నా ప్రియ స్నేహితులారా, సమస్తమును కొరకు మీరు దేవుని సహాయమును ఏ విధంగా పొందుకొనగలరో దాని గురించి మీతో మాట్లాడగోరుచున్నాను. అందుకే నేటి వాగ్దానము బైబిల్ నుండి యెషయా 41:13వ వచనములో ఈలాగున ప్రభువు చెప్పడము మీరు కనుగొనగలరు. ఆ వచనమును మనము చదివినట్లయితే, "నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొను చున్నాను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మనకు సహాయము చేస్తానని సెలవిచ్చుచున్నాడు. మీరు ఎక్కడకు వెళ్లినప్పటికిని సహాయ సమాచారము అందించడానికి సహకారము కొరకు అక్కడ ఒక డస్క్ ఉంటుంది కదా. చాలా సందర్భములలో డస్క్ అక్కడ ఉంటుంది, కానీ, సహాయము చేయు వ్యక్తి అక్కడ కనబడకుండా ఉంటాడు. మీరు అక్కడ నిలబడినను కూడా వారికి వారే మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే, ఆ డస్క్ వెనకల ఉన్న వారికి, ఎదురుగా వచ్చువారికి సహాయము కోరుచున్నవారికి సహాయము చేయడము అనేది వారికి ఆఖరి ప్రాధాన్యతగా ఉంటుంది. ఎందుకంటే, అది సలహా ఇవ్వడము మాత్రమే. వారు ఏదియు కూడా సంపూర్తి చేయవలసిన పని లేదు. కనుకనే, సహాయము కొరకు వారి యొద్దకు వచ్చువారిని గురించి వారు ఏ మాత్రము పట్టించుకొనరు. ఇంకొక దిశ వైపు వేలు చూపిస్తారు. కానీ, " నేను మీకు సహాయము చేయుదును, నేను! సర్వశక్తిగల దేవుడను, మీ సహాయము కొరకు మీ వేదిక వెనకాల మరియు మీ డస్క్ వెనకాల వేచియున్నాను. నేను మీకు సహాయము చేయదును'' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు.
అయితే, నా ప్రియులారా, మరి మీరు ఏమి చేయాలి? అని చూచినట్లయితే, "మీరు నాకు మొఱ్ఱపెట్టుము, నేను మీకు జవాబును అనుగ్రహించెదను. మీరు సహాయ వేదిక యొద్దకు రావలసిన అవసరము కూడా లేదు. కేవలము మీరు మొఱ్ఱపెట్టండి, మీరు ఎక్కడ ఉన్నను సరే, కేవలము మీరు నన్ను పిలవండి. నేను మీ చెంతకు వచ్చెదను, నేను మీ చెంతకు వచ్చెదను. ఇద్దరు లేక ముగ్గురు నా నామము పేరిట చేరియున్నట్లయితే, నేను వారి మధ్యన ఉంటాను'' అని చెబుతున్నాడు. చూడండి, దేవుని హృదయము ఆ రీతిగా ఉండియున్నది. మనమందరము అందుకోసము చేయవలసినదంతయు ఒక్కటే, దేవుని యొక్క కృపా సింహాసనము చెంతకు రావాలి అని లేఖనము చెబుతుంది. కృపా సింహాసనము యొద్దకు రండి, మరియు కరుణా పీఠము ఉన్న సింహాసనము యొద్దకు రండి, సహాయ వేదిక యొద్దకు మీరు వచ్చినప్పుడు, దేవుడు మీ శిక్షావిధిని పలకరు లేక మిమ్మును ఖండించరు. మీరు ఇవన్నియు పూర్తి చేయలేదు కనుకనే, నేను మీకు సహాయము చేయలేను అని ఆయన చెప్పడు. దానికి మారుగా ఆయన మీకు మార్గమును చూపిస్తాడు. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 10:13వ వచనములో చూచినట్లయితే, " సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును'' అని చెప్పబడినట్లుగానే, మీరు పొరపాటు చేసియున్నప్పటికిని, మీకున్న శోధనలన్నిటి మధ్యలో, మీకున్న శ్రమలన్నిటి మధ్యలో కూడా దేవుడు తప్పించుకొను మార్గమును ఆయన మీకు అనుగ్రహించును. అవును, "నేనే మార్గమును, నేను ఈ యొక్క కీడంతటి నుండి తప్పించుకొనే మార్గమును మీ కొరకు జరిగిస్తాను. ఈ యొక్క శోధనలన్నిటి నుండి, ఈ శ్రమలన్నిటి నుండియు, అవును, కృపాసింహాసనమును నేను కలిగియున్నాను '' అని హెబ్రీయులకు 4:16వ వచనములో యేసు సెలవిచ్చుచున్నాడు. అవును, "నా సహాయ వేదిక యొద్ద మీరు కనికరమును, కృపను మీరు పొందుకొనెదరు. మీరు అక్కరలతో వచ్చియున్నప్పుడు, మీ యొక్క క్షమాపణ కొరకు, నేను మీకు కనికరమును చూపించెదను. సమస్తమును సంపూర్తి చేయుటకు తగినంత కృపను నేను మీకు చూపించెదను. నా చిత్తమంతయు సంపూర్తి చేయునట్లుగా, సమస్తమును మేలు కొరకు సమకూడి జరుగునట్లుగా చేయుదును'' అని సెలవిచ్చుచున్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క హృదయమై యున్నది.
కనుకనే, నా ప్రియమైన వారలారా, యేసు చెంతకు రండి, అందుకే బైబిల్ నుండి కీర్తనలు 121:1-2 వచనములలో చూచినట్లయితే, "కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు'' అని చెప్పబడినట్లుగానే, 'నేను నా కన్నులను ఎత్తుచున్నాను, నాకు సహాయము దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది, ఆయన సమస్తమును నా కొరకు జరిగిస్తాడు' అని భక్తుడు చెప్పియున్నాడు. అవును, చాలా సంవత్సరముల క్రితము, మా తండ్రిగారు అనేకమైన సవాళ్ల గుండా వెళ్లియున్నాడు. ఆయన సహాయము కొరకు దేవునికి మొఱ్ఱపెట్టియున్నారు. ప్రకృతికి అతీతమైన రీతిలో పరిశుద్ధాత్మడు ఆయనగారి ఆత్మను పైకి లేవనెత్తియున్నాడు. దేవుని యొక్క సింహాసనము ప్రక్కనే ఆయనను నిలువబెట్టియున్నాడు. యేసు యొక్క సింహాసనము, కృపా సింహాసనము. ఇంకను, విశ్వమంతయు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యెదుట తిరుగుచున్నట్లుగా మా తండ్రిగారు చూచియున్నారు. ప్రతి గ్రహము ఆయన యొద్దకు వచ్చుచూ, పోవుచున్నవి. అవి పరిభ్రమించుచున్నవి. వాటి కక్షలో, వాటి మార్గములలోను పరిభ్రమించుచున్నవి. భూమి కూడా పరిభ్రమించుచున్నవి. అవి ఆయన సింహాసనము యెదుటకు వాటి కక్షలో, పరిభమ్రణ కక్షలో ఆయన యొద్దకు వచ్చినప్పుడు, అవి వంగి ఆయనకు నమస్కారము చేయుచున్నట్లుగా ఉండెను. అప్పుడు, మా తండ్రిగారిని చూచి, ' నా కుమారుడా, నేను విశ్వసమంతటిని, ఏలాగున యాజమాన్యమును చేయుచుండుట నీవు చూస్తున్నావు కదా. వెళ్లుము, నేను నీ చిన్న జీవితమును కూడా యాజమాన్యము చేయుచూ, స్వాధీనము చేసుకొనలేనా? కనుకనే, వెళ్లుము, నేను నీ కోసము సమస్తమును పరిపూర్ణము చేస్తాను '' అని సెలవిచ్చియున్నాడు. ఆలాగుననే, దేవుడు మా తండ్రిగారికి సహాయము చేసియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీకును కూడా సహాయము చేస్తాడు. దేవుని యెదుట మీ కొరకు మధ్యవర్తివలె ప్రార్థన చేయుచూ ఉండియున్నవాడు ఆయనే. అందుకే బైబిల్ నుండి హె బ్రీయులకు 12:24వ వచనములో చూచినట్లయితే, " క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసు నొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు''అని చెప్పబడినట్లుగానే, ఆయన రక్తము మీ కొరకు మంచి యీవులను పలుకుతుంది. యేసు తనను తాను త్యాగము చేసుకొని, స్వయముగా రక్తము చిందించియున్నాడు కనుకనే, మంచితనము అంతయు కూడా మీ యొద్దకు వస్తూనే ఉంటుంది. సమస్త మంచి కార్యములు మీ యొద్దకు వస్తాయి. ఆయన మీకు సహాయము చేస్తాడు. కనుకనే, భయపడకండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, మా కొరకు నీవు ప్రణాళిక చేసి, మంచి తనమంతయు ఇప్పుడే మా యొద్దకు నీ నామము వచ్చునట్లుగా మాకు సహాయము చేయుమము. దేవా, నీ బిడ్డలైన మమ్మును నీ హక్కున చేర్చుకొనుము. దేవా, శాంతియుతమైన భవిష్యత్తును మాకు అనుగ్రహించుము. ప్రియమైన ప్రభువా, ఈ రోజు మా అవసరాలు మరియు భారాలన్నిటితో నీ సహాయ పీఠం వద్దకు వచ్చుచున్నాము. దేవా, మా చేయి పట్టుకొని మాలోని ప్రతి భయాన్ని తొలగించుము. ప్రభువా, మేము విఫలమైన చోట నీ కరుణను మాకు చూపించుము మరియు మేము నీలో బలంగా నిలబడటానికి మాకు కృపను అనుగ్రహించుము. దేవా, ప్రతి శోధనలో మరియు శూధనలలో, మాకు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కల్పించుము. ప్రభువా, నీ చిత్తంలో మేము నడవడానికి మరియు నీ పరిపూర్ణ ప్రణాళికను విశ్వసించడానికి మమ్మును బలపరచుము. దేవా, మా జీవితంతో సహా సమస్తాన్ని నీవే నియంత్రిస్తావని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా యొక్క ప్రతి పరిస్థితి మా మేలు కొరకు మరియు నీ మహిమ కొరకు కలిసి వచ్చునట్లుగా చేయుము. యేసూ, మా సహాయముగా, మా బలముగా, మరియు మా మార్గముగా మాకు తోడుగా ఉండుము. ప్రభువా, ఎల్లప్పుడూ మా మొర విని, మాకు సహాయం చేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


