నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 సమూయేలు 1:17వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "అంతట ఏలీ, నీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పెను'' ప్రకారము ఈ మాటలు ప్రధాన యాజకుడైన ఏలీ, హన్నా అనే ఒక స్త్రీతో చెప్పెను. హన్నాకు సంతానము లేదు. కానీ, ఆమె భర్త ఆమెను ఎంతగానో ప్రేమించాడు. అయినను ఆమెకు అస్సలు సంతానం కలుగలేదు. కనుకనే, హన్నా ఒంటరిగా దేవుని మందిరానికి పరిగెత్తుకొని వెళ్లి, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకొనెను. ఆమె తన దుఃఖాన్ని, అవమానాన్ని భరించలేకపోయెను. కాబట్టి, సరిగ్గా అదే సమయంలోనే యాజకుడైన ఏలీ ఆమెతో ఈ వాగ్దానం చేసెను: " నీవు క్షేమముగా వెళ్లుము; నీవు నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించావు. దేవుని ఆశీర్వాదాలను అనుభవించడానికి సమాధానముతో వెళ్లుము'' అని చెప్పాడు. నా ప్రియులారా, మీరు దేవుని క్షేమమును మరియు జవాబును పొందకుండా ఉండలేరు, ఇంకను మీరు దేవుని ఆశీర్వాదాలను పొందుకొనకుండా ఉండలేరు. ఎందుకంటే, దేవుడు ప్రార్థనలకు ఆలకించే దేవుడైయున్నాడు. అందుకే ఏలీ, హన్నాను చూచి, " ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన నీకు దయచేయును గాక అని ఆమెతో చెప్పెను.'' కనుకనే, మీరు కూడా దేవునికి చేసిన ప్రతి మనవిని ఆయన ఆలకించి, తప్పకుండా మీకు జవాబును ఇస్తాడు.

అందుకే బైబిల్ నుండి యోహాను 14:13-14వ వచనములలో చూచినట్లయితే, యేసు ఇలాగున సెలవిచ్చియున్నాడు, " నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును '' మరియు యోహాను 16:24వ వచనములో కూడా చూచినట్లయితే, యేసు," ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును'' అని సెలవిచ్చియున్నాడు. అందువలన నా ప్రియులారా, నేడు మీరు తండ్రిని అడిగినదంతయు మీకు నిశ్చయముగా అనుగ్రహించబడుతుంది. ఇంకను మీ పరలోకపు తండ్రిని మీరు అడిగినదంతయు మీకు తప్పకుండా దయచేస్తాడు. కాబట్టి, నా స్నేహితులారా, దేవుడు మిమ్మును ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికి ఏర్పరచుకొనియున్నాడని నమ్మండి. దేవుడు ఆ హృదయాన్ని హన్నాకు దయచేసియున్నాడు. ప్రజలకు ఒక ఆశీర్వాదాన్ని అందించడానికి దేవుడే తనను పిలిచాడని ఆమె నమ్మింది. అందుకే ఆమె ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త అయిన సమూయేలును కనెను, సమూయేలు రాజులను అభిషేకించు ఒక ప్రవక్తగా మారెను. అవును, నా ప్రియులారా, అందుకే ఏలీ, 'హన్నా, నీవు యెహోవాను ఏమి అడిగియున్నావో, ఆయన అది నీకు అనుగ్రహించును గాక' అని తెలియజేసెను. ఆమె దేవుని కేవలం ఒక బిడ్డను మాత్రమే కాకుండా, ఒక ప్రవక్తను అడిగిందని నేను నమ్ముచున్నాను. అందుకే ఆమె ఒక దేవుని ప్రవక్తకు జన్మనిచ్చింది.

అవును, నా ప్రియులారా, ఆలాగుననే, మీరు కూడా దేవుని ప్రవచనములను మరియు దేవుని ప్రవక్తలను వెలుగులోనికి తీసుకువచ్చెదరు. అదే ఇప్పుడు యేసు పిలుచుచున్నాడు దర్శనమై యున్నది. ప్రభువు నాతో ఇలాగున తెలియజేసెను, 'ఇకపై అది కేవలం నా కుమారుడైన దినకరన్‌తోనే కాదు ' అని చెప్పారు. ఆలాగుననే, 2008వ సంవత్సరంలో, నా తండ్రిగారైన సహోదరులు దినకరన్‌గారు మరణించినప్పుడు ఆయన ఈ మాట చెప్పారు. ప్రభువు ఇలాగున తెలియజేశాడు, 'ఈనాటి నుండి నేను లోకంలోని సమస్త మానవాళిపై నా ఆత్మను కుమ్మరిస్తాను మరియు ఆ శక్తిలో నడవడానికి కావలసిన కృపను నేను నీకు అనుగ్రహిస్తాను. నేను దర్శనములను చూచు యువతను లేవనెత్తబోవుచున్నాను, మరియు మీ కుమారులు, కుమార్తెలు, అంటే తమ తరంలో, తమ జీవితంలో మొదటిసారిగా నన్ను ప్రభువుగా అంగీకరించేవారు ప్రవచించెదరు' అని సెలవిచ్చెను. నా ప్రియులారా, ఈ పరిచర్య ద్వారా ప్రభువును అంగీకరించే ప్రతి ఒక్కరూ ప్రవచించెదరు. ఎందుకంటే, బైబిల్ నుండి ప్రకటన 19:10వ వచనమును చూచినట్లయితే, "అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు వద్దు సుమీ. నేను నీతోను, యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము'' అని యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాత్మకమైనది నాకు వివరించెను. అవును, ప్రవచన ఆత్మయే యేసు యొక్క సాక్ష్యమని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. అందుకే, నీతితో దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి రాజులను అభిషేకించు ప్రవక్తలుగా సమూయేలును లేవనెత్తడము అనునది యేసు పిలుచుచున్నాడు పరిచర్య కొరకు దేవుని యొక్క ఉద్దేశమై యున్నది. అది, యేసు పిలుచుచున్నాడు భాగస్థులుగాను, కారుణ్య మరియు సీషా భాగస్థులుగాను, మీరు ప్రవక్తలను మరియు అపొస్తలులను లేవనెత్తడానికి, నిరుపేదలైన పిల్లలను పోషించడానికి, మానవాళి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి మరియు దేవుని ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్లడానికి మాతో కూడా నిలువబడియున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. నా ప్రియులారా, దేవుడు హన్నాకు జవాబిచ్చినట్లుగానే, దేవుడు మీకు కూడా జవాబిచ్చుచున్నాడు. తద్వారా, మీరు ఆశీర్వదించబడుదురు మరియు మీ పిల్లలు వర్థిల్లుదురు. మీరు ఉన్నత స్థానమునకు ఎదుగుదురు. దేవుని హస్తము మీ మీదికి దిగివచ్చును. ఇప్పటివరకు మీరు ప్రార్థించిన విన్నపములన్నిటికిని దేవుని యొద్ద నుండి ప్రతిఫలములు మరియు జవాబులు మీకు లభించును గాక. ప్రభువు మీకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన సేవలో తిరిగి సమర్పించడానికి మీరు నిబంధన చేసుకుంటున్నప్పుడు, లేఖనం చెప్పినట్లుగానే, " నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము '' అని మీరు చెప్పినప్పుడు, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మీ మనవులను ఆలకించి, మీకు జవాబును ఇచ్చి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్య, హన్నా వలె మేము మా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించుచున్నాము. దేవా, ఈ రోజు మాకు నీ నుండి జవాబును మరియు వాగ్దానము ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మేము హన్నా వలె నీ సన్నిధిలో మా మనవులన్నిటిని కుమ్మరించుచున్నాము, అడుగుచున్నాము, మా సంతోషమును పరిపూర్ణము చేయుమని వేడుకొనుచున్నాము. దేవా, ఇప్పుడే, నీ చిత్తం ప్రకారం మాప్రార్థనలకు జవాబును దయచేయుము. ప్రభువా, మా యొక్క ప్రతి బంధకములతో బంధింపబడియున్న మా జీవితము నుండి మేము విడుదల పొందునట్లుగా మాకు నీ కృపను దయచేయుము మరియు మా జీవితములో నీ ఉన్నత ఉద్దేశములను నెరవేర్చుము. యేసయ్య, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము దేవా, మా తరములన్నియు నీకు మరియు ప్రజలకు సమూయేలువలె ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మమ్మును ఉపయోగించుకొనుము. ప్రభువా, మేము ప్రవచనాత్మకముగా నింపబడు కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మా జీవితములో మేము పొందుకోలేని సమస్తమును హన్నా వలె మేము యేసు నామమున పొందుకొనునట్లుగా మాకు సహాయము చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.