచర్య  

హైదరాబాదు ప్రార్థన గోపురమును మనము నిర్మిద్దాం: ప్రార్థనలు మరియు దైవిక సలహాల కొరకు వస్తున్న ప్రజల సంఖ్య అధికమగుచున్నందున మేము హైదరాబాదు లో ఒక పెద్దదైన నూతన ప్రార్థన గోపురమును నిర్మించుచున్నాము. ఈ ప్రార్థన గోపురము ద్వారా ప్రతి సంవత్సరము 1.2 లక్షల మంది విరిగినలిగిన హృదయులు మరియు పీడిత ప్రజలను దీవించాలనేది మా హృదయ స్పందనైయున్నది. ఈ జూలై నెల దీనిని ఆరంభించాలని మేము ఉద్దేశించియున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి అంతస్థు పూర్తియైనవి. మిగిలిన పనులు -  ప్రార్థన ఆడిటోరియంలు, ఛాపెల్, కౌన్సిలింగ్ మరియు ప్రార్థన గదులు మరియు టెలిఫోన్ ప్రార్థన గోపురము కొరకు సౌకర్యములు నిమిత్తము రూ. 5 కోట్లు మొత్తము అవసరమైయున్నది.

కావున లెక్కింపశక్యముకాని సంఖ్యలో గాయపడిన జీవితములకు నిరీక్షణ అందించు ఒక ఆశ్రయమును నిర్మించుటలో స్పాన్సర్ లేదా కో-స్పాన్సర్ చేయుటకు ముందుకు వచ్చుట ద్వారా ఈ ఉదాత్తమైన లక్ష్యము కొరకు మాతో చేరండి. ఆయా గదులలో మరియు ఛాపెల్ లో మీ పేర్లు డిస్ప్లే చేయబడును. ఈ లింక్ ద్వారా కూడా మీ సహకారమును అందించవచ్చును. https://bit.ly/HYDPTBF  

ప్రార్థన గోపురముల ఔట్రీచ్ కూడికలు :

  • జూన్ 13 - త్రివేండ్రం ప్రార్థన గోపురము Nedumangad లో నిర్వహించు ఔట్రీచ్ కూడిక
  • జూన్ 20 - చిత్తూరు ప్రార్థన గోపురము Palamaner లో నిర్వహించు ఔట్రీచ్ కూడిక  
  • జూన్ 27 -  అన్నా నగర్ ప్రార్థన గోపురం Red Hills, Chennai లో నిర్వహించు ఔట్రీచ్ కూడిక  

ఈ ప్రాంతములలో లేదా వీటి చుట్టుపట్ల ప్రాంతములలో మీరు నివాసమున్నయెడల మీకు దగ్గరలో గల ప్రార్థన గోపురముతో అనుసంధానమై ఈ కూడికలలో పాల్గొనండి.

యేసు అవసరమైన ప్రజలకు సహాయము చేయుటకై ఈ లక్ష్యము కొరకు ప్రార్థించండి మరియు ఇందుకొరకు మీ చేయూత నివ్వండి. మనము కలిసిమెలిసి సువార్తను భూదిగంతముల వరకు వ్యాపింపజేసెదము మరియు ప్రజల జీవితములలో ఒక వ్యత్యాసమును తీసుకొనివచ్చెదము. www.jesuscalls.org ను సందర్శించండి.

యేసు పిలుచుచున్నాడు ద్వారా ప్రభువు మిమ్మును ఏవిధముగా ఆశీర్వదించాడు అను విషయమై మీ సాక్ష్యములను మాతో ఈ లింక్ లో పంచుకొనగలరు. https://www.jesuscalls.org/testimony