నా ప్రియ స్నేహితులారా, నేటి దినమున మేలైనది మనము కనుగొనుచున్నాము. ఆయన ఇప్పుడే మన యొద్దకు వచ్చియున్నాడు. మీరు దేవుని వాక్యమును వెదకచుండగా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 20:29వ వచనమును మీరు కనుగొనవచ్చును. ఆ వచనము, "యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.'' అవును, యేసు ఈ సంగతిని తన శిష్యుడైన తోమాతో ఈ రీతిగా సెలవిచ్చియున్నాడు, "తోమా నీవైతే, నీవు నమ్మడము కోసమై నా గాయములను తాకవలెనని కోరుచున్నావు. కానీ, నన్ను చూడకపోయినను, నా యందు విశ్వాసముంచియున్నవారు ధన్యులు'' అని చెప్పెను. నా ప్రియులారా, మనము కూడా అటువంటి స్థానములోనే ఉండియున్నాము. ప్రభువైన యేసునందు మనము విశ్వాసముంచుటకు కారణము, మన యొక్క విశ్వాసము మాత్రమే. కనుకనే, మీరు ఆయనను చూచి యుండకపోయినప్పటికిని, మీరు యేసును అంటిపెట్టుకొనియున్నారు. మీ జీవముతో ఆయనను మీరు నమ్మియున్నారు. ప్రభువు మిమ్మును బట్టి ఎంతగానో ఆనందించుచున్నాడు. కనుకనే, ఆయన మిమ్మును నిర్ఘాంతపోవుచున్నాడు, ఇంకను మీ విశ్వాసమును చూచి ఆశ్చర్యపడుచున్నాడు. 'నా కుమారుడా, నన్ను చూచియుండలేదు, నా కుమార్తె, నన్ను చూచియుండలేదు. అయిన్పటికిని, మీరు నా యందు నమ్మిక యుంచియున్నారు.' నా ప్రియులారా, ఈ రోజున అట్టి విశ్వాసముచేత, మీరు ప్రభువైన యేసుక్రీస్తు నొద్దకు వచ్చియున్నారు. కనుకనే, మీరు అద్భుతములను చూచెదరు.
ఈ మాటను ఒక స్త్రీ ఈ రీతిగా తెలియజేసియుండెను. తన యొక వివాహములో పది సంవత్సరముల పాటు ఆమెకు సంతానము కలుగకపోయినందు న, ఆమె యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు వచ్చియున్నారు. వైద్యులైతే, గర్భము దాల్చడానికి ఆవకాశము లేదు అని చెప్పారు. ఇంకను వైద్యపరంగా అది అసాధ్యమని చెప్పారు. ప్రజలైతే, ఆమె యొక్క భర్తగారికి మరియొక స్త్రీని వివాహము చేసుకొనమని చెప్పారు. అప్పుడు మాత్రమే మీకు పిల్లలు పుడతారు అని చెప్పియున్నారు. కానీ, ఆమె యొక్క భర్తయైతే, 'దేవుడే నిన్ను నాకు అనుగ్రహించియున్నాడు. ఆయన మనకు అద్భుతమును జరిగిస్తాడు. ఆయన మన కోసము ఆశ్చర్యకార్యములను జరిగిస్తాడు' అని చెప్పాడు.
కనుకనే, అతనిలో దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ యొక్క విశ్వాసము మహా అద్భుతమైనది. వారు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు వెళ్లి, అక్కడ వారు ప్రార్థన యోధుల ద్వారా ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన యోధులు, 'మీరు నమ్మకముతో వెళ్లండి, దేవుడు మీకు సంతానమును కలుగజేస్తాడు' అని ఖచ్చితముగా చెప్పియున్నారు. ఆ నెలలోనే ఆమె గర్భమును దాల్చారు. ఆమె ఒక చక్కటి మగ బిడ్డకు జన్మనిచ్చెను. వారు ఎంతగానో ఆశ్చర్యచకితులవుతూ, ప్రభువును స్తుతించియున్నారు. అవునండి, నా ప్రియులారా, నేడు మీరు ఆయనను చూడలేదు, అయినను, మీరు ఆయన యందు విశ్వాసముంచియున్నారు. ఈ రోజున మీరు ఆయన జరిగించు అద్భుతములను చూచెదరు. ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివాసము చేయువాడై యున్నాడు. కనుకనే, మీరు ఆయనను అనుభూతి చెందెదరు. కనుకనే, మీరు ఇంతవరకు ఆయన యందు విశ్వాసమును కలిగియుండనట్లయితే, ఇప్పుడే, మీరు ఆయన యందు విశ్వాసముంచినట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా చూడక నమ్మిన మీరు ధన్యులుగా ఉండుట మాత్రమే కాదు, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు వచ్చి, మా హృదయములోపల నివాసము చేయుము. దేవా, నీయందు నమ్మికయుంచిన మా జీవితములలో అద్భుతములను జరిగించుచున్నందుకై నీకు వందనములు. దేవా, నీవు మమ్మును నీ ఆత్మతో నింపుచున్నందుకై నీకు వందనములు. యేసయ్యా, మేము నిన్ను చూడకపోయినప్పటికిని, నీవు మాకు నీ ఆత్మను అనుగ్రహించియున్నందుకై నీకు వందనములు. దేవా, మా హృదయములోపల నీవు నివాసము చేయుము. ప్రభువా, నీవు మా యెడల నీవు కలిగియున్న గొప్ప ప్రేమను, సంతోషమును మేము అనుభూతి చెందునట్లుగా మాకు నీ కృపను చూపించుము. ప్రభువా, మేము నీ యందు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగియుంటూ, నీకు మొఱ్ఱపెట్టుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా యొక్క మొఱ్ఱలకు జవాబును ఈ రోజు దయచేసి, ఇప్పుడే, మా శరీరములను తాకి మాకు స్వస్థతను దయచేయుము, ఇప్పుడే, మాకు కూడా సంతాన భాగ్యమును దయచేయుము. ప్రభువా, మేము నీకు మొరపెడుతున్న విశ్వాసాన్ని దయచేసి చూడుము. దేవా, మాకు జవాబును ఇచ్చి, మా కొరకు ఇప్పుడే ఒక అద్భుతమును జరిగించుము. ప్రభువా, మేము నీ యందు మా యొక్క పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పుడు, ఈ క్షణంలో నీవు మా కొరకు ఒక అద్భుతం చేయుచున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మేము నిన్ను నమ్మాను కాబట్టి, మేము నిన్ను చూడనప్పటికీ, నీవు మా జీవితములో జరిగించి నీవు మమ్మును ఘనపరచుమని యేసుక్రీస్తు యొక్క గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


