నా ప్రియ స్నేహితులారా, దేవుడు తన పరిపూర్ణమైన వాగ్దానములోనికి మనలను నడిపించుచుండగా, నేటి దినమున ఆయన స్వరమును మనము ఆలకించుదాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 21:22వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో ఏమని చెబుతుందనగా, "...నీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక'' అవును, మీరు చేయు సమస్త పనులన్నిటిలోను దేవుడు మీతో కూడా ఉంటున్నాడు. అపవాది ఈ ఆలోచనను నిరుత్సాహపరుస్తాడు. దేవుని ప్రజలతో, 'దేవుడు మీతో కూడా లేడు,' అని అపవాది మీతో చెప్తుంటుంది. ఇంకను, 'ఆయన ఆశీర్వాదాలకు మీరు యోగ్యతను కలిగియున్నారని భావించుచున్నారా? దేవుడే మీకు సహాయము చేయుటకు మీకు తగిన అర్హత కలిగియున్నట్లుగా మీరు తలంచుచున్నారా? మీరు పాపగ్రస్థమైన వారు కదా! మీరు ఆయన లక్ష్యాన్ని చేరుకోలేరు కదా! ' మనము ఇట్టి వచనమును నమ్మకుండా ఉండునట్లుగా, ఇట్టి ఆలోచనలను మన మనస్సులో పరిభ్రమించునట్లుగా అపవాది చేస్తుంటాడు. కానీ, ఆయన కనికరమును బట్టి, దేవుడు మనతో కూడా ఉండులాగున దిగివచ్చియున్నాడు. ఎందుకనగా, మొదట మనము ఆయనను ప్రేమించలేదు గానీ, ఆయనే మనలను ప్రేమించాడు. మొదటగా ఆయన మనలను ప్రేమించాడు గనుకనే, మనము ఆయనను ప్రేమించుచున్నాము. ఆయన తన ప్రాణమును మన కొరకు సమర్పించాడు. కనుకనే, స్నేహితులారా, నేడు మీరు, 'యేసయ్యా, నా కొరకు ప్రాణము పెట్టినందుకై నన్ను నీ రక్తము ద్వారా కడిగినందుకై, నాతో కూడా ఉంటున్నందుకై నీకు వందనాలు' అని చెప్పి ఆయనను మీరు స్వతంత్రికొనండి. అప్పుడు మనము చేయు ప్రతి కార్యములలో దేవుడు మనతో కూడా ఉన్నాడని యెరిగి ఉంటాము.

నా ప్రియులారా, దేవుడు మనతో ఉన్నప్పుడు, మనం చేయుచున్న ప్రతి తప్పును ఆయన సరిదిద్దుతాడు మరియు మనం ప్రయాణిస్తున్న తప్పుడు మార్గం నుండి మనలను దూరం చేస్తాడు. మనము ప్రయాణిస్తున్న తప్పు మార్గమును ఆయన తొలగించివేస్తాడు. ఆయన మన కోసము నియమించిన మార్గములో మనలను విజయవంతముగా నడిపిస్తాడు. ఆయన మన హృదయాలను ఇది దేవుని చిత్తము అన్నట్లుగా భావించునట్లుగా నడిపిస్తాడు. అందులో గొప్ప శాంతిని మీరు అనుభూతి చెందుతారు. దేవుడు ఈ రీతిగా మిమ్మును నడిపించుచున్నాడు. అటువంటి నడిపింపును పొందడానికి, మీరు చేయవలసినదల్లా ఒక్కటే, మీ మార్గములను ఆయనకు అప్పగించండి, ఆయన మన మార్గములను సరాళము చేయును. మీరు చేయు ప్రతి కార్యమును కూడా ఆయనకే అప్పగించండి. ఆయన చేయు ప్రతి కార్యములో మనతో ఉండి, మనలను నడిపిస్తాడు.

నా ప్రియులారా, ఇటీవల కాలములో నాకు జన్మించిన, నా చిన్న కుమారుని జెడన్ యొక్క విషయములో కూడా దేవుడు మమ్మును చక్కగా నడిపించాడు. నా కుమారుడు గర్భములో ఉన్నప్పుడే, 'ప్రభువా, నీకు ఏది ఇష్టమో ఆ రీతిగా నా కుమారుని నడిపించుము. నీవు వాని కొరకు ప్రణాళిక చేసిన మార్గములో నీవు తీసుకొని వెళ్లుటకు మమ్మును నడిపించుము. నీ చిత్తమేమై యున్నదో దానిని వాని జీవితములో జరిగించుము' అని నేను మరియు శిల్పా వానిని మేము దేవునికి అర్పించియున్నాము. తద్వారా, దేవుడు మాకు కావలసిన భీమాను వాని కొరకు కనుగొనులాగున మమ్మును నడిపించాడు. ఇంకను సరైన వైద్యులను వాని కొరకు ఏర్పాటు చేయుటకు నడిపించాడు, చక్కగా శిల్పా వానిని గర్భము ధరించడానికి మరియు ప్రసవించడానికి సహాయము చేశాడు. జనన విధానమును ఆయన ఆశీర్వాదకరముగా చేసియున్నాడు. అద్భుతమైన బిడ్డగా, ఆయన ఆ విధంగా వానిని బయటకు తీసుకొని వచ్చాడు. అన్నియు కూడా దేవుడు వాని పట్ల జాగ్రత్తగా వహించాడు. ఒక్కొక్కటిగా మేము లోకరహితముగా మేము పొందుకొనియున్నాము. ప్రతి విషయములో కూడా మేము దేవుని చూచియున్నాము. నా ప్రియులారా, ఆలాగుననే, దేవుడు నేడు మీతో కూడా రావడానికి వేచియున్నాడు అని నేను నిశ్చయముగా నమ్ముచున్నాము. కనుకనే, మీరు మీ జీవితాలను దేవునికి సమర్పించినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీకు తగిన కాలమందు అన్నిటిని చేయుటకు మీతో కూడా ఉండి, ఆయన ప్రణాళికలను మీ జీవితములో జరిగించునట్లుగా మిమ్మును నడిపిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము చేసే ప్రతి పనిలోను నీవు మాతో ఉన్నావని నీ వాగ్దానానికి ధన్యవాదాలు. దేవా, మేము సమస్తమును నీ చేతులకు అప్పగించుచున్నాము. దేవా, మేము చేయు ప్రతి కార్యములలోను, దైవ సన్నిధిచేత మమ్మును నడిపిస్తున్నదన్న అనుభూతిని మేము కలిగియుండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మమ్మును నడిపించుము, ఇబ్బందికరమైన సమయములలో కూడా, ప్రతి ఫలము వెంబడి ప్రతి ఫలమును మేము చూచునట్లుగా మాకు కృపను దయచేయుము. దేవా, మేము ఈ లోకాశలను, నీ యొక్క సమాధానముతోను, విశ్వాసముతోను, జయించుటకు కృపను దయచేయుము. దేవా, అపవాది మేము అర్హులము కాము అని మాతో చెప్పుటకు ప్రయత్నించినప్పుడు కూడా, నీ దయ మరియు ప్రేమ ద్వారానే మేము నిలబడతామని నీవు మాకు గుర్తు చేసినందుకై నీకు వందనాలు. యేసయ్య, మా కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చినందుకు, నీ రక్తంతో మమ్మును కడిగినందుకు మరియు ఎల్లప్పుడూ మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. దేవా, ప్రతి తప్పుడు మార్గం నుండి మమ్మును దూరంగా నడిపించు, మరియు మా జీవితానికి నీవు సిద్ధపరచిన విజయం మరియు శాంతి మార్గంలోకి మమ్మును నడిపించుము. దేవా, ఈ రోజు మేము మా మార్గాలన్నింటినీ నీకు సమర్పించుకొనుటకును మరియు మా మార్గాన్ని సరిచేయడానికి మేము నిన్ను నమ్ముచున్నాము. దేవా, మా జీవితములో నీ కృపతో మేము ప్రకాశించుటకు సహాయము చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.