నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయమున మిమ్మును పలకరించడం నాకెంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 89:17వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది '' ప్రకారం దేవుడు నేడు మీ పట్ల దయను చూపించాలని కోరుచున్నాడు. అవును, నా ప్రియులారా, కొమ్ము మనకు ఏ విధంగా హెచ్చింపును తీసుకొని వస్తుందో సూచించబడినది. అవును, కొమ్ము ఘనతను తీసుకొని వస్తుంది. కొమ్ము ఘనతను సూచిస్తుంది. అవును, ఈ రోజు ప్రభువు మీ కొమ్మును హెచ్చింపజేయబోవుచున్నాడు మరియు మీకు దయను అనుగ్రహించబోవుచున్నాడు. ఈ రోజు ఒకవేళ మీరు, 'నేను ఎవ్వరికి కనిపించకుండా ఈ రోజు ఉంటున్నాను, నేను ఉన్నాను అని ఎవ్వరికి తెలియడము లేదు, నాకు అనుకూలముగా ఏదియు జరగడము లేదు.' కానీ, ఈ రోజు ప్రభువు తన దయను మీ యెడల కనుపరచబోవుచున్నాడు. మిమ్మును లేవనెత్తబడబోవుచున్నాడు. కనుకనే, మీరు ప్రభువునందు ఆనందించండి.

వాసుకి అను ప్రియ సహోదరి జీవితములో అదేవిధముగా జరిగినది. తను చెన్నైలో నివసించుచుండెను. తనకు వివాహము జరిగి ముగ్గురు పిల్లలుఉన్నారు. 2007 సంవత్సరములో ఆమె భర్త మృతి చెందాడు. కాబట్టి, ఆ పిల్లలందరిని, ఆమె తానే వారిని పెంచి పోషించవలసి వచ్చినది. నేను ఒక్క దానిని ఏలాగున వీరిని పెంచి పోషించగలను? నేను ఒక్క దానిని ఎలా చేయాలి? అని ఏడ్చుచుండెను. తద్వారా, తన నిరీక్షణ అంతయు కోల్పోయినది. ఆ తరువాతి సంవత్సరము 2008లో యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో జరుగుచున్న ఒక కూడికను గురించి తెలుసుకొనెను. ఆ కూడిక అనంతరము సహోదరి ఇవాంజెలిన్ పాల్ దినకరన్‌గారు వర్తమానమును అందించి, ప్రజల కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. ఆ కూడిక అనంతరము సహోదరి ఇవాంజెలిన్‌గారి యొద్దకు వెళ్లి ఆమె తన పరిస్థితిని చెప్పి ప్రార్థించుకున్నారు. ప్రార్థన అనంతరము ఒక దాని వెంబడి ఒకటి ఆమె జీవితములో అద్భుతాలు జరుగుటకు ప్రారంభించాయి. సీషా ద్వారా తన ముగ్గురు బిడ్డలను కూడా చదివించుకొనగలిగెను. వారికి చక్కటి విద్యావకాశములు లభించా యి. వారు కష్టపడి చదివారు. మంచి ఉద్యోగములు లభించాయి. వారు అభివృద్ధి నొందిన జీవితాలను కలిగియున్నారు. ప్రతి శుక్రవారము మరియు శనివారము ఆమె ప్రార్థన కొరకు ప్రార్థన గోపురమునకు వచ్చేది. ఆమె దీవించబడెను గనుకనే, తను కూడా ప్రభువు పరిచర్య చేయాలని కోరుకొనెను. కాబట్టి, యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో తను ఆరువారాల పాలిభాగస్థుల శిక్షణ కార్యక్రమములో పాల్గొనవలెనని వచ్చెను. ఆ కార్యక్రమములో పాల్గొనుట ద్వారా ఆమె జీవితమును ఎలా మార్చి వేసినదని ఆమె చెప్పారు. దేవుని ఎలా తెలుసుకోవాలో, ఇతరుల కొరకు ఎలా ప్రార్థించాలో గుర్తించినదని తన సాక్ష్యమును పంచుకొన్నారు. తద్వారా, ప్రార్థన గోపురములో పరిచర్య చేయుటకు ఆమె మొదలు పెట్టినది. ఆ రోజు ఆమెకు రెండు లక్షలు అప్పు ఉండినది. నెమ్మదిగా ఆ అప్పు అంతయు ఆమె తీర్చి వేసుకోగలిగినది. ఆ తర్వాత, ఆమె స్వచ్చంధముగా సేవచేయడానికి ముందుకు వచ్చినది. ఆ సమయములో ఆమె కుమారుడు కూడ ఒక కాలేజిలో సీటు కొరకు ప్రయత్నించాడు. ఆమె ప్రార్థన గోపురములోనికి వెళ్లి ప్రార్థించిన తర్వాత, ఆమె కుమారుడు కావాలనుకున్న కోర్సులో అతనికి ప్రభువు సీటును దయచేశాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఒక ఐటి కంపెనీలో ఉద్యోగమును చేయుచున్నాడు. వారు ఒక కారును కూడా కొనుక్కోగలిగారు. ఇప్పుడు వారికి జీవితములో ఏ అవసరత అనేది కూడా లేదు. నేను ఏ ఉద్యోగము చేయకపోయినను ప్రభువు ఒక యిల్లు కట్టుకొనుటకు దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు అని ఆమె చెప్పినది. నా ఇద్దరు కుమార్తెల యొక్క వివాహము చక్కగా చేయగలిగాను. ఇప్పుడు, ముగ్గురు మనవళ్లతో నేను దీవించబడ్డాను. బేతెస్ద ప్రార్థన గోపురమునకు వెళ్లి, అక్కడ ప్రార్థించి, పరిచర్య చేయుటకు వెళ్లాలని ఆమె ఎంతగానో ఆశపడినది. కానీ, ఇప్పుడు, తనకు అక్కడకు వెళ్లగలిగే అవకాశమును కూడా ప్రభువు ఆమెకు దయచేశాడు. ప్రభువు నా యెడల మరియు నా కుటుంబము పట్ల దయ చూపించాడు అని ఆమె చెప్పగలిగారు. ఒకసారి మొదలైన ఆశీర్వాదాలు ఆలాగుననే కొనసాగుచూనే ఉన్నాయని ఆమె సాక్ష్యమును చెప్పారు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియులారా, నేడు ఈ రోజు నేను సమస్తమును కోల్పోయాను, నేడు నా జీవితములో అంతయు చెదరిపోయినది, నా తల్లిదండ్రులను నా భర్తను, నా భార్యను, మరియు నా ప్రియులను కోల్పోయాను మరియు నేను నమ్మిన వన్నియు కోల్పోయాను అని అంటున్నారా? కానీ, ప్రభువు ఈ రోజు అటువంటి మిమ్మును చూచి ప్రభువు ఈలాగున అంటున్నాడు, 'ఆయనే, మీ బలమునకు అతిశయాస్పదము, ఆయన దయచేతనే మీ కొమ్ము హెచ్చింపబడుచున్నది అని సెలవిచ్చుచున్నాడు.' కనుకనే, ఈ రోజు ప్రభువు దయ మీ మీద ఉన్నది. కాబట్టి, నేడు మీ పరిస్థితి అంతయు ఆయన ఎరిగియున్నాడు. ఆయన మిమ్మును దీవించుటకు మొదలు పెట్టినట్లయితే, ఆలాగుననే, జరుగుతూ ఉంటాయి. మిమ్మును దీవిస్తూనే ఉంటాడు. అవును, ఈ ప్రియ సహోదరి జీవితములో జరిగినట్టుగానే, మీ జీవితములో కూడా అద్భుతాల వెంబడి అద్భుతాలు జరుగుతాయి. తన జీవితములో అన్ని విషయాలలో ఆమె ఆశీర్వదింపబడినది. అదే విధముగా, ప్రియులారా, నేడు ప్రభువు మిమ్మును కూడా ఆశీర్వదిస్తాడు. ఈ రోజు ప్రభువు దయను బట్టి, ఆయనకు వందనాలు చెల్లించుచూ, ఆయన దీవెనలు పొందుకొనండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవే, మాకు బలమును మరియు అతియాస్పదముగా ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, మేము నమ్మిన వాటన్నిటిని కోల్పోయాము. మా జీవితమంతయు దురదృష్టముగా మారిపోయినది. కనుకనే, ప్రభువా, ఈ రోజు మా మీద నీ దయను ఉంచి, మా కొమ్మును హెచ్చించుము. దేవా, మాకు అద్భుతమైన జీవితమును, కుటుంబ జీవితమును దయచేసి, మా అవసరతలన్నిటిని తీర్చుము. ప్రభువా, మాకు ఎటువంటి కొదువ లేకుండా, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదమును పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీవు మాకు బలము, అతియాస్పదము కనుకనే, నేడు నీ బలమును మాకు అనుగ్రహించుము. ప్రభువైన యేసు, మా జీవితంపై నీ దయ ఉంచి మమ్మును పైకి లేవనెత్తుము. ప్రభువా, మా జీవితములో ప్రతి అవసరాన్ని తీర్చి, ప్రతి కొరతను తొలగించుము మరియు మా దుఃఖాన్ని సంతోషంగాను మరియు మా అప్పులను ఆశీర్వాదాలుగా మార్చుము. దేవా, మా జీవితంలోని ప్రతి ప్రాంతంలో నీ ఆశీర్వాదాలు పొంగిపొర్లునట్లుగా చేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.