నా ప్రియ స్నేహితులారా, నూతన మాసములో అడుగుపెట్టిన మీకు శుభములు తెలియజేయుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహోషువ 1:6వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యా దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు'' అని చెప్పబడిన ప్రకారము ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రజలు, వారి యొక్క స్వాస్థ్యమును పొందుకొనుట కొరకు వారు సిద్ధముగా ఉండిరి. అందుకు యెహోషువ వారిని నడిపించాలి. 'పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మిమ్మును తీసుకొని వచ్చెదను' అని ప్రభువు చేసిన వాగ్దానమును ఆయన నెరవేర్చబోవుచున్నాడు. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనుటకై శత్రువులతో పోరాడాలి. ఆ దేశములో ఎంతో బలవంతులు ఉండి ఉండవచ్చును. కనుకనే, ఇశ్రాయేలీయులు వారిని చూచి భయపడి ఉండవచ్చును. వారు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి. కనుకనే, ఇశ్రాయేలీయులు వారి శత్రువులను చూచి ఎంతగానో భయపడి ఉండవచ్చును. కాబట్టి, యెహోషువ కూడా కదిలింపబడియుండవచ్చును. అతనిలో భయము ఆవరించియుండవచ్చును. అందుకే యెహోషువ 1:5వ వచనములో చూచినట్లయితే, ప్రభువు యెహోషువతో ఈ విధంగా అంటున్నాడు, "నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును, నిన్ను విడువను నిన్ను ఎడబాయను,'' అని ప్రభువు వాగ్దానము చేసియున్నట్లుగానే నేడు మీతో కూడా ఈ నూతన మాసమంతయు మరియు రాబోవు దినములలో కూడా మీతో కూడా ఉంటాడు.
యెహోషువ మోషేతో పరిచర్య చేసిన సమయమంతటిలోను దేవుడు అతనికి తోడుగా ఉండెను. పరిచర్య యొక్క విషయములన్నిటిని యెహోషువ ఎరిగియుండెను. మోషేతో యెహోషువ కూడా పరిచర్య చేశాడు కాబట్టి, ప్రభువు అతనిని బలపరచాడు. కనుకనే, మోషే మీద ఉన్నటువంటి కృప యెహోషువ మీదికి దిగివచ్చెను. కాబట్టి, నా ప్రియులారా, దైవజనులకు మనము పరిచర్య చేసినప్పుడు మనకు వచ్చు దీవెన ఇదియే అయి ఉంటుంది. ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించడానికి ప్రభువు తన కృపలో యెహోషువను ఎన్నుకొనియున్నాడు. 'ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండుమని' ప్రభువు మరల మరల అతనితో చెప్పియున్నాడు. అందుకే బైబిల్ నుండి యెహోషువ 1:9వ వచనములో ప్రభువు ఈలాగున చెప్పియుండుట మనము చూచినట్లయితే, " నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును'' అని దేవుని యొక్క ధైర్యముతో కూడిన ఈ ఆజ్ఞ విన్న తర్వాత యెహోషువాకు ఎంత ధైర్యము వచ్చియుండవచ్చును కదా! దేవుని సన్నిధిలో నుండి మనకు నిబ్బరము మరియు ధైర్యము కలిగియుంటుంది. ఒక నాయకునికి ఉండవలసిన పునాది ధైర్యము అయి ఉంటున్నది. ఒక నాయకునిగా మనము ఎల్లప్పుడు దేవుని సన్నిధిని కలిగియుండాలి. నా ప్రియులారా, దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా చులకనగా తీసుకొనకూడదు. మనము ఎక్కడికి వెళ్లినను లేక మనము ఏమి చేసినను, మనము చేయుచున్న ప్రతి పనిలోను యేసయ్యను మనము ప్రతిబింబించవలెను. ఇది కేవలము దేవుని వాక్యము మూలముగానే వస్తుంది. దేవుని వాక్యమును ఎంత అధికముగా చదువుతామో, మనము దేవుని సన్నిధిని అంత అధికముగా పొందుకొనగలము. ప్రభువునకు సమీపముగా ఎలా మారగలుగుచున్నారు అని ప్రజలు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నా ప్రియ స్నేహితులారా, ఇది మాత్రమే మనకు మార్గమై యున్నది.
నా ప్రియ స్నేహితులారా, యెహోషువ దేవుని వాక్కుల మీద ఆధారపడియున్నాడు. అతను ఏమి చేయాలో, ప్రభువు అతనికి తదేకముగా చెబుతూనే ఉన్నాడు. అందుకే బైబిల్ నుండి యెహోషువ1:7వ వచనములో చూచినట్లయితే, "అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగా నుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దాని నుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు'' అని చెప్పబడినట్లుగానే, మీరు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు మీరు దాని నుండి కుడికిగాని యెడమకుగాని తొలగకుండా ఉన్నట్లయితే, అప్పుడు మీరు చేయు పనులన్నిటిలో మీకు విజయమును పొందుకుంటారు. మా తండ్రిగారు మరణించిన తర్వాత, మా భర్తగారి యొక్క తండ్రిగారైనటువంటి సహోదరులు డి.జి.యస్ దినకరన్‌గారు మా తమ్ముడికి ఈలాగున సలహాలు చెప్పేవారు. మా చిన్న తమ్ముని పేరు ఆనంద్. అయితే, ఆయనగారు, మా తమ్మున్ని, తనను ఎంతో ప్రేమగా, కుట్టిపయ్యా అని పిలిచేవారు. కుట్టిపయ్య అనగా, 'చిన్న అబ్బాయి,' అని పిలిచేవారు. 'నా ప్రియ కుమారుడా, ఆనంద్, దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొనవలెను' అని చెప్పేవారు. ఇంకను, ' నీవు దేవుని వాక్యమును చదవకుండా నీ యింటి నుండి నీవు బయటకు వెళ్లకూడదు. నీవు ఒంటరిగా మిగిలిపోయావు అని నీవు అనుకొనవచ్చును, అయితే, నీవు దేవుని వాక్యమును ఎంతో గట్టిగా హత్తుకున్నప్పుడు, దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో నిన్ను నడిపిస్తాడు. ఆలాగుననే, నీ జీవితములో నీవు విజయవంతముగా ఉంటావు' అని చెప్పారు. ప్రజలు ఎప్పుడైనను మా తండ్రిగారిని వారి బైబిల్ ఇచ్చి వ్రాయమని కోరినప్పుడు, అనేకసార్లు ఇదే వాక్యమును మా తండ్రిగారు వ్రాయడము నేను గమనించియున్నాను. మీరు దేవుని వాక్యము నుండి కుడికిగానీ, యెడమకుగానీ, తొలగిపోకుము. అప్పుడు మీరు చేయు సమస్తము కార్యములలోను విజయమును పొందుకుంటారు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము ప్రభువు యొక్క సన్నిధానమును మీ యొద్దకు తీసుకొని వస్తుంది. అప్పుడు మీరు ఒక సింహము వలె ఎంతో ధైర్యమును పొందుకుంటారు. అందుకే బైబిల్ నుండి సామెతలు 28:1వ వచనములో చూచినట్లయితే, " ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు'' ప్రకారము మనము ధైర్యముగా ఉంటారు. కనుకనే, మీరు ప్రతిరోజు దేవుని వాక్యమును క్రమము తప్పకుండా చదవండి, అప్పుడు దేవుడు మీ జీవితమును విజయవంతముగా మారుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ప్రతిరోజు నీ వాక్యము ద్వారా మాతో నీవు మాట్లాడుము. ప్రభువా, నీ వాక్యము ద్వారా మేము జీవించునట్లుగా సహాయము చేయుము. యేసయ్యా, మనుష్యుడు రొట్టెవలన మాత్రము జీవించడు, కానీ, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని చెప్పినట్లుగానే, దేవా, నీ నోట నుండి వచ్చు ప్రతి మాటను మమ్మును ఇప్పుడే జీవింపజేయునట్లుగా చేయుము. తండ్రీ, మేము అనేక భయములను ఎదుర్కొంటుండవచ్చును. కనుకనే, ఇప్పుడే నీ యొక్క హస్తము మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ వాక్యముతో వర్థిల్లునట్లుగా నీ వాక్యముతో మమ్మును నింపుము. దేవా, ప్రతిరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము, నీ వాక్యము ద్వారా మేము జీవించునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నీ వాక్యమును గట్టిగా పట్టుకొని జీవించుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, మేము చేయు ప్రతి పనులన్నిటిలోను మరియు ప్రయత్నములన్నిటిలోను నీవు మమ్మును వర్థిల్లింపజేయుము. దేవా, మా చేతి పనులన్నిటిని నీవు ఆశీర్వదించుము. తండ్రీ, మేము ఎక్కడికి వెళ్ళినా మాతో ఉంటానని నీవు ఇచ్చిన వాగ్దానానికి వందనములు. దేవా, భయం మా హృదయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, బలంగా మరియు ధైర్యంగా ఉండాలని మాకు గుర్తు చేసినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, దయచేసి నీ సన్నిధితో మమ్మును చుట్టుముట్టుము మరియు నీ వాక్యం నుండి కుడి వైపుకు లేదా ఎడమ వైపుకు ఎప్పుడూ తొలగిపోకుండా ఉండుటకు మాకు సహాయం చేయుము. దేవా, ప్రతిరోజు నీ వాగ్దానములను హత్తుకొని ఉండునట్లుగాను, మాకు నేర్పించుము. యేసయ్యా, మేము నిరాశగా మరియు ఒంటరిగా ఉన్న సమయాలలో కూడా నీ యొక్క ప్రేమగల హస్తముతో మమ్మును నడిపించుము. బైబిల్‌లో నీవు యెహోషువను బలపరచినట్లుగానే నీ కృప మమ్మును బలపరచునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును నీతిమంతులనుగాను మరియు సింహము వలె ధైర్యంగా ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


