నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 33:15వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను; అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును'' అని చెప్పబడినట్లుగానే, మన పట్ల కూడా ఆయన నీతి న్యాయములు జరిగిస్తాడు. అదేవిధముగా, బైబిల్ నుండి యిర్మీయా 33:26వ వచనమును చూచినట్లయితే, " భూమ్యాకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని యెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి యెడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను'' అని ప్రభువు సెలవిచ్చినట్లుగానే, ఆయన మన యెడల జాలిపడి, చెరలో నుండి మనలను రప్పించును. ఆలాగుననే, బైబిల్ నుండి యిర్మీయా 32:41వ వచనములో చూచినట్లయితే, "వారికి మేలు చేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను'' అని తెలియజేసినట్లుగానే, దేవుని బిడ్డలారా, ఈ లోకములో మీరు అనేకమైన శ్రమలను కష్టములను ఒకవేళ ఎదుర్కొంటున్నారేమో? మీకు డబ్బు అవసరమై యున్నదేమో? ఆరోగ్యము అవసరమై యున్నదేమో? కుటుంబములో సమాధానము కావలసియున్నదేమో? మిమ్మును మీరు కలవరపెట్టుకుంటూ, చింతపడుతూ, శ్రమను అనుభవించుచున్నారేమో? అయితే, నేను ఎప్పుడు చెప్పుచున్న విధముగా, మనము దేవుని వైపు చూడాలి. మనలను మనము రక్షించుకొనగలిగిన మార్గము అది ఒక్కటే. ఇంకను ప్రభువు మాత్రమే మన ఏకైక నిరీక్షణయై యున్నాడు. కనుకనే, ఆయన ఎన్నటికిని మిమ్మును సిగ్గుపరచడు. దేవుడే మీకు ఏకైక ఆశ్రయం, మరియు ఆయన మిమ్మల్ని ఎన్నటికిని నిరాశపరచడు. కాబట్టి, మీరు చింతించకండి.

నా ప్రియులారా, ఆయన మిమ్మును ఎట్టి విధముగా ఆశీర్వదించవలెనని కోరుచున్నాడు? అని చూచినట్లయితే, అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:30వ వచనమును చదివినట్లయితే, "మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీకు నూతన జీవమును ఇవ్వాలని అనుకుంటున్నాడు. నా ప్రియులారా, దేవుడు నూతనమైన జీవమును మరియు నూతనమైన ఒక ప్రత్యేకమైన జీవితమును మీకు అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. దేవునితో అన్యోన్యసహవాసముగల జీవితము, అన్నియు దేవునికి ఇష్టమైన కార్యములను జరిగించే జీవితమును కలిగి ఉండాలి. అవును, సౌలు మరియు పౌలుగా మార్చబడియున్నాడు. సమరయ స్త్రీ విలువైన ముత్యముగా మార్చబడినది. జక్కయ్య దేవుని వైపు చూచినప్పుడు, అతని కుటుంబము ఆశీర్వదింపబడినది. కనుకనే, మీరు దేవుని వైపు చూడండి, ప్రభువును గట్టిగా పట్టుకొనండి, ఇంక మీకు వేరే మార్గము ఏదియు లేదు.

నా ప్రియులారా, ఈ లోకములో అనేక శ్రమలు మీకు ఎదురవుతాయి. మీరు అంధకారములో ఉండి ఉండవచ్చును. అయితే, ప్రభువును పట్టుకొనండి, అన్నివేళలలో ఆయన యందు నమ్మకముంచండి, దేవుని వాక్యమును చదవండి. ఆశీర్వాదములన్నిటిని స్వీకరించండి. దేవుని వాక్యములో ఉన్నటు వంటి వాగ్దానాల అనుసారముగా ప్రభువు మీ చెరలో నుండి మిమ్మును నిశ్చయముగా విడిపిస్తాడు. ఒకవేళ మీరు ఇప్పుడు కూడా చీకటిలో ఉన్నారేమో? అయితే, మీరు దేనిని గురించి బాధపడకండి. మనము విడిపించబడునట్లుగా మనము ప్రార్థిద్దాము. ఇప్పుడే ప్రభువును గట్టిగా పట్టుకుందాము. ప్రభువు అద్భుత రీతిగా మిమ్మును కాపాడతాడు. దేవుని వాక్యపు సంతోషము మరియు సమాధానము మీకు కలుగుతుంది. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా శోధనలలోను మరియు చీకటిలోను కూడా, నిన్ను గట్టిగా హత్తుకొని జీవించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ ఆశీర్వాదములన్నిటి కొరకై నీకు వందనములు. ప్రభువా, మమ్మును నీ వాగ్దానములలో నాటుము మరియు మా జీవితము ఫలించునట్లుగా చేయుము. దేవా, నీ దయ మరియు నీతి మా జీవితం మీద ప్రకాశింపజేయుము. ప్రభువా, బైబిల్‌లో, సౌలు మరియు జక్కయ్యలను నీవు మార్చినట్లుగా మమ్మును కూడా మార్చుము. దేవా, ఒక్కసారి చీకటిలో ఉన్న మా జీవితాలను చూడుము, మా ఆశీర్వాదములన్నియు మరియు ఆస్తులన్నియు, ఇంకను ఉద్యోగము, కుటుంబములో సమాధానమును మరియు ఆరోగ్యమును కోల్పోయాము. కనుకనే, నీవు మాత్రమే మాకు నిరీక్షణకర్తవై యున్నావు, తద్వారా, ఎల్లప్పుడు నిన్ను విశ్వసించునట్లుగా, నీ సమాధానము, నీ ఆనందం మరియు నీ దైవీకమైన బలాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా కష్టాల నుండి మమ్మును అద్భుతంగా విడిపించి, మా జీవితం నీ పరిశుద్ధ నామమునకు మహిమ తీసుకొని వచ్చునట్లుగా చేయుము. దేవా, మేము నీ వైపు మాత్రమే చూచుచున్నాము, నీవే మా నిరీక్షణ మరియు ఆనందమునై యున్నావు. కాబట్టి, ప్రభువా, నీ దీవెనలన్నియు మా మీద కుమ్మరించి, మా సమస్యల నుండి మమ్మును విడిపించి, మేము నీ యొక్క వెలుగును చూచునట్లుగాను, ఇప్పుడే, మా జీవితాలను నీ అదుపులోనికి తీసుకొని, మాకు సంతోషము మరియు సమాధానమును కలుగజేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.