నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 8:18వ వచనమును తీసుకొనబడినది. ఈ వచనము ప్రకారము దేవుడు మిమ్మును దీవించును గాక. ఆ వచనము, "కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే'' అని చెప్పబడిన ప్రకారం ప్రభువే మీకు భాగ్యమును సంపాదించుకొనుటకు సామర్థ్యమును కలుగజేయుచున్నాడు. ఇంకను శ్రేష్ఠమైన ప్రతి యావియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. కనుకనే, బైబిల్ నుండి సామెతలు 10:22వ వచనమును చూచినట్లయితే, "యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు'' ప్రకారం ప్రభువు మరియు ఐశ్వర్యము ఒకదానితో ఒకటి సంబంధము కలిగియుంటుంది. ఆలాగుననే, బైబిల్‌లో హగ్గయి 2:8వ వచనములో చూచినట్లయితే, "వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు'' ప్రకారం మనము సంపాదించుకొనునది ఆ దినము చివరిలో లెక్కచూచుకున్నప్పుడు, ప్రభువును మనము జ్ఞాపకము చేసుకొనవలెను. ఇది ప్రభువు యొద్ద నుండి మాత్రమే వచ్చినదని చెప్పవలెను. ముఖ్యముగా, మన కొత్త ఉద్యోగము మరియు కొత్త వ్యాపారము ద్వారా వచ్చు మొదటి జీతమును ప్రభువునకు చెల్లించవలెను. ఎందుకనగా, ఐశ్వర్యమును సంపాదించుకొనునది ప్రభువై ఉంటున్నాడు. కనుకనే, మీకు ఏమి లేదని చింతించకండి. నిశ్చయముగా దేవుడు మీకు ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు.

నా ప్రియులారా, మనము ప్రభువునకు శ్రేష్టమైన వాటిని సమర్పించినప్పుడు ఏమి జరుగుతుందని బైబిల్‌లో హెబ్రీయులకు 6:10వ వచనమును మనము చూచినట్లయితే, "మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు'' ప్రకారం మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము దేవుడు ఎన్నటికిని మరచిపోడు. అందుకే బైబిల్‌లో, " ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు'' ప్రకారం మీరు ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, పొంగిపొర్లునట్లుగా మీకు మరల ప్రభువు దయచేస్తాడు. అది మీ ఒడిలో తిరిగి పోయబడును. కనుకనే, మీరు ప్రభువునందు ఆనందించండి.

నా ప్రియ స్నేహితులారా, నేడు ప్రభువు మిమ్మును జ్ఞాపకము చేసుకొని, ఆశీర్వదించును గాక. ప్రభువును మీకు ఐశ్వర్యమును, సంపాదించుకునే కృపను, సామర్థ్యమును మరల ఇచ్చును గాక. కనుకనే, నేడు మన సమయమును మరియు ఐశ్వర్యమును ప్రభువుకు ఇచ్చెదము అని ఒక నిబంధనను మరియు నిర్ణయమును తీసుకుందాము. ప్రభువు మీకిచ్చినది, ఆయనకు తిరిగి ఇచ్చుటకు ఎంతమాత్రము మరచిపోవద్దు. ఆయన మనకు ఇచ్చినది, ప్రభువునకు తిరిగి ఇచ్చెదము. మిమ్మును జ్ఞాపకము చేసుకొని దీవించుటకు ఆయన నమ్మకస్థుడై యున్నాడు. నేడు మీరు ఐశ్వర్యమును, సామర్థ్యమును సంపాదించుకునే బలమును ప్రభువు మీకు ఇచ్చును గాక. ప్రభువును మిమ్మును దీవించును గాక. ప్రభువు హస్తము మీ మీదికి ఇప్పుడు దిగివచ్చుచున్నదని నాకు తెలుసు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా ఆయన హస్తము మీరు భాగ్యమును సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యమును అనుగ్రహించి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకపమందున్న తండ్రీ, ప్రతి శ్రేష్టమైన మరియు పరిపూర్ణమైన యీవులను మాకు ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, సంపదను ఉత్పత్తి చేయడానికి నీవు మాకు ఇచ్చిన బలం, జ్ఞానం మరియు సామర్థ్యానికై నీకు వందనాలు. ప్రభువా, నీ హస్తము మా మీదికి దిగివచ్చి ఉన్నతముగా మమ్మును పైకి లేవనెత్తునట్లు చేయుము. దేవా, మేము ఐశ్వర్యమును సంపాదించుకొనుచుండగా, మేము చేయుచున్న సమస్తమును కూడా నీవు ఆశీర్వదించుము. దేవా, మా యొక్క శ్రమను కష్టమును నీ హస్తము ద్వారా దీవించుము. ప్రభువా, నీ హస్తము మా కొరకు సమస్తమును సమకూర్చునట్లుగా చేసి, నీ హస్తము మా మీద విశ్రమించునట్లుగా చేయుము. దేవా, ఎటువంటి దుఃఖము మా జీవితములోనికి ప్రవేశించకుండా, మమ్మును బలపరచి, మమ్మును ఐశ్వర్యవంతులనుగా చేయుము. ప్రభువా, వెండి మరియు బంగారం నీవేనని, మేము పొందుకున్న సమస్తమును నీ హస్తము ద్వారానే అని మేము అంగీకరించుచున్నాము. దేవా, మా ప్రతి లాభంలో నిన్ను గుర్తుంచుకోవడానికి మరియు మా ప్రధమ ఫలాలతో నిన్ను ఘనపరచడానికి దయచేసి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా శ్రమ నీకు సంతోషాన్ని కలిగించునట్లుగాను మరియు ఆనందం మరియు కృతజ్ఞతతో నీకు ఉత్తమమైనది తిరిగి ఇవ్వడం మేము ఎన్నటికిని మరచిపోకుండా ఉండునట్లుగా చేయుము. దేవా, మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి, మా ప్రయత్నాలను విస్తరింపజేసి మరియు మమ్మును ఇతరులకు ఆశీర్వాదకరమైన పాత్రగా చేయుమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.