నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 30:5వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వెలుగు మీ మీద ప్రకాశించుచున్నది. ఎందుకనగా, మీరు ఆయనను వెదకుచూ వచ్చియున్నారు. కనుకనే, ఈ రోజు వాగ్దానము ప్రకారము దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవి. కాబట్టి, ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెముగా ఉన్నాడు. అవును, నిజముగానే, దేవుని మాటలు లోపరహితమైనవి. ఆయన మాటలు పనిచేయకుండా, ఏ ఒక్కటి కూడా నేలను పడిపోదు. ఒక్క మాట కూడా నెరవేర్చబడకుండా పోదు. అవు ను, ఆయన మాటలు నిష్ఫలముగా నేలకు మరలక అవి అనుకూలమైనదాని నెరవేర్చును మరియు ఆయన పంపిన కార్యమును సఫలము చేయును. కనుకనే, ఆయన వాక్యము చేత మీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యము మీ హృదయములో మంటలను కలుగజేయుచున్నది. కాబట్టి, మీరు దేవుని వాక్యమును బట్టి ఆనందించండి, అట్టి ఆశీర్వాదము మీ చెంతకు వచ్చినందుకు మీరు దానిని పొందుకొనండి. ఆ తర్వాత, ఏ సందేహము మరియు ఎటువంటి భయము ఉండదు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

అవును నా ప్రియులారా, కొన్ని ఫర్యాయములు అది మనలోనికి రావడానికి కొంత సమయము కావచ్చును. కానీ, స్నేహితులారా, ఆ వాక్యము నిశ్చయముగా మీ యొద్దకు వస్తుంది. కనుకనే, అట్టి నిరీక్షణతో, ఆ వాక్కు ద్వారా దేవుడు మనలను దీవిస్తాడు అని మనము సంతోషించవలెను. అంతమాత్రమే కాదు, మన స్వంత జీవితము కొరకు దానిని మనము స్వంతం చేసుకొని , మన కొరకు అంగీకరించవలెను. ఆలాగుననే, ఈ వచనము ఆయనను ఆశ్రయించువారికి కేడెము అని తెలియజేయుచున్నది.

నా ప్రియులారా, ఆయనలో ఆశ్రయము స్వీకరించుట అంటే ఏమిటి? ఆయన స్వరమును అంగీకరించుట మరియు దేవుని స్వరమును ఆలకించుటయే మరియు ఆయన మాటలను స్వీకరించుటయే. కాబట్టి, మీరు ఈ మాటలను పొందుకున్నప్పుడు, మీరు దేవునిలో ఆశ్రయమును అంగీకరించుచున్నారు. కేవలము ఒక భవనములోనికి వెళ్లి, క్షేమముగా ఉన్నామనుకొని యోచించడము కాదు. ఒక కూటమునకు వెళ్లి, నేను ఆశ్రయములో ఉన్నా ను అని భావించడము కాదు. ఇది దేవుని వాక్యమును స్వీకరించుటయే. ఇది దేవుని వాక్కులను అంగీకరించుటయే. ఈ వాక్కులు మిమ్మును భద్రపరచుచున్నది. ప్రతి ఆశీర్వాదమును ఆ వాక్యానుసారముగా తీసుకొని వచ్చుచున్నది. అదియే దేవుని యందలి ఆశ్రయమును స్వీకరించుటయే. గృహములో కూడా ఏమని చెబుతారు? మీరు యింటిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు క్షేమముగా ఉన్నారని చెబుతారు కదా! ఎందుకంటే, బయట ఉన్న చెడు ప్రభావములన్నిటి నుండి మీరు తప్పించబడి, మీరు క్షేమముగా ఉంటారు. కనుకనే, క్షేమమును ఇచ్చు దేవుని వాక్యమును మీరు గట్టిగా హత్తుకొన్నప్పుడు, నిశ్చయముగా, ఆ వాక్యము మీ జీవితములో బలమముగా పనిచేయుచున్నాడు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, మన బిడ్డలు ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే, వీధులలో ఉన్న చెడు ప్రభావముల నుండి కాపాడబడి మరియు వారు క్షేమముగా ఉండగలుగుతారు. వారు ఈ లోకములో నేర్చుకుని చెడు మార్గముల నుంచి దూరముగా ఉండి క్షేమముగా ఉంటారు. ఎందుకనగా, గృహములో వారి యింట మంచి సంగతులను వారు నేర్చుకుంటారు. ఆ రీతిగానే, దేవుని మాటలు మనలను క్షేమముగా ఉంచడానికి మంచి ప్రభావమును మనకు కల్పించి, అవి మనకు కేడెముగా ఉంటాయి. అవి మన జీవితములను మరియు మన మార్గములను భద్రపరుస్తాయి. నా ప్రియ స్నేహితులారా, ఆ వాక్యము లోపరహితమైనది. కనుకనే, మనము ఆయనను స్తుతించుచూ, ఎల్లప్పుడు, ఆయన వాక్యము అంగీకరించు హృదయముతో స్వీకరించుందామా?ఆలాగైతే, నేడు మీరు కూడా దేవుని వాక్యమును మీ హృదయములోనికి అంగీకరించి, ఆయన మాటలకు చెవి యొగ్గినట్లయితే, నిశ్చయముగా, ఆ మాటలు మీ జీవితములో పనిచేయకుండా నిష్ఫలముగా మరలక, ఆ వాక్యము మీ కార్యములను నెరవేర్చును. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా యొక్క ప్రతి పరిస్థితిలోనూ నమ్మదగినదిగాను, బలమైనదిగాను, నిష్కళంకమైన నీ వాక్యమునకు నీకు వందనములు. ప్రభువా, వాక్యము కొరకు ఎదురుచూస్తూ, కనిపెట్టు విధానమును మాకు దయచేసినందుకై నీకు వందనములు. ప్రభువా, మేము నీ వాగ్దానములను ఆశ్రయించుచూ, ఏ సందేహం మరియు భయం లేకుండా నిన్ను నమ్ముటకును మరియు నమ్మి నీ సన్నిధికి వచ్చుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా యొక్క ప్రతి దుష్ట ప్రభావం, అనారోగ్యం మరియు కీడు నుండి మా జీవితమును కాపాడుచూ మరియు నీ కేడెమను కృపతో మమ్మును కప్పుము. తండ్రీ, నీ వాక్యం పట్ల తీవ్రతను మరియు నీ స్వరమును ఎల్లప్పుడు వినే హృదయాన్ని మాకిమ్ము. దేవా, నీ వాక్యము మాలో సజీవంగా ఉండి, మా జీవితంలో అద్భుతములను, ఆశీర్వాదములను మరియు పరివర్తనను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ స్వరమును ఆలకించవలెనని మేము కోరుచున్నాము. దేవా, మేము వాక్యమును చదువుచున్నప్పుడు, మాతో మాట్లడుము. ప్రభువా, నీ వాక్యము మాలో జీవమును సంతరించుకొనునట్లుగా కృపను దయచేయుము. దేవా, నీ వాక్యమును మేము అంగీకరించుచుండగా, ఆ వాక్యము మా జీవితములో అద్భుతమును తీసుకొని వచ్చునట్లుగా మరియు ఆ వాక్యము మాకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా కృప దయచేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.