నా ప్రియ స్నేహితులారా, నేడు మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. మరల మిమ్మును కలుసుకోవడం నాకు చాలా సంతోషముగా ఉన్నది. నేడు మనము మన ప్రభువు యొద్ద నుండి ఆశీర్వాదపు జల్లులను స్వీకరిద్దామా? అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 31:16 వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...నీ క్రియ సఫలమై, జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు'' ప్రకారం దేవుడు మన చేతి పనుల ప్రయాసకు తగిన బహుమానము అనుగ్రహించు సమయము ఇది.

నా ప్రియులారా, దేవుడు న్యాయముగా తీర్చువాడని మీకు తెలుసు కదా! కానీ, లోకములో ఆలాగున కాకపోవచ్చును. ఒక గృహపు యజమాని ఉన్నా డు. తన కోసము పనిచేయుచున్న పనివారు అతని యొద్ద ఉన్నారు. కానీ, ఒక వ్యక్తి మంచిగా పనిచేస్తుండేవాడు అతని యొద్ద ఉండెను. అయితే, అందులో ఒక వ్యక్తి మంచిగా పనిచేయుచున్న వాని మీద ఎప్పుడు కేకలు వేయుచుండేవాడు. ఎందుకంటే, అతడు ఎలాగున ఉన్నాడో, అతని యొక్క మాటల తీరు ఇతనికి నచ్చేది కాదు. ఆ వ్యక్తి మీద ఎల్లప్పుడు విరక్తి చెందినట్లుగా ఉండేవాడు. ఎంతగా అతడు మంచిగా పని చేసినను, అతని మీద కేకలు వేయుచుండేవాడు. కేవలం అతని మాటలు ఇతనికి నచ్చేది కాదు. అయితే, మరొక వ్యక్తి ఉండేవాడు. తన యజమాని యెదుట మంచి కనబడాలని ఎప్పుడు చూస్తుండేవాడు. కనుకనే, అతడు ఎల్లప్పుడు తన యజమానికి నమస్కారము చేయుచుండేవాడు. ఇంకను వ్యక్తిగతంగా జాగ్రత్త వహించేవాడు. అతడు మంచిగా పనిచేయకపోయినను సరే, ఆ యజమాని అతనిని ఎంతగానో ప్రేమించేవాడు.

నా ప్రియులారా, ఈ లోకములో మనుష్యులు ఆ రీతిగానే ఉంటారు. మన ప్రయత్నాలన్నియు మనము చేస్తుంటాము కానీ, బహుమానములు మన చెంతకు రావు. కానీ, దేవునికి వందనములు చెల్లించండి. పరలోకమందు మనకొక యజమాని ఉన్నాడు. ఆయన న్యాయముగా తీర్పు తీర్చువాడు. అతి సమృద్ధిగా బహుమానమిచ్చువాడు. అందుకే బైబిల్‌లో మత్తయి 6:4వ వచనమును చూచినట్లయితే, "అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును'' ప్రకారం మనము రహస్యమందు చేయువాటిని చూచి, దేవుడు మనకు బహిరంగముగా ప్రతిఫలమిచ్చుచున్నాడు. నా ప్రియులారా, మనము అటువంటి తండ్రిని ఈ రోజు కలిగి ఉన్నాము. కనుకనే, స్నేహితులారా, మీరు నేటి నుండి ఆయన కొరకు పనిచేయండి, మెళకువగా ఉండండి, శ్రేష్టమైనది చేయండి, ఆయనను సంతోషింపజేయునట్లు చేయండి, ఆయన మీ చేతి పనుల బహుమానమును మీరు చూచునట్లుగా చేస్తాడు. కనుకనే, మనము ఇప్పుడే ప్రార్థనలో అట్టి బహుమానమును పొందుకుందామా? ఆలాగున పొందుకోవాలంటే, ఇప్పుడే, మన పరలోకమందున్న నీతిగల యజమానుని యెదుట మీరు నీతిగా ప్రవర్తించుచు, ఆయన ముందు పనిచేయండి, నిశ్చయముగా నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ చేతి పనులకు తగిన ప్రతిఫలమును మీకిచ్చి మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు మా చేతుల పనిని ఆశీర్వదించుచున్నందుకై నీకెంతగానో వందనాలు చెల్లించుచున్నాము. ఎందుకనగా, నీవు మాకు నీతిగల న్యాయాధిపతి మరియు యజమానియై యున్నావు. కనుకనే, ప్రభువా, మేము చేయుదానికి బహుమానము ఇచ్చు దేవుడవు, నీవు సమృద్ధిగా బహుమానము ఇచ్చువాడు. గనుకనే, మా పని యంతటిని నీ కొరకు మరియు నీ చిత్తము కొరకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మా ద్వారా నీ చిత్తము నెరవేర్పు జరుగుట కొరకై మమ్మును వినియోగించుకొనుము. ప్రభువా, మా చేతి పనులకు తగిన ప్రతిఫలమును బహుమానమును దయచేయుము. దేవా, మేము మా యొక్క పనులకు తగిన ప్రతిఫలమును చూచునట్లు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నీ కొరకు కష్టపడి పనిచేస్తుండగా, ఎంతగానో ప్రయాసపడుచుండగా, దీర్ఘఘంటలు పనిచేయుచుండగా, మా జీవితములో త్యాగానికి ప్రతిగా ఇంకెన్నో ప్రయత్నములు చేయుచుండగా, నీవు మమ్మును గుర్తెరిగి, మమ్మును కౌగలిగించుకొని, మమ్మును ప్రేమించి, ముద్దాడి, మాకు బహుమానమును అనుగ్రహించుము. దేవా, అందరి యెదుట బహిరంగముగా మాకు బహుమానము దయచేసి, ఈ వాగ్దానము మా పట్ల నెరవేర్చుము. దేవా, మనుష్యుల ఆమోదం కొరకు కాకుండా, నిన్ను మాత్రమే సంతోషపెట్టడానికి నీ కొరకు శ్రద్ధగా పనిచేయడానికి దయచేసి మాకు సహాయం చేయుము. ప్రభువా, ఈ లోకం అన్యాయంగా ఉన్నప్పుడు, నీ యొద్దనుండి ప్రతిఫలం తప్పకుండా ఉందని మరియు నీ సమయం పరిపూర్ణంగా ఉందని మాకు గుర్తు చేయుము. ప్రభువా, మా చేతులను బలపరచి, మా హృదయాన్ని స్థిరపరచి, మా శ్రమ ఫలాన్ని మేము చూచునట్లుగా కృపనిమ్మని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.