నా ప్రియమైన వారలారా, ఈ నూతన మాసములో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మిమ్మును ఆశీర్వదించును గాక. ఈ నెల వాగ్దానముగా బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:19వ వచనమును దేవుని యొద్ద నుండి పొందుకుందాము. ఆ వచనము, "కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును'' ప్రకారం కాగా మన దేవుడు క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. మన ప్రేమగల దేవుడు మనకు సరఫరాను అనుగ్రహించు దేవుడై యున్నాడు. బైబిల్‌లో యాకోబు 1:17వ వచనమును మనము చదివినట్లయితే, "శ్రేష్ఠమైన ప్రతియావియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును...'' ప్రకారం ఆయన మనకు మంచి యీవులను అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. ప్రతి పరిపూర్ణమైన యీవులను ఆయన యొద్ద నుండి మనకు లభించును. ఆయన మనకు తండ్రిగా ఉండి, యిట్టి యీవులను అనుగ్రహించుచున్న దేవుడుగా ఉన్నాడు. మనకు ఆయన ధారాళముగా అనుగ్రహించుచున్నాడు. ఆయన దయగల వాడు. ఎందుకంగా, తన పిల్లలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయకండి. ఇంకను బైబిల్‌లో మత్తయి 7:11వ వచనవము చూచినట్లయితే, భూసంబంధమైన తల్లిదండ్రులు తన పిల్లలకు మంచి యీవులను ఎలా ఇవ్వాలో గుర్తెరిగియున్నట్లుగానే, " పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యావుల నిచ్చును గదా '' అని యేసు సెలవిచ్చాడు. మన తండ్రియైన దేవుడు మనకు మంచి యీవులను ఇవ్వడంలో మన పట్ల ఆనందించుచున్నాడు. కాబట్టి, ఆయన నేడు కూడా మీకు సమస్తమును అనుగ్రహిస్తాడు. ఆయన మనకు భౌతిక ఆశీర్వాదాలను మాత్రమే కాకుండా, అన్నింటికంటే గొప్ప వరముగా కొలతలేకుండా ఆయన పరిశుద్ధాత్మను కూడా మీకు అనుగ్రహిస్తాడు. బైబిల్‌లో, యోహాను 3:34వ వచనములో చూచినట్లయితే, యేసు కొలతలేకుండా పరిశుద్ధాత్మచేత నింపబడ్డాడని మనము చూడగలము. అదే తండ్రి, అదే కొలతతో పరిశుద్ధాత్మచేత నేడు మిమ్మును కూడా నింపుచున్నాడు. ఇంకను లూకా 11:12,13 వ వచనములను చూచినట్లయితే, యేసు, " కాబట్టి మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి యావులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను'' మరియు యోహాను 7:37-39వ వచనములలో చూచినట్లయితే, యేసు కూడా ఇలాగున అన్నాడు, "యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు'' ప్రకారం, ఎవరైనను దాహం గొనినట్లయితే, వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన ఇచ్చు నీళ్లు త్రాగినప్పుడు వారిలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆ జీవజల నదులు పరిశుద్ధాత్మయే అని చెప్పబడియున్నది. అవును, అదే దేవుడు నేడు, మిమ్మును కూడా తాజాగా మరియు శక్తివంతమైన మార్గములో తన పరిశుద్ధాత్మ చేత నింపాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

1980వ సంవత్సరములో, నాకు 18 ఏండ్ల ప్రాయములో, యేసు నా యొక్క జీవితాన్ని మార్చినప్పుడు, నేను ఆయనకు, "ప్రభువా, నా యౌవన ప్రాయములో పరిశుద్ధముగా జీవించుచూ మరియు ముందుకు సాగి వెళ్లడానికి తగిన బలము నాలో లేదు, నాకు పరిశుద్ధాత్ముడు కావాలి'' అని నేను మొఱ్ఱపెట్టాను. ఇంకను రోమీయులకు 8:26వ వచనము ఈలాగున చెబుతుంది, ఎందుకనగా, " పరిశుద్ధాత్ముడు మన బలహీనతలో మనకు సహాయము చేస్తాడు, ఆయన మనలను బలపరుస్తాడు. దేవుని ఆత్మ యెక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్య్రము ఉంటుంది. కనుకనే, నాకు నీవు కావాలి, నాలోనికి రమ్ము '' అని నేను ఆయనకు మొఱ్ఱపెట్టాను. ఒకరోజు రాత్రంతయు కూడా నేను మొఱపెడుతున్నాను. అయితే, వేకువ జాముననే, ఒక సంతోషము నన్ను నింపినది. నేను మోకరించి ప్రార్థించుచుండగా, సంతోషము నాలో పొంగిపొర్లుచుండెను. నేను దేవుని సన్నిధితో నింపబడుట ద్వారా నేను వణికిపోతున్నాను. నేను నూతన భాషయైన అన్యభాషను మాట్లాడుటకు మొదలు పెట్టాను. నా హృదయము దేవునికి ఆలయముగా మారినది. అవును, ఆ రోజు నుండి, పరిశుద్ధాత్మ నాకు అత్యంత సన్నిహిత స్నేహితుడుగా నాతో కూడా ఉంటూ, ఈనాటివరకును ప్రతిరోజూ నన్ను నడిపిస్తున్నాడు. ఇది, ఎంత గొప్ప సంతోషము కదా. మీరు కూడా ఈ ఆనందాన్ని పొందుకొనవచ్చును. దేవుడు మిమ్మల్ని నింపడానికి మరియు మీకు సమస్తమును సరఫరా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు.

నా ప్రియులారా, దేవుడు విత్తువాడికి విత్తనాన్ని మరియు గొప్ప పంటను కూడా దయచేస్తాడు. ఇంకను ఆయన జీవమును అనుగ్రహిస్తాడు. ఆలాగే, యోహాను 11:25 వ వచనములో, యేసు ఇలాగున అంటున్నాడు, "నేనే పునరుత్థానమును మరియు జీవమునై యున్నాను, మీరు నాయందు విశ్వాసముంచినట్లయితే, మీరు మరణించినను తిరిగి మరల జీవించెదరు.'' మీరు నిర్జీవంగా లేదా పాపంలో చిక్కుకున్నట్లు అనిపించినా, ఆయన మిమ్మును తన పరిశుద్ధతలోనికి నడవడానికి పైకి లేవనెత్తుతాడు. ఆలాగుననే, యోహాను 10:10 ప్రకారం, యేసు మనకు సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చాడు. కనుకనే, మీరు ఆయనతో సమీపముగా నడిచినప్పుడు ఈ లోకంలో ఏదీయు మిమ్మల్ని నాశనం చేయలేదు. దేవుని సమృద్ధి నుండి మనం ఎలా పొందుకుంటాము? ఇంకను లూకా 6:38వ వచనములో యేసు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.'' మీరు దేవునికి ఇచ్చినప్పుడు, ముఖ్యంగా మీకు అవసరమైన సమయంలో, దేవుడు ఇతరులు మిమ్మును ఆశీర్వదించునట్లుగా చేస్తాడు. ఆలాగే, మలాకీ 3:10వ వచనములో చూచినట్లయితే, "మీ దశమభాగాలను ఆయన దగ్గరకు తీసుకురండి '' అని చెబుతుంది. మీరు ఆయన ఇచ్చినప్పుడు, ఆయన పరలోక ద్వారములను తెరుస్తాడు. ఇంకను సామెతలు 3:9వ వచనమును మనము చూచినట్లయితే, మన సంపదతో మరియు మన ప్రథమ ఫలాలతో ప్రభువును ఘనపరచాలని మనకు బోధించుచున్నది, అప్పుడు వర్థిల్లత మన యొద్దకు వస్తుంది. మీ రాబడి అంతటిలో పదియవ భాగము దేవునికి ఇవ్వడం అనేది ఆశీర్వాదమునకు సూత్రం. మీరు దేవుడిని ప్రత్యక్షంగా చూడకపోవచ్చును, కానీ ఆత్మలను ఓదార్చే, స్వస్థపరచే మరియు రక్షించే ఆయన పరిచర్యకు మీరు ఇవ్వవచ్చును. ఈ పరిచర్యలు దేవునిపై ఆధారపడి ఉంటాయి మరియు ఆయనకు ఇచ్చిన దానిని ఆయన విస్తరింపజేస్తాడు. యేసుకు తన పడవను ఇచ్చి, ప్రతిఫలంగా గొప్ప చేపలను పొందిన పేతురు వలె, దేవుడు తన పనికి ఇచ్చేవారిని విస్తారముగా ఆశీర్వదిస్తాడు.

ఆలాంటి ఆశీర్వాదమును పొందుకున్న నిజమైన సాక్ష్యం ఇదిగో మీ విశ్వాసము కొరకు. సోదరి లతాబాలన్ ఆచార్య మరియు ఆమె భర్త ముంబైలో ఎంతో పేదరికంలో నివసించారు. ఒక రోజు, వారు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురానికి వచ్చి దేవుని ప్రేమను అనుభవించారు. ఆమె కొన్ని నాణ్యములను మాత్రమే దేవునికి ఇచ్చింది, మరియు వేదిక మీద నుండి ఒక మాట ఆమె దృష్టిని ఆకర్షించింది - 'మీ దుఃఖం సంతోషంగా మారును.' త్వరలోనే, ఆమె భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది మరియు వారి కుమార్తె పరీక్షలలో 99 శాతం మార్కులు సాధించింది. వారు యేసు పిలుచుచుచున్నాడు పరిచర్యకు నమ్మకంగా మరియ క్రమముగా ఇచ్చుటకు మొదలు పెట్టారు. మరియు దేవుడు వారి ఆదాయాన్ని విస్తరింపజేశాడు, వారికి ఒక స్వంత గృహము మరియు కారును కూడా ఇచ్చాడు మరియు వారి గౌరవాన్ని పునరుద్ధరించాడు. అవును, నా ప్రియులారా, ఆలాగుననే, నేడు దేవుడు మీ పట్ల దానిని జరిగిస్తాడు. కనుకనే, నేడే దేవునికి ఇచ్చుటకు మొదలు పెట్టండి, అప్పుడు అది మీకు తిరిగి నిండు కొలతతో ఇవ్వబడుతుంది. కనుకనే, ఆయనను నమ్మండి మరియు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఈ యొక్క నూతన మాసమంతయు ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా పరిపూర్ణ దాతగా ఉన్నందుకు నీకు వందనాలు. దేవా, క్రీస్తుయేసు మహిమలో మా ప్రతి అవసరమును తీరుస్తావని నీవు వాగ్దానం చేసినట్లుగానే, యేసయ్యా, మా ప్రతి అవసరమును నేడు నీ ఐశ్వర్యము చొప్పున నీ మహిమలో తీర్చుము. దేవా, ఇప్పుడు మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతో నిండుకొలతతో నింపుము. దేవా, ఆత్మ దాహముతో ఉన్న మమ్మును నీ యొక్క జీవజల నదులు మాలో ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, మా కొరతను కాదు, నీ యొక్క సమృద్ధిని నమ్మడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా అవసరమైన సమయాలలో కూడా ఉత్సాహముగా మరియు ధారాళముగా నీకు ఇవ్వడానికి మాకు నేర్పించుము. తండ్రీ, నీ పరలోకపు వాకిళ్లు తెరిచి, నీ యందు గుప్తములై ఉన్న ఆశీర్వాదములను మరియు సర్వసంపదలను మా మీద కుమ్మరించుము. ప్రభువా, మేము పవిత్రతలో నడవడానికిని మరియు నీ యొక్క సమృద్ధి జీవమును పొందుకొనునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, మాకు ఉన్న ప్రతిదానితో నిన్ను ఘనపరచడానికి మమ్మును నీ మహిమైశ్వర్యములోనికి నడిపించుము. దేవా, మా జీవితంలో నమ్మకంగా ఉండి ఆశీర్వదించడానికి మరియు సమస్తమును సరాఫరా చేయుటకుకృపను దయచేయుమని యేసు నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.