నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు చంటి బిడ్డల వలె మనలను మోయు నిమిత్తము ప్రభువు నేడు మనతో కూడా ఉండి యున్నాడు. బైబిల్ నుండి యోబు 5:11వ ప్రకారం ఆయన తన వాగ్దానాన్ని మనకు పోషణగా అనుగ్రహించుచున్నాడు. ఆ వచనము, " అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును'' ప్రకారం అవును, ఎవరైతే, జీవితములో అత్యంత అడుగు భాగములో ఉన్నట్టుగా అనుభూతి కలిగియున్నారో? సహాయము లేకుండా బాధపడుచున్నారో? అటువంటి వారిని పైకి లేవనెత్తుట ద్వారా ఆయన ఉన్నత స్థలమునకు చేరుస్తాడు. అయితే, ఈ లోకము ఆ రీతిగా పనిచేయుట లేదు. ఒక దేశం గురించి,దాని ప్రభుత్వం గురించి ఎవరో మాట్లాడటం ఒకసారి నేను విన్నాను, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రజలను ఎలా అణగదొక్కుతుందో, వారు వారిని చదువు కొనకుండా ఉంచుతారు, వారు పేదరికంలో జీవించునట్లుగా దీనత్వములోనికి తీసుకొని వెళ్లతారు మరియు వారు ఉన్నతముగా ఎదుగుటకు వారి యొద్ద వచ్చు ప్రతి అవకాశాలను నిరాకరిస్తుంటారు. అవినీతి మార్గాల ద్వారా, వారు దోపిడీ చేస్తారు, ప్రజల యొద్ద వారికి రావలసిన వాటన్నిటిని వారు రాబట్టుకుంటారు. వారి యొద్ద నుండి ధనమును, వారి ఆస్తులను, వారి భూములను వారు ఆక్రమించుకుంటారు. వారి యొద్ద ఏమి లేకుండా వారిని వట్టి చేతులతో పంపిస్తుంటారు. ప్రజలను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచుతారు. మరియు మనుగడ కోసం ప్రభుత్వంపై ఆధారపడతారు, తద్వారా అధికారంలో ఉన్నవారు ధనవంతులుగా మరియు నియంత్రణలో ఉంటారు. ఎల్లప్పుడు వారు ప్రభుత్వ సహకారము కొరకు ఎదురు చూచునట్లుగా చేస్తారు. తద్వారా, ఐశ్వర్యవంతులైన ప్రభుత్వపు వారు, పేదలైన వారికి సహాయము చేయుచు, ప్రభుత్వ పరిపాలన ఎల్లప్పుడు వారి ఆధీనములో ఉండాలని వారు కోరుకుంటారు.

నా ప్రియులారా, ఈ లోకము ఆ రీతిగా పనిచేయుచున్నది. ఈ లోక ప్రజలు అట్టి రీతిగా ఉండియున్నారు. కానీ, మన దేవుని యొక్క హృదయమును చూడండి. ఈ లోకముకంటె భిన్నముగా ఉన్నది. ఆయన ఒంటరిగా ఉన్నవారిని అత్యున్నత స్థాయిలో ఉంచవలెనని ఆయన మన పట్ల కోరుచున్నాడు. ఆయన ఎల్లప్పుడు అంగలార్చుచున్న వారిని పైకి లేవనెత్తజేయవలెనని కోరుచున్నాడు. ప్రతిఒక్కరు కూడా ఆయన క్రింద ఎంతో తక్కువ స్థాయిలో ఆయన క్రింద ఉండాలని తాను ఎన్నడును కోరుకొనుట లేదు. తన బిడ్డలైన మనము ఉన్నత స్థాయిలో ఉండాలని నిత్యము కోరుకుంటాడు. ఆయన మన కోసం పరలోకంలో తన మహిమాన్వితమైన స్థలాన్ని కూడా సిద్ధం చేసియున్నాడు. ఆయన సిలువలో దొంగతో ఏమని చెప్పాడనగా, "నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని సెలవిచ్చియున్నాడు.'' ఆ ప్రకారముగానే, దేవుడు మహిమవంతమైన స్థలములలో ఉన్నతముగా మనము ఆయనతో కూడా ఉండునట్లుగా లేవనెత్తుచేయువాడుగా ఉన్నాడు. కనుకనే, అట్టి అత్యున్నతమైన స్థానమును ఆయన మీకు కూడా ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నా డు. దేవుడు మిమ్మును హెచ్చించినప్పుడు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొనండి, ఆయన క్రింద దీనులుగా ఉండండి. దేవుని యెదుట మీ హృదయములో దీనత్వము గలిగియుండండి. తద్వారా, దీనులుగా ఉన్నవారిని మరల మరల పైకి లేవనెత్తుతాడు. మీ హృదయములో మరియు మీ ఆత్మలో మీరు హెచ్చిపోయినట్లయితే, ఆయన మిమ్మును మరల, మరల పైకి లేవనెత్తలేడు కదా! కాబట్టి, మీరు పరిశుద్ధంగా ఉండండి, ఎల్లప్పుడు ఆయన మిమ్మును అత్యున్నత స్థలములో ఉంచుతాడు.

నా ప్రియులారా, నేడు మీరు కూడా దీనులను ఏమాత్రము తృణీకరించకండి, వారిని తక్కువ అంచనా వేయకండి. ఎందుకనగా, పైన చెప్పబడిన వచనము ప్రకారము అట్టివారిని దేవుడు ఉన్నతమైన స్థలములో ఉంచునట్లుగా దృఢ నిశ్చయమును చేసుకొనియున్నారు. కనుకనే, వారు మీ యొద్దకు వచ్చినప్పుడు, వారిని ప్రేమించండి, మీరు వారి పట్ల కనికరము చూపండి, వారికి సహకరించండి మరియు వారి కొరకు ప్రార్థించండి. దీనుల కొరకు మన హృదయాలను మనము తెరచినట్లయితే, ఈ రోజున దేవుని యొద్ద నుండి గొప్ప ఔన్నత్యము అను వరమును మనము పొందుకుంటాము. కాబట్టి, మీరు కూడా దీనత్వము కలిగి దేవుని యొద్దకు వచ్చినట్లయితే, ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నీ యొద్దకు దీనులముగా వచ్చుచున్నాము. యేసయ్యా, మేము నీ వలె ఎంతో అవమానము, ఒత్తిడి గుండా వెళ్లియున్నాము, మా కుటుంబము ద్వారా మరియు మా సమాజములోను, మా ఉద్యోగములోను దీనులుగా ఉన్నాము. కనుకనే, దేవా, ఈ రోజున మా మీద నీ దృష్టిని సారించి, నీ మీద ఆధారపడియున్న మమ్మును దీన స్థితి నుండి పైకి లేవనెత్తుము. ప్రభువా, మాకు ఉన్నతమైన పేరును, స్థాయిని అనుగ్రహించి, మమ్మును ఉన్నత స్థలములకు లేవనెత్తుము. ప్రభువా, దీనులను ఉద్ధరించి దుఃఖించువారిని ఓదార్చుటకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఇప్పుడు కూడా, నీవు మా బాధను, మా అనుదిన పోరాటాలను, మా కన్నీళ్లను నీవు మౌనముగా చూస్తున్నావు. ప్రభువా, నన్ను ఉన్నత స్థితిలో ఉంచుతానని వాగ్దానం చేసినందుకు మరియు నీ సన్నిధిలో మాకు మహిమాన్వితమైన స్థలాన్ని సిద్ధం చేసినందుకు నీకు వందనాలు. ప్రభువా, దయచేసి మా హృదయాన్ని దీనత్వముగాను మరియు మా ఆత్మను పరిశుద్ధంగాను ఉంచి, తద్వారా మేము ఎల్లప్పుడు మమ్మును లేవనెత్తు నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. దేవా, దీనులను ప్రేమించడం మరియు శ్రద్ధ వహించడం, వారి కొరకు ప్రార్థించడం మరియు నీవు మాకు సహాయం చేసినట్లుగానే వారికి కూడా సహాయం చేయడం మాకు నేర్పించుము. దేవా, మా జీవితం నీ కనికరము మరియు కృపకు సాక్ష్యంగా ఉండునట్లుగా చేయుమని సమస్త ఘనత నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.