నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హోషేయ 14:7వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు'' అని చెప్పబడిన ప్రకారము మీరు మొలకెత్తి వికసించబోవుచున్నారు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 66:12వ వచనములో చూచినట్లయితే, "నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృద్ధిగలచోటికి మమ్ము రప్పించియున్నావు'' ప్రకారము ఇది ఈ రోజు మీ కొరకైన ఒక వాగ్దాన వచనము. కనుకనే, నేడు మీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడని వాగ్దానము చేయుచున్నాడు.

నా ప్రియులారా, ఈ ఆశీర్వాదములన్నియు మనము ఏలాగున పొందుకొనగలము? అందుకే బైబిల్ నుండి సామెతలు 28:25వ వచనములో చూచినట్లయితే, " పేరాస గలవాడు కలహమును రేపును యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును'' అని చెప్పబడిన ప్రకారము మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మిక మాత్రము ఉంచండి. మనము ఒంటరి తనమును మరియు ఏమియు లేని ఒక శూన్య భావమును ఎదుర్కొన్నప్పుడు, మనము ప్రభువు వైపు చూచునట్లుగా ఆయన మనకు అటువంటి కృపను అనుగ్రహిస్తాడు. మా ఆధ్యాత్మిక జీవితము ఆరంభములోనే ప్రభువు మాకు ఈ విషయములన్నిటిని నేర్పించియున్నాడు. అప్పుడు మాకు ఎన్నో అవసరతలు ఉండేవి. ఎటువంటి మనుష్యుల యొద్దకు మేము ఎన్నడును వెళ్లలేదు. నేను మరియు నా భర్తగారు ఎల్లప్పుడు ప్రభువు యొద్దకు ప్రార్థనా పూర్వకముగా వెళ్లేవారము. అందుకే, బైబిల్ నుండి సామెతలు 28:25వ వచనములో చెప్పబడినట్లుగానే, "యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును'' అని మనము చదువగలుగుచున్నాము.

మా కుటుంబ జీవితములో ప్రారంభములో మేము అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉండేవారము. మాకు ధనము ఉండేది మరియు శాంతి, సమాధానము మా జీవితములలో కూడా ఉండేది కాదు. కానీ, వీటన్నిటి మధ్యలో ప్రభువు యొద్దకు సమీపముగా రావడానికి ఆయన మాకు నేర్పించియున్నాడు. మేము ప్రభువు వైపు చూస్తూ, ఆయనను విశ్వసించడము నేర్చుకున్నాము. అప్పుడు ప్రభువు మాకు అన్నిటిని సమాధానముగా సమకూర్చేవారు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23:1 వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని దావీదు భక్తుడు అంటున్నాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగియుండుట వలన సమస్తమును సమృద్ధిగా పొందుకున్నాడు. ఆలాగుననే, కీర్తనలు 23:6వ వచనములో చూచినట్లయితే, "నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను'' అని చెప్పబడిన ప్రకారము దావీదు మరణము పొందునంత వరకు దేవుని యొక్క సమృద్ధి దీవెనలను పొందుకున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు ప్రతి ఒక్క విషయము కొరకు ప్రభువు వైపు చూచే అలవాటును మీరు కూడా అలవాటును చేసుకొనండి. అది చిన్న విషయమైనా లేక పెద్ద విషయమైనా మరి దేనికొరకైనా ప్రభువు వైపు మాత్రమే చూడండి. గట్టిగా ఆయనను హత్తుకొనండి. వెంటనే ఆయన సన్నిధిలో మోకరించండి. అప్పుడు దేవుని యొక్క సమృద్ధియైన దీవెనలను మీరు పొందుకుంటారు. ఆలాగునే నా జీవితములో దేవుని యొక్క సమృద్ధి దీవెనలను నేను కూడా పొందుకున్నాను. అదేవిధముగా, మీరు కూడా దేవుని యొక్క సమృద్ధియైన దీవెనలను పొందుకొనుట కొరకు మిమ్మును మీరు దేవుని హస్తాలకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా సమృద్ధియైన దీవెనలతో నింపి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనములు. ప్రభువా, మా యొక్క మొఱ్ఱలను ఆలకించుము. దేవా, మేము ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నను సరే, నీ యొక్క బలమైనశక్తి ద్వారా వాటన్నిటి నుండి బయటకు వచ్చునట్లుగా చేయుము. దేవా, మా మీద నీ యొక్క బలమైన హస్తమును ఉంచి, మమ్మును నీ యొక్క బలముతో బలపరచుము. ప్రభువా, మా జీవితములో సమస్తమును అద్భుత రీతిగా మార్చివేసి, సమృద్ధిగల చోటికి మమ్మును నడిపించుము. దేవా, నీ యొక్క సమృద్ధియైన దీవెనలతో మమ్మును ఆశీర్వదించి, మా యొక్క అవసరతలన్నిటిని క్రీస్తుయేసులో తీర్చుమని వేడుకొనుచున్నాము. ప్రభువా, ఈ రోజు మేము నిన్ను పరిపూర్ణముగా నమ్మాలని నిర్ణయించుకున్నాము. దేవా, ప్రతిదానికి మేము ఎల్లప్పుడు నీ వైపు చూడడానికి మాకు నేర్పించుము. ప్రభువా, అవసరతలలో, మాకు పోషకునిగా ఉండి, మమ్మును నీ యొక్క సమాధానములోనికి నడిపించుము. యేసయ్య, మా జీవితములో మేము ఎటువంటి భయం లేదా సందేహం లేకుండా నిన్ను నిర్భయముగా అంటిపెట్టుకుని జీవించడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీ యొక్క బలమైన హస్తము ద్వారా మేము వర్ధిల్లునట్లుగాను మరియు వికసించునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలను మేము పొందుకొనుటకు మాకు నీ కృపను అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.