నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి జెఫన్యా 3:17 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఈ వచనము నా భర్తగారికి చాలా ఇష్టమైన వచనము. ఆ వచనము, " నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును'' అని చెప్పబడిన ప్రకారం ఈ వచనము భావోద్వేగాలతో నిండి ఉన్నది. మన ప్రభువు మనకు దూరంగా లేడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, మనం జీవించే ప్రతి చిన్న అంశంలోనూ గాఢంగా పాలుపంచుకొనుచున్నాడు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం - ఏ సమయమైనా, మనం ఆయనకు మొఱ్ఱపెట్టవచ్చును. ఆయనకు మన మీద ఉన్న ప్రేమ ఎంతో గొప్పది; మన కోసం తన ప్రాణమునే అర్పించాడు. మన ప్రభువైన యేసు సిలువపై ప్రతి కార్యమును సంపూర్తి చేసాడు, తద్వారా మనం ఆయన ప్రేమ చేత శాంతముగా ఉండగలము. ఆయన మనలను శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు. ఆయన మనకు సమీపముగా ఉండటమే కాదు, ఆయన మనలను రక్షించడానికి కూడా శక్తిమంతుడు. కనుకనే, ఆయన మనలను బట్టి ఆనందించుచున్నాడు. కాబట్టి, నేడు మీరు ప్రభువునందు ఆనందించండి.
నా ప్రియులారా, దేవుడు మనలను బట్టి ఎలా ఆనందిస్తాడు? అందుకే బైబిల్‌లో యెషయా 62:5 వ వచనమును మనము చూచినట్లయితే, ఆ వచనము ఇలాగున చెబుతుంది, "వనుడు కన్యకను వరించి పెండ్లి చేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసికొనెదరు పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును'' ప్రకారం ఆయన ప్రేమలో ఉన్న లోతు అలాంటిది. లోకం మనలను తీర్పు తీర్చవచ్చును లేదా ఖండించవచ్చును, కానీ దేవుని ప్రేమ నిబంధనలతో కూడినది కాదు. దేవుని ప్రేమ షరతులు లేనిది. ఆయన ప్రేమ ఎటువంటి పరిమితులకూ లోబడి ఉండదు. ఆయన ప్రేమకు ఎటువంటి ఆటంకము లేదు. ఆయన ఎల్లప్పుడూ మీ ప్రక్కనే ఉంటాడు, మిమ్మల్ని ప్రేమించుచున్నాడు మరియు మీ యందలి ఆనందించుచున్నాడు. యేసు సిలువపై మరణించిన తరువాత, శిష్యులు ఆయనను ఎంతగానో కోల్పోయారు. తద్వారా, వారి హృదయాలు కలత చెందాయి. బైబిల్‌లో లూకా 24వ అధ్యాయములో, వారు ఎమ్మాయుకు వెళ్ళే దారిలో వారు ప్రయాణించుచున్నప్పుడు, యేసు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. చివరిగా, శిష్యులు లూకా 24:32 లో ఇలాగున అన్నారు, "అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. ''
అవును నా ప్రియులారా, ఇది యేసు తన శిష్యుల పట్ల చూపిన ప్రేమ. మరియు యేసు కూడా మిమ్మును అదేవిధంగా ప్రేమించుచున్నాడు. ఆయన మీ పట్ల ఆనందించడమే కాకుండా, మీరు ఆయన వాక్యాన్ని చదివిన ప్రతిసారీ తన గురించి కూడా మీకు బోధిస్తాడు. ఆయన మిమ్మును ఎంతగా ప్రేమించుచున్నాడు చూడండి. అందుకే రోమీయులకు 10:17వ వచనములో చెప్పినట్లుగానే," కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును'' ప్రకారం కాబట్టి మీరు బైబిల్‌ను తెరిచిన ప్రతిసారీ, యేసును మీ కొరకు హత్తుకొనండి. అప్పుడు ఆయన వచ్చి మీ హృదయంలో కూర్చుంటాడు. ఆయన మీ పట్ల సంతోషిస్తాడు. ఆయన మీ హృదయం నుండే ఆనందముతో హర్షించి మీ యందలి ఆనందిస్తాడు. యేసు ప్రేమ తల్లి ప్రేమలాంటిది. కనుకనే, ఆయన మనలను కౌగిలించుకుంటాడు, మన యందలి ఆనందముతో హర్షిస్తాడు మరియు నిద్రపుచ్చుతాడు. నేను దీనిని అనేకసార్లు అనుభవించాను. నా జీవితములో నేను కన్నీళ్లతో పడుకున్న రాత్రులలో, ప్రభువు నా చెవులలో నిశ్శబ్దంగా, మెల్లని స్వరంతో, 'నా బిడ్డా, పడుకో. నేను నీ కోసం ఇక్కడ ఉన్నాను ' అని అంటాడు. నా ప్రియ స్నేహితులారా, నేడు ప్రభువు మిమ్మును నిజంగా ప్రేమించుచున్నాడు మరియు మిమ్మును బట్టి ఆనందించుచున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మిమ్మును ప్రేమించేవారు ఎవరూ లేరని ఎప్పుడూ చెప్పకండి. దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును, మీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి మీ యందలి సంతోషముచేత ఆయన హర్షించి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు. దేవా, నీవు మా యందలి ఆనందంతో హర్షించుచున్నావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, నీ యొక్క ప్రేమతో మా హృదయాన్ని శాంతము వహించునట్లు చేసినందుకు నీకు కృతజ్ఞతలు. యేసయ్యా, ఒక పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించునట్లు నీవు మమ్మును గూర్చి సంతోషించుము. ముఖ్యంగా రాత్రి నిశ్శబ్ద సమయాలలో కూడా, నీ నిశ్శబ్దమైన, మెల్లని స్వరాన్ని వినడానికి మాకు నేర్పించుము. దేవా, మేము అలసిపోయినప్పుడు, మమ్మును నీ చేతులతో ఎత్తిపట్టుకొనుము. ప్రభువా, మేము అనుదినము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నీతో నడుస్తున్నప్పుడు మా హృదయం ఆనందంతో మండునట్లుగా చేయుము. ప్రభువైన యేసు, మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిని మరియు శాంతిని అనుభవించగలిగేలా సిలువపై పనిని పూర్తి చేసినందుకు నీకు వందనాలు. దేవా, ఈ రోజు మేము నిన్ను మరల మా హృదయంలోనికి ఆహ్వానించుచున్నాము. ఓ ప్రభువా, మా పట్ల ఆనందించుము మరియు నీ ఆనందాన్ని మేము నిత్యము అనుభవించునట్లుగా చేయుమని మా సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.