హలో నా ప్రియ స్నేహితులారా, నేటి ఆశీర్వాదము అనే సందేశము ద్వారా మీకు మరల శుభములు తెలియజేయుటలో నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. నేటి ఆశీర్వాదము అనే సందేశము ద్వారా అనేకమైన ఆశీర్వాదములను పొందుకుంటున్నాము అని అనేకమంది మాకు తెలియజేయుచున్నారు. కనుకనే, మీ జీవితములో దేవుని యొక్క మంచితనమును తెలియజేయుచూ, మీరు పంపించిన మెయిల్స్, కామెంట్స్‌ను చదివి, మేము ఎంతో సంతోషించుచున్నాము. ప్రతిరోజు మీరు దేవుని వాగ్దానములను, పొందుకుంటూ, స్వీకరించుచుండగా, దేవుని యొక్క గొప్ప తనమును మీరు చూచుచున్నారు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 15:16వ వచనమును మన కొరకు ఇవ్వబడినది. ఆ వచనము, "నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని...నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి'' అని చెప్పబడినట్లుగానే, అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుని మాటలు మన హృదయమునకు సంతోషమును మరియు ఆనందమును కలుగజేయుచున్నది. ఇంకను, "నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని'' అని వ్రాయబడినది. భక్తుడైన యిర్మీయాకు ఆనందమును ఇచ్చినది అదియే అయి ఉన్నది.
నా ప్రియులారా, ఈ లోకములో, నేడు మనము ఒత్తిడికి గురియైనప్పటికిని, మనము సంభరము జరుపుకొంటున్నప్పుడు, మన దుఃఖాన్ని మరచిపోవాలనుకుంటున్నప్పుడు, మనము ఫోన్ చూస్తుంటాము. ఇంకను ఒక మంచి రెస్టారెంట్‌ను వెతుక్కుంటూ వెళ్ళతాము. మనము అక్కడకు వెళ్లి, అక్కడకు వెళ్లి, అక్కడ ఉన్న ఆహారమునంతటిని తీసుకొని తినవలెననియు, మన సమస్యలన్నియు మరచిపోవాలి అనుకుంటాము. అలా చెబుతూ, ఒక పోస్టు పెడతాము. ఇది మా మనస్సుకు కావలసి ఆహారమై యున్నదని చెబుతాము. తద్వారా, మాకు ఇది ఎంతో సమాధానమును ఇచ్చుచున్నది మరియు మాకు ఎంతో ఆనందమును కలుగజేయుచున్నది అనియు, మా దుఃఖమంతటి తర్వాత, మా బాధనంతటిని తర్వాత, మా ఒత్తిడి అంతటి తర్వాత, ఒకవేళ మీ ఉద్యోగము స్థలములలోను, పని స్థలములోను, ఎంతో ఒత్తిడికి గురియగుచున్నారేమో? లేక మీ బాంధవ్యములలో ఓటమిని ఎదుర్కొంటున్నారేమో? మీ కుటుంబములో అనేకమైన ఒత్తిడిలను ఎదుర్కొంటున్నారేమో? ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? ఆ ఒత్తిడిలన్నిటిని దాచిపెట్టడాని కొరకే, మేము వెళ్లి బిర్యాని తింటాము అనుకుంటున్నారేమో? సమస్యలన్నియు మరచిపోవడానికి, మేము తిన్నప్పుడు మాకు సమాధానము కలుగుతుంది. ఇంకను మేము కడుపు నిండుగా తిన్నట్లయితే, మాకు హాయిగా ఆనందమును కలుగుతుంది. మా ఒత్తిడిలన్నియు ఒక క్షణము మరచిపోతాము అని అనుకుంటున్నారేమో? ఆహారము భుజించిన తర్వాత, చక్కగా నిద్రపోతాము. అయితే, కళ్లు తెరచిన వెంటనే మన ఒత్తిడి మరియు మన దుఃఖములన్నియు తిరిగి మన యొద్దకు వస్తాయి. మన మనస్సు సందేహములతో నిండిపోతుంది. మన మనస్సు ఒత్తిడితో నిండిపోతుంది.
అయితే, నా ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథము ఈలాగున అంటున్నది. ఆ వచనము, మత్తయి 4:4వవచనములో మనము చూచినట్లయితే, " అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడియున్న దనెను'' అని చెప్పబడినట్లుగానే, మన జీవితములో ఈ మాటలు ఏమి చేస్తాయి? మనకు ఏమి ఇస్తాయి? బైబిల్ నుండి యోహాను 6:33వ వచనములో చెప్పబడినట్లుగానే, "పరలోకము నుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చు నది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని వారితో చెప్పెను'' ప్రకారము అయితే, నా ప్రియ స్నేహితులారా, ఈ మాటలు మనకు జీవమును కలుగజేస్తాయి. ఈ జీవముతో మనము నింపబడినప్పుడు, నిత్యానందము మనకు కలుగుతుంది. అంతమాత్రమే కాదు మన హృదయములను ఆనందభరితులనుగా చేయుచున్నది. తద్వారా, మనము దేవుని ఆనందముతో నింపబడతాము. ఈ ఆనందము తాత్కాలికమైనది కాదు, ఈ సంతోషమును వెలిసి పోదు. కానీ, మన హృదయములో ఈ సంతోషముతో నింపబడుతుంది. కానీ, మన హృదయము పొంగుతూ ఉంటుంది. కాబట్టి, మీరు ఈ రోజు దేవుని వాగ్దానములను మీ హృదయములోనికి మరియు ఆత్మలోనికి పొందుకుంటుండగా, యిర్మీయా భక్తుడు చెప్పిన రీతిగా ఆ మాటలను మన ప్రాణములోనికి మనము భుజించినప్పుడు మనము దేవుని ఆనందముతో నింపబడతాము. తద్వారా, మన హృదయాలు ఆనంద భరితులనుగా మార్చబడుతాయి. అంతమాత్రమే కాదు, మనకు సమాధానము కలుగుతుంది మరియు మనకు స్పష్టత ఉంటుంది. మనకు బలమును ఇస్తాయి. మనము ఇక నిద్రపోము కానీ, మన జీవితములో దేవుని మాటలు మనము ఏమి చేయాలో మనకు స్పష్టముగా తెలియజేయుచున్నవి. కాబట్టి, నా ప్రియులారా, ఈ రోజు దేవుని వాగ్దానములను పొందుకొనండి, మీ జీవితమునకు కావలసిన దేవుని మాటలను మరియు మీ జీవితమునకు దేవుని నడిపింపును, మీరు ఆయనతో నడుస్తుండగా, ప్రభువు మనకు తన సంతోషమును అనుగ్రహిస్తాడు. అవును, నా ప్రియులారా, ఇటువంటి జీవితమును నేడు మీరు పొందుకొనండి. మీకు సంతోషమును కలుగుతుంది. ఈ వాగ్దానమునకై దేవునికి వందనములు చెల్లించుదామా?ఈ ఆనందమును పొందుకుందామా? దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, ఈ రోజు నీ వాగ్దానములన్నిటిని జ్ఞాపకము చేసుకొను కృపను మాకు దయచేయుము. దేవా, నీ వాక్యమును నమ్మగలిగే కృపను మాకు దయచేయుము. ప్రభువా, మా జీవితమునకు కావలసిన దిక్కుసూచివలె ఉంచండి. దేవా, నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా, మాకు అది జీవాహారమై ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మా ఆత్మకు కావలసిన ఆహారమై ఉండును గాక. దేవా, నీ మాటలు మాకు సంతోషమును చేకూర్చునట్లుగాను, నీ మాటలకు లోబడుతూ, విశ్వసించుచుండగా మా హృదయాన్ని సంతోషముతో నింపబడునట్లుగా చేయుము. ప్రభువా, ఈ రోజు నిన్ను విశ్వసించు కృపను మరియు నీ మాటలను అనుసరించు కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీ వాక్యాన్ని నమ్మి, దానిని మా జీవితానికి మార్గదర్శకంగా స్వీకరించడానికి మాకు సహాయం చేయుము. దేవా, ఈ రోజు, మేము నీ వాక్యాన్ని నమ్మి దానికి విధేయత చూపినప్పుడు, అది మాకు ఆనందాన్ని కలిగించునట్లుగా చేయుము మరియు అది మా హృదయాన్ని సంతోషంతో నింపునట్లుగా చేయుము. ప్రభువా, ప్రతిరోజూ నీపై నమ్మకం ఉంచి, నీ వాక్యం ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


