నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములను తెలియజేయుచున్నాను. ఈ రోజు సెప్టెంబర్ 4వ తారీఖు, ఈ రోజు నా ప్రశస్తమైన కుమారుడైన డాక్టర్. పాల్ దినకరన్ యొక్క జన్మదినముగా ఉంటున్నది. ప్రభువు నా కుమారుని గొప్పగా ఆశీర్వదించి, తన మహిమార్థమై ఇంకా అత్యధికముగా తన యొక్క పరిచర్యలో వాడుకొనును గాక.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కొలొస్సయులకు 3:15వ వచనము తీసుకొనబడియున్నది. ఆ వచనము, "క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి'' అని చెప్పబడినట్లుగానే, దేవుని సమాధానము మీ హృదయములు ఏలవలెనని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, నేడు దేవుడు మీకు తన యొక్క శాంతి సమాధానములను మీకు అనుగ్రహించుచున్నాడు.
నా ప్రియులారా, ఈ లోకములో మనము అనేకమైన విషయముల ద్వారా చింతలతో బాధపడుతూ ఉంటాము. అనేకమైన ప్రతికూల అంశములు మనలను ఇబ్బంది పెడుతూ ఉంటాము. ఇంకను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటాము. మనము జీవితములో కలిగియుండవలసిన విషయములను ఎన్నో లేకుండా బాధపడుతుంటాము. బిడ్డలులేక, ధనములేక, కుటుంబములో సమాధానములేక, ఆరోగ్యములేక, ఇల్లులేక, మరి ఇంకా ఎన్నో విషయములు లేకుండా మనము ఎంతగానో బాధపడుచూ ఉంటుంటాము. ఇలాగున ఎన్నో ప్రతికూల పరిస్థితులను మనము మన అనుదిన జీవితములో ఎదుర్కొంటుంటాము కదా.
అందుకే బైబిల్ నుండి సంఖ్యాకాండము 6:26వ వచనమును మనము చూచినట్లయితే, "యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు నేడు మీకు సమాధానమును కలుగజేయుచున్నాడు. అవును, నా ప్రియులారా, దేవుని యొక్క ముఖకాంతి, మీ మీద ప్రకాశించినప్పుడు, దైవీకమైన సమాధానమును మీరు నిశ్చయముగా పొందుకుంటారు.
అయితే, దాని కొరకు మనము ఏమి చేయాలి? అంటే, మనము దేవుని విశ్వసించవలెను. ఆయన సన్నిధానములో ఆయన కొరకు ప్రతి దినము వేచియుండాలి. ప్రభువునకు మనము ఎల్లప్పుడు మొఱ్ఱపెడుతూ ఉండవలెను. కనుకనే, మనము, 'ప్రభువా, మా జీవితములో సమాధానము లేదయ్యా,' అని ఆయనను అడగాలి. 'ప్రభువా, మా గృహములో సమాధానము లేదు, నీ ప్రభావమంతటితో దిగివచ్చి, మమ్మును నీ యొక్క సమాధానముతోను మరియు నీ సన్నిధితోను నింపుమయ్యా,' అని ఆ విధంగా ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, నిశ్చయముగా, మీరు సమాధానముతో నింపబడతారు.
నా ప్రియులారా, మనకు సమాధానమును అనుగ్రహించుట కొరకే, ఆయన మన యొక్క సమాధానార్థమైన శిక్షను యేసు ప్రభువు తన మీద వేసుకున్నాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 53:5వ వచనములో చూచినట్లయితే, "మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, మన యొక్క యతిక్రమక్రియలనుబట్టి నిమిత్తము మన ప్రభువైన యేసుక్రీస్తు గాయపరచబడియున్నాడు. అందుకే మనము ఆయన పాదాల చెంత వేచియున్నప్పుడు, ఆయన సంపాదించిన సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు.
రెండవదిగా, నా ప్రియులారా, మనము ఆయనకు మొఱ్ఱపెట్టవలెను. అప్పుడు ప్రభువు మీకు తన యొక్క దైవీకమైన సమాధానము అనుగ్రహిస్తాడు. ఎవరైతే, మాకు సమాధానము లేదు అని చెబుతున్నారో? మీరు ఆయన యొద్దకు రండి, ఇప్పుడే ప్రభువు సన్నిధానములో మొఱ్ఱపెట్టండి. అప్పుడు, ఆయన యొక్క దైవీకమైన సమాధానముతో మిమ్మును నింపుతాడు. అటువంటి సమాధానమును మనము పొందుకొనుటకు ఆలాగున మనలను మనము సమర్పించుకున్నప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క దైవీకమైన సమాధానమును మీకు అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న ప్రియ తండ్రీ, నీవే సమాధానకర్తవు. నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ఈ రోజు సమాధానము లేని మా జీవితాలలో సమాధానకారకుడవైన నీవు మాకు సమాధానమును అనుగ్రహించుము. యేసయ్యా, సమాధానము లేకుండా ఉన్న మేము నీ సన్నిధానములో మొఱ్ఱపెట్టుచున్నాము, మా జీవితములో అనేకమైన ఇబ్బందులను పెట్టియున్న సాతానును నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, మాకు అనేకమైన అవసరతలు కలవు. కనుకనే, ప్రభువా, నీ ప్రభావమంతటితో దిగివచ్చి, మమ్మును నీ సన్నిధితో నింపి, మా యొక్క అవసరతలన్నిటిని తీర్చుము. యేసయ్య, సమాధానము లేని మా జీవితాలలో సమస్త జ్ఞానమునకు మించిన నీ యొక్క దైవీకమైన సమాధానమును మా హృదయాలలో ఏలునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, అపవాది మా జీవితాలలో అనేక సమస్యలను తీసుకొని వచ్చినను, మాకు అనేక అవసరతలు ఉన్నను, వీటి కారణముగా మేము మా సమాధానమును కోల్పోయి ఉన్నాము. తద్వారా, ప్రభువా, దుఃఖించుచున్న మాలోనికి నీ మహిమతో వచ్చి, మొఱ్ఱపెట్టుచున్న మాలో ప్రతి ఒక్కరిపైనా నీ అమూల్యమైన హస్తమును ఉంచుము. దేవా, సమస్త జ్ఞానమునకు మించిన నీ దైవీకమైన సమాధానముతో మమ్మును నింపి, మా యొక్క ప్రతి చింతను, బాధను తొలగించుము. ప్రభువా, నీ యొక్క సన్నిధి మా యొక్క ప్రతి ఇంటిని, ప్రతి హృదయమును మరియు మమ్మును ఆనందభరితులనుగాను, సంతోషముతోను నింపుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


