నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:19వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును'' అని సెలవిచ్చిన ప్రకారము దేవుడు మీ అవసరతలన్నియు సరఫరా చేయాలని మీ పట్ల కోరుచున్నాడు. ఒకవేళ మీరు అక్కరలలో ఉన్నారేమో?, మీ అవసరతలతో ఉన్నారేమో? మీ అవసరతలతో మీరు బాధపడుచున్నారేమో? అయితే, ప్రభువు ఈలాగున అంటున్నాడు, ' నా ఐశ్వర్యమును మీ కొరకు తెరువజేయుచున్నాను, అది యేసులో ఉండియున్నది, అది మీ అక్కరలన్నియు తొలగించుట కొరకే. కనుకనే, మీరు చింతించకండి. అందునిమిత్తము బైబిల్ నుండి 2 కొరింథీయులకు 8:9వ వచనములో చూచినట్లయితే, " మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు యేసు అను రూపంలో ఈ లోకమునకు దిగివచ్చాడనియు, ఆయన ఎంతగా పేదవాడయ్యాడంటే - ఆయన దారిద్య్రం వలన, మీరు మరియు నేను ఐశ్వర్యవంతులముకాగలమని బైబిల్ చెబుతుంది. కనుకనే, మనము ఐశ్వర్యవంతులము కావలెనని సిలువలో వ్రేలాడదీయ్యబడ్డాడు. ఆయనకు కనీసము వస్త్రధారణ కూడా లేదు. ఆయన దిగంబరిగాను, ఒక అనాథవలె ఉంటూ, రక్తము స్రవించుచూ, సిలువలో వ్రేలాడదీయ్యబడెను. దేవుడే స్వయంగా అటువంటి పేదవానిగా మార్చివేయబడియున్నాడు. ఎందుకనగా, మిమ్మును మీ అక్కరల నుండి బయటకు తీసుకొని రావడము కొరకు, మీకు ఐశ్వర్యమును ఇవ్వడము కొరకు ఈ రోజున మీరు యేసు చెంతకు రండి. మీ కొరకై యేసులో మీకు నిరీక్షణ ఉన్నది. మీరు ఈ లోకములో ఐశ్వర్యము కలిగియుండు నిమిత్తము, మీ ఆత్మలోను, మీ దేహములోను, మీ జీవితములోను, ఆలాగుననే, మీ కుటుంబములోను మీరు ఈ లోకములో ఐశ్వర్యము కలిగి ఉండాలనియు, ఆయన వెల చెల్లించియున్నాడు. నేడు దేవుడు ఇట్టి ఆశీర్వాదమును మీకిచ్చును గాక.

ఇట్టి దేవుని ఐశ్వర్యమును యేసు ద్వారా ఏలాగున పొందుకోవాలి? అని మనము చూచినట్లయితే, మొదటిగా, లూకా 6:38వ వచనములో చూచినట్లయితే, " ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను'' ప్రకారము ఆయన ఈలాగున సెలవిచ్చుచున్నాడు, ' మీ హృదయమును నాకిమ్ము, ప్రజలు మీ ఒడిలో కుమ్మరించునట్లుగా నేను చేయువాడనై యున్నాను,' ఇంకను, మీరు నా యందు నిరీక్షణ ఉంచి, నా చిత్తానుసారముగా జీవించండి, అని సెలవిచ్చుచున్నాడు. అప్పుడు బైబిల్ నుండి, యెషయా 58:7-8వ వచనముల ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించును. రెండవదిగా, ఆయన " బీదలకు ఇవ్వండి, వస్త్రములు లేనివారికి, ఆకలితో ఉన్నవారికి, ఆలాగుననే నివసించుటకు గృహములేనివారికిని, ఆలాగున మీరు చేసిన యెడల మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయుదును. మీ స్వస్థత మీకు శీఘ్రముగా లభించును, మీ నీతి సూర్యుని ప్రకాశము వలె ఉదయిస్తుంది. మీ యొక్క పేరు ఘనత వహిస్తుంది. నేను మీకు ఇట్టి ఆశీర్వాదములను ఇచ్చెదను. మీరు బీదలకు ఇచ్చుచున్నప్పుడు, ఈ ఐశ్వర్యమునంతటిని మీరు కలిగియుండెదరు. మూడవదిగా, నా సేవకులకు ఇవ్వండి ఆయన చెబుతున్నాడు. పేదలకు మరియు పగిలిన హృదయల పట్ల జాగ్రత్త వహించువారికి ఇవ్వండి. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 16:2,3వ వచనములలో దావీదు ఆలాగున చేసియున్నాడు. దేవుని సేవకుల కొరకు మరియు ఆలాగుననే, పరిశుద్ధుల కొరకు కూడా జాగ్రత్త వహించాడు. తద్వారా, దేవుడు తన ఐశ్వర్యమును అతని ఒడిలో కుమ్మరించియున్నాడు.

ఆలాగుననే, నాల్గవదిగా, బైబిల్ నుండి మలాకీ 3:10వ వచనములో చూచినట్లయితే, " నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు'' అని చెప్పబడిన ప్రకారము ప్రజలకు సేవలందించు పరిచర్యలకు మీ కానుకలను, మీ యొక్క పదియవ భాగమును మీరు తీసుకొని రండి. అది బీదలకు సేవలను అందించుచున్నది. అప్పుడు దేవుడు ఆకాశపు వాకిండ్లను విప్పి, మీరు పట్టజాలనంత విస్తారముగా ఆశీర్వదాములను కుమ్మరించును. మీరు పట్టజాలనంత ఆశీర్వాదములను, దేవుని ఐశ్వర్యమును మీకు కుమ్మరిస్తాడు. కనుకనే, మీ యొద్ద నుండి ఆశీర్వాదములను దొంగలించే దుష్ట అపవాదిని దేవుడు శపించువాడై యున్నాడు. మీరు దేవుని సేవా పరిచర్యకు సమర్పించుచుండగా, నిరంతరమునకు దైవాశీర్వాదములను ఆనందించెదరు. ఈ రోజున మీరు ఇచ్చేవారుగా మారండి. మీరు ఇప్పటికే ఒకవేళ ఇచ్చేవారుగా ఉన్నట్లయితే, మీ రోజు దేవుడు మీ అవసరతలన్నిటిని సరఫరా చేస్తాడని మేము నమ్ముచూ ఉన్నాము. మీరు అధికమైన సమృద్ధిని కలిగియుంటారు. ఐశ్వర్యమును, మీ యొక్క ఆత్మలోను, దేవుని సాన్నిధ్యము చేత, మీ చేతులలో ఐశ్వర్యముతో, మీ యొక్క కుటుంబములోను, ఆలాగుననే ఆశీర్వాదములన్నియు, మంచి ఆరోగ్యమును, భత్రయు, నీతిగల పేరును, దేవుని చేతను మరియు మనుష్యుల చేతను ఆలాగుననే, మీరు ఘనపరచబడెదరు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఐశ్వర్యవంతముగా ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపగల పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ఈ ఆశీర్వాదములను మా మీద కుమ్మరించుము. ప్రభువా, మా జీవితములోనికి వాటిని తీసుకొని వచ్చి, మమ్మును వర్థిల్లింపజేయుము. దేవా, కేవలం ధనము మాత్రమే కాకుండా, ఈ జీవితమునకు సంబంధించిన సకల ఆశీర్వాదముల ఐశ్వర్యమును మాకు అనుగహ్రించుము. ప్రభువా, ఇంకను నీ సన్నిధిని మాకు అనుగ్రహించి, మా బిడ్డలు కూడా వర్థిల్లతను పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, మేము ఇచ్చువారముగా మార్చుము. ప్రభువా, మా కొరకు యేసుక్రీస్తు మహిమ ద్వారా నీ శ్రేష్ఠమైన సమృద్ధిని మాకు అనుగ్రహించుము. దేవా, దయచేసి నిన్ను విశ్వసించేలా మరియు ఉత్సాహంగా ఇచ్చువారినిగా మాకు నేర్పించుము. యేసయ్యా, నీకు ఇవ్వడం గురించిన ప్రతి భయాన్ని, సందేహాన్ని మా హృదయం నుండి తొలగించుము. దేవా, పేదలకు మరియు నీ సేవాపరిచర్యలకు ప్రేమతో ఇవ్వడానికి మాకు అటువంటి హృదయమును దయచేయుము. ప్రభువా, మా జీవితము మీద ఆకాశపు వాకిళ్లు విప్పి, పట్టజాలనంతగా నీ యొక్క ఐశ్వర్యమునుబట్టి మా అవసరతలన్నిటి తీర్చుము. దేవా, మా జీవితాన్ని నీ సన్నిధితో మరియు నీ సమృద్ధితో మమ్మును నింపుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.